Prayer
💖 🙏🍀
యెషయా 65:24
వారికీలాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను వారు మనవి చేయుచుండగా నేను ఆలంకిచెదను.
ప్రార్థన
ప్రియమైన పరలోకపు తండ్రి నిత్యము మమ్ములను చూచుచున్న దేవా మమ్ములను సంరక్షిస్తున్న తండ్రి, ఏ సమయంలో ఏది మాకు అవసరమో, వాటి అన్నిటిని ఎరిగి యున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా /నీటి బుగ్గను హాగరు ఎదుటకు తీసుకుని వచ్చి, చూచుచున్న దేవుడు నీవు అని స్తుతింపబడిన దేవా, అప్పటినుంచి ఇప్పటివరకు మారని దేవుడిగా, మార్పు చెందని తండ్రిగా, మీరు మాకు ఉంటూ, మీకు మొర పెట్టే వారికి అతి సమీపంగా ఉండే దేవుడవుగా, మీరు ప్రత్యక్ష పరచుకుంటున్నందుకు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి.
దేవా మీ యందు విశ్వాసముంచు వారు మీపై ఆధారపడే వారు, ఎన్నడూ సిగ్గుపరచబడరని, మా జీవితాలలో మేము మీకు మొర పెట్టే ప్రతి విషయంలో, మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి, మీ సొంత సమయంలో, మా ప్రతి అవసరతను మీరు తీరుస్తున్నందుకు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
29-1-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25