CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

స్వస్థత కొరకు ప్రార్థన ( PCOD సమస్య )

ఎవరైతే ఈ సమస్యతో బాధించబడుతున్నారో వారు దేవుడు నా ప్రార్థనకు జవాబును ఇస్తాడు నా సమస్యను పరిష్కరిస్తాడు అన్న విశ్వాసంతో ఈ సమస్య తగ్గే వరకు ఈ ప్రార్థనతో ఏకీభవించి విశ్వాసంతో ఆమెన్ అని చెప్పుతూ ఉండండి.

ప్రియమైన మా పరలోకపు తండ్రి మాకు ఆరోగ్యమును ప్రసాదించే దేవా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి గాయముల చేత మాకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం ఇచ్చిన తండ్రి

ఎవరైతే అనారోగ్యంతో PCOD సమస్యతో బాధపడుతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి శరీరాలను ఈ క్షణంలో నేను మీ సన్నిధిలో నిలబడి మీ చేతుల్లో ఉంచుతున్నాను. ప్రత్యేకంగా PCOD వంటి హార్మోన్ల అసమతుల్యత నుంచి పూర్తిగా వారి విముక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వీరి శరీరంలోని ప్రతి గ్రంధి ప్రతి ఆవయవం — ముఖ్యంగా అండాశయాలు — మీ ఆజ్ఞకు మీరు సృష్టించిన మీ సృష్టి ప్రకారం లోబడి సక్రమంగా పనిచేయాలని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను.

యెషయా 53:5 ప్రకారం

మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది అని వ్రాయబడిన ప్రకారము మీ సిలువ శ్రమ ద్వారా మాకు స్వస్థత కలుగుతుందని అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాగ్దానమును వీరి జీవితంలో నెరవేరు లాగున విశ్వాసంతో యేసు నామంలో ప్రకటిస్తున్నాను.

నిర్గమకాండము 15:26 ప్రకారము

మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అని మీరు చెప్పిన మాటలు బట్టి మీ ఆజ్ఞలను మీ కట్టడలను హృదయపూర్వకముగా

ఆచరించి సంపూర్ణమైన స్వస్థతను వీరు పోందు లాగూన వీరి పట్ల మీరు కృపను చూపమని బలపరచమని మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నా విజ్ఞాపన ప్రార్థన ఆలకించమని

ఐగుప్తీయులకు కలుగ చేసిన ఎరోగమును కూడా మీకు రానీయ్యనని వాగ్దానం ఇచ్చిన దేవా మీరు కలిగించని ఏ వ్యాధికి కూడా మీ ప్రజల మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాను.

హర్మోన్ల సమతుల్యత క్రమపరచమని స్థిరపరచమని వీరి శరీర బరువు నియంత్రణలోకి రావాలని, శరీర బరువులను తగ్గించుకునే మెలకువను వసతులను వీరికి సమృద్ధిగా అనుగ్రహించి వీరికి కలిగిన అన్ని శారీర సంబంధమైన అనారోగ్య పరిస్థితులు చక్కబడాలని ప్రార్థిస్తున్నాను.

అనరోగ్యం కలిగించే ప్రతి చీకటి శక్తిని, బలహీనతను, నిరాశను, భయాన్ని యేసునామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను . వీరి శరీరంపై, మనస్సుపై, ఆత్మపై మీరే పరిపూర్ణముగా అధికారిగా వుండమని యేసు నామంలో వీరికి నేను స్వస్థతను ప్రకటిస్తున్నాను. శాంతిని, విశ్రాంతిని, ఆరోగ్యాన్ని వీరిలో నిలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా శక్తి, మా ఆశ, మా వైద్యుడవు మీరే అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా మా ప్రార్థనను వినినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీరి విశ్వాసాన్ని బలపరచండి, మీరిచ్చే సమాధానము కొరకు ఎదురు చూడగల శాంతిని సమాధానమును వీరిలో నింపమని యేసు క్రీస్తునామములో ప్రార్థించు చున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.

ఎస్తేర్ క్రైసోలైట్

16-5-2025

💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25