Prayer
💖 🙏🍀
ఆదికాండము 41:అధ్యాయము 32 వ వచనము
ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది.
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన పరలోకపు తండ్రి,
మీ చిత్తమును మీ ఇష్టమును స్థిరపరిచే దేవుడవైన, మీరు మీ ప్రజలమైన మా జీవితాలలో చేసే చేసిన, చేయబోయే ప్రతి నిర్ణయం, అది పవిత్రమైనది, న్యాయమైనది, మరియు శాశ్వతమైనది అది మీ ప్రేమతో కూడినది, అని మనస్పూర్తిగా విశ్వసించి మిమ్ములను స్తుతిస్తున్నాను ప్రభువా
దేవా,
మా జీవితాలలో మీరు సంకల్పించిన మీ నిర్ణయాలు అనేకమార్లు, మా అవగాహనకు మించి మా ఆలోచనలకు అందనివిగా ఉండటము వలన,మీ ఇష్టమును నెరవేర్చలేక మిమ్మల్ని, సంతోష పెట్టలేక మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమ పరచ లేక, పోయిన ప్రతి ఒక్కపరిస్థితిని బట్టి, మమ్ములను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ.
మా జీవితములలో మీరు నిర్ణయించినది అది మా మంచికే, అని మేము నమ్మి మిమ్ములను స్తుతిస్తున్నాము తండ్రి,
మీ చిత్తానుసారముగా జరుగుచున్న ప్రతి కార్యములో, ప్రతి విషయములో మీపై మరింత నమ్మకముతో జీవించగలవారుగా, మీ ప్రజలమైన మేము ఉండగలిగేటట్లు, గొప్ప విశ్వాసంలో మమ్మల్ని బలపరచి స్థిరపరచమని, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రభువా, మీ నిర్ణయాలకు లోబడి మీ సర్వాధికారంలో, శాంతిని సమాధానమును సంపూర్ణమైన విశ్రాంతి పొందగలిగే, పరిశుద్ధాత్మశక్తిని, ఆత్మబలమును మీస్థిరమైన సమాధానమును మాకు అనుగ్రహించండి. తండ్రి !
మీరు నియమించిన కార్యాలు, మా జీవితాలలో నేరవేర్చి, వాటి ద్వారా మీ మహిమను ప్రతిఫలింపజేసే సాధనముగా, మమ్మల్ని వాడుకొని
మీ సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను దేవా !
మీ శక్తి, మీ జ్ఞానము మీ దయపై, పూర్తి నమ్మకముతో ప్రతి రోజూ మీకు సమర్పించబడిన, జీవితాన్ని జీవించగలిగే కృపను, నీ ప్రజలమైన మాకు ప్రసాదించండి దేవా! మీరు నిర్ణయించినది మాత్రమే, మా జీవితంలో జరగునట్లుగా మమ్మల్ని బలపరచండి. !
మా జీవితాలలో మీ శక్తిని మీ సామర్థ్యమును, మీ మహిమను మీ కృపను సంపూర్తిగా, మేము పొందగలుగునట్లు మీ ఆశీర్వాదాలను, మామీద కుమ్మరించండి దేవా !
మా దేశంలో మారాష్ట్రంలో మా పట్టణంలో మా ఆ ప్రాంతాలలో, ఉన్న రక్షణ లేకుండా ఉన్నటు వంటి, ప్రతి ఒక్కఆత్మను స్వస్థపరచమని, వారందరి ఆత్మల మీద, యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువలో చిందించిన, పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించమని, ప్రతి ఒక్కరిని మీ రక్షణతో అలంకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి !
మా వ్యక్తిగత జీవితాల మీద మా కుటుంబాల మీద, మా బంధువుల మీద మా సంఘాల మీద, మా సమాజం మీద మేము చేస్తున్న, సహవాసముల మీద మా దేశము మీద మా రాష్ట్రము మీద, మా ప్రాంతం మీద మా చుట్టుపక్కల నివసిస్తూ ఉన్న ప్రజల మీద, వారి జీవితాలలో వారికి అవసరమై ఉన్నటువంటి, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును కుమ్మరించమని, మీ దీవెనలను వర్షింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి !
ఇంతవరకు నేను చేసిన ఈ ప్రార్థనను ఆలకించి జవాబు మీరు అనుగ్రహించినందుకు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
7-1-2025
💖 🙏🍀
💖 🙏🍀
ఆదికాండము 41:అధ్యాయము 32 వ వచనము
ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది.
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన పరలోకపు తండ్రి,
మీ చిత్తమును మీ ఇష్టమును స్థిరపరిచే దేవుడవైన, మీరు మీ ప్రజలమైన మా జీవితాలలో చేసే చేసిన, చేయబోయే ప్రతి నిర్ణయం, అది పవిత్రమైనది, న్యాయమైనది, మరియు శాశ్వతమైనది అది మీ ప్రేమతో కూడినది, అని మనస్పూర్తిగా విశ్వసించి మిమ్ములను స్తుతిస్తున్నాను ప్రభువా
దేవా,
మా జీవితాలలో మీరు సంకల్పించిన మీ నిర్ణయాలు అనేకమార్లు, మా అవగాహనకు మించి మా ఆలోచనలకు అందనివిగా ఉండటము వలన,మీ ఇష్టమును నెరవేర్చలేక మిమ్మల్ని, సంతోష పెట్టలేక మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమ పరచ లేక, పోయిన ప్రతి ఒక్కపరిస్థితిని బట్టి, మమ్ములను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రీ.
మా జీవితములలో మీరు నిర్ణయించినది అది మా మంచికే, అని మేము నమ్మి మిమ్ములను స్తుతిస్తున్నాము తండ్రి,
మీ చిత్తానుసారముగా జరుగుచున్న ప్రతి కార్యములో, ప్రతి విషయములో మీపై మరింత నమ్మకముతో జీవించగలవారుగా, మీ ప్రజలమైన మేము ఉండగలిగేటట్లు, గొప్ప విశ్వాసంలో మమ్మల్ని బలపరచి స్థిరపరచమని, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి.
ప్రభువా, మీ నిర్ణయాలకు లోబడి మీ సర్వాధికారంలో, శాంతిని సమాధానమును సంపూర్ణమైన విశ్రాంతి పొందగలిగే, పరిశుద్ధాత్మశక్తిని, ఆత్మబలమును మీస్థిరమైన సమాధానమును మాకు అనుగ్రహించండి. తండ్రి !
మీరు నియమించిన కార్యాలు, మా జీవితాలలో నేరవేర్చి, వాటి ద్వారా మీ మహిమను ప్రతిఫలింపజేసే సాధనముగా, మమ్మల్ని వాడుకొని మీ సాక్షులుగా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను దేవా !
మీ శక్తి, మీ జ్ఞానము మీ దయపై, పూర్తి నమ్మకముతో ప్రతి రోజూ మీకు సమర్పించబడిన, జీవితాన్ని జీవించగలిగే కృపను, నీ ప్రజలమైన మాకు ప్రసాదించండి దేవా! మీరు నిర్ణయించినది మాత్రమే, మా జీవితంలో జరగునట్లుగా మమ్మల్ని బలపరచండి. !
మా జీవితాలలో మీ శక్తిని మీ సామర్థ్యమును, మీ మహిమను మీ కృపను సంపూర్తిగా, మేము పొందగలుగునట్లు మీ ఆశీర్వాదాలను, మామీద కుమ్మరించండి దేవా !
మా దేశంలో మారాష్ట్రంలో మా పట్టణంలో మా ఆ ప్రాంతాలలో, ఉన్న రక్షణ లేకుండా ఉన్నటు వంటి, ప్రతి ఒక్కఆత్మను స్వస్థపరచమని, వారందరి ఆత్మల మీద, యేసు క్రీస్తు ప్రభువు వారు సిలువలో చిందించిన, పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించమని, ప్రతి ఒక్కరిని మీ రక్షణతో అలంకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి !
మా వ్యక్తిగత జీవితాల మీద మా కుటుంబాల మీద, మా బంధువుల మీద మా సంఘాల మీద, మా సమాజం మీద మేము చేస్తున్న, సహవాసముల మీద మా దేశము మీద మా రాష్ట్రము మీద, మా ప్రాంతం మీద మా చుట్టుపక్కల నివసిస్తూ ఉన్న ప్రజల మీద, వారి జీవితాలలో వారికి అవసరమై ఉన్నటువంటి, ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును కుమ్మరించమని, మీ దీవెనలను వర్షింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి !
ఇంతవరకు నేను చేసిన ఈ ప్రార్థనను ఆలకించి జవాబు మీరు అనుగ్రహించినందుకు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
7-1-2025
💖 🙏🍀
Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25