CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏🍀

యెషయా 54:13

నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును,

వర్తమానం:

దేవుని ఉపదేశం పొందిన పిల్లలు సత్యము జ్ఞానమునందు అభివృద్ధి నొంది శాంతిసమాధానంతో తో నిండిన జీవితాన్ని అనుభవిస్తారు. అని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది.

దేవుని వాగ్దానం నందు విశ్వసించిన వారు దేవుని వాక్య ప్రకారము నడిచేవారు ఈ లోకంలో వారి జీవిస్తున్న వారి జీవిత యాత్రలో ఎటువంటి గందరగోలమైన కలవరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటి మధ్య కూడా దేవుని వాక్యం చేత వారు పొందిన ఉపదేశం వలన వారు పొందిన బలమును బట్టి శాంతి సమాధానమును బట్టి నెమ్మదిని బట్టి వారు పొందిన విశ్వాసమును బట్టి వారు ఎటువంటి విషయంలో కూడ భయపడకుండా శాంతి సమాధానముతో విశ్రాంతిని కలిగి ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతారని ఈ వాక్యము తెలియజేస్తుంది.

ఈ వాక్యం దేవుని వాగ్దానం మన పిల్లల జీవితాల మీద ప్రభావం చూపుతుందని చెప్పబడిన వాక్యము ఇది, వారి హృదయాలను మన ప్రభువు మన దేవుడు తన జ్ఞానంతో నింపి, వారి జీవిత ప్రయాణంలో తగిన విశ్వాసాన్ని, శాంతిని దేవుడు అందిస్తాడు.

🙏ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి ప్రభువా, మా పిల్లలందరినీ మీ చేతుల్లో ఉంచుతున్నాము దేవా. వారిని మి జ్ఞానం, మి ప్రేమ, మి శాంతితో మీ కృపతో నింపండి ఈ గందరగోళమైన కలవరానికి వ్యాకులానికి తొందరపాటుకు గురిచేసే ఈ లోకంలో వారు మీ ఉపదేశమును పొందుతూ నీతిమంతులుగా ఈ లోక జ్ఞానము కాక మీ జ్ఞానమును పొందిన జ్ఞానవంతులుగా నిలిచేలా జీవించేలా వారిని కాపాడమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను దేవా .

ఇంతవరకు మా పిల్లల కొరకు మేము చేసిన మా ప్రార్థనలను ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నమ్మదగిన ప్రార్ధనకు జవాబు ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్ధించి అడిగి వేడుకొను చున్నాను తండ్రి ఆమేన్.ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

23-1-25 ప్రార్థన

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25