Prayer
💖 🙏🍀
మత్తయి 5:12
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.
వర్తమానం:
శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు,
ఈ వాక్యం ద్వార మనకు చాల ధైర్యం కలుగుతుంది. దేవుని కోసం దేవుని వాక్యాన్ని అనుసరించుటలో, ప్రకటించుటలో, విశ్వసించుటలో, మనం ఎదుర్కొనే ప్రతి శ్రమకు పరలోకంలో గొప్ప ఫలితం, దేవుని చేత మనకు ఇవ్వబడుతుంది. దొరుకుతుంది, దేవుడు ఇచ్చే ఫలితాలు అతి ప్రాముఖ్యమైనవి, శాశ్వతమైనవి. కాబట్టి, ప్రస్తుతము మనం అనుభవిస్తున్న ఈ శ్రమలను ఈ కష్టాలను నమ్మకంతో,విశ్వాసంతో, సంతోషంతో, మనము ఎదుర్కోవాలని ఈ వాక్యము మనకు తెలియ జేస్తుంది.
🙏ప్రార్థన🙏
ప్రియమైన పరలోకపు తండ్రి, నిన్ను నీ వాక్యమును మేము నమ్మి విశ్వసించినందుకు దాని ప్రకారం నడుస్తున్నందుకు మేము ఎదుర్కొనే ప్రతి శ్రమకు పరలోకంలో గొప్ప ఫలితాన్ని మీరు సిద్ధం చేసినందుకు నీకు ధన్యవాదాలు. దేవా ! మా శ్రమల కాలములో నీ మాటలు మా హృదయానికి ధైర్యం కలుగజేసేవిగా వుంచమని ప్రార్థిస్తున్నాను దేవా,
మీ వాక్యము ద్వార మాకు అందిస్తున్న మా జీవితాల్లో నీ మహిమను వెలుగులోకి తేవడానికి మాకు తగిన కృపను అనుగ్రహించుము. ప్రార్థిస్తున్నాము దేవా ! ఇంతవరకు నేను చేసిన ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుక్ను చున్నాము,తండ్రి ఆమేన్.ఆమెన్ ఆమెన్
ఎస్తేర్ క్రైసోలైట్
20-1-25

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25