CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏🍀

1పేతురు 5:10

తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

వర్తమానం:

ఈ వాక్యము శ్రమల గుండ మనము వెళ్తున్నాప్పుడు, దేవుడు మన పట్ల చూపించే దయను గూర్చి, యిది మనకు తెలియ జేస్తుంది.మనము అనుభవించిన శ్రమల అనంతరం, దేవుడు మనలను సంపూర్ణతకు తీసుకువెళ్తాడు, దేవునిలో మనము స్థిరంగా ఉండటానికి మనలను బలపరుస్తాడు. శ్రమ కలిగినప్పుడే మనము దేవునితో దేవుని వాక్యంతో ప్రార్ధనలతో దేవునితో, ఎక్కువ సహవాసం కలిగి దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము.

కాబట్టి శ్రమ అనేది దేవునితో మనము ఎక్కువ సహవాసం చేయగలిగేటట్లు, మనకు కలిగే శ్రమ మనలను సిద్ధం చేస్తుంది, తయారు చేస్తుంది, మన జీవనయాత్రలో మనకు రక్షణకర్తయైన దేవుడు మన కాపిరిగా ఉన్నప్పుడు, మన బలహీనతలు విజయాలలోకి మారతాయి.శ్రమ కలిగినప్పుడు, దేవుని ప్రార్థించుట ద్వారా వాక్యమును ధ్యానించుట ద్వారా, దేవునితో మనము ఎక్కువ సహవాసం చేస్తాము, కాబట్టి శ్రమ అన్నది మనలను పూర్ణులుగా దేవుడు పై ఆధారపడేటట్లు స్థిరమైన వారలముగా మనము ఉండేటట్లు మనలను బలపరుస్తుంది.

🙏ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి, మాకు శ్రమ కలిగినప్పుడు శ్రమల గుండా మేము ప్రయాణిస్తు ఉన్నప్పుడు శ్రమల మధ్య మేము నిలబడి ఉన్నప్పుడు స్థిరముగా మేము మీలో ఉండేందుకు మాకు ధైర్యమును బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి

శ్రమల యందును అతిశయపడే భాగ్యమును మాకు దయచేయండి దేవా!

మీ యందు విశ్వాసముంచుటలో మీ మీద ఆధారపడుటలో మీ వాక్యమును అనుసరించుటలో ప్రార్థన ద్వారా మీతో మాటలాడుట యందు మీతో సహవాసము కలిగి యుండుట యందు మమ్ములను స్థిరపరచి,బలపరచమని మీయందు సంపూర్ణులగు నట్లు మమ్ములను సిద్ధపరచమని మీ మహిమకు పాత్రులుగా మమ్ములను మార్చుమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

26-1-25

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25