CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

🌿 🙏 💟

నిర్గమకాండము 15:26

మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధే యులై ఆయన కట్టడ లన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను;నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.

🙏 శరీర స్వస్థత కొరకు ప్రార్థన 🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక! మీరు నన్ను మీ స్వంత రూపమున నిర్మించావు దేవా. నా శరీరం మీరు నివసించే మీ మందిరము ఆని పరిశుద్ధాత్మ దేవుడు యేసు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన నా శరీరంలో నివసించుచున్నాడు అని

(1 కోరింథీయులకు 6:19) ప్రకారం.నేను నమ్ముచున్నాను దేవా !

నేను ఆచరించలేని ఆజ్ఞలను కట్టడలను సిలువలో నా కొరకు మీరు ఆచరించి,

నాకు విజయాన్ని ఇచ్చిన దేవా నా హృదయంలో మీకు ప్రథమ స్థానం ఇవ్వటానికి నా పూర్ణ హృదయముతో నా శరీర స్వస్థత కొరకు మిమ్మల్ని విశ్వసించటానికి,నాలో పూర్ణ విశ్వాసాన్ని మీయందు అధికమైన నమ్మికను నా హృదయంలో కలగచేయమని,మిమ్ములను ప్రార్థిస్తున్నాను తండ్రి.

పరిశుద్ధాత్మ దేవా మీరు నివసిస్తున్న ఈ నా శరీరంలో ఏ అనారోగ్యం, ఏ బలహీనత, ఏ రోగం ఉండకూడదు. ప్రతి అనారోగ్యమును కలిగించే వ్యతిరేక శక్తి, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసు క్రీస్తుప్రభు వారి నామంలో నా శరీరమును విడిచి వెళ్లిపోవలసిందే అని ఆజ్ఞాపిస్తున్నాను, యేసు గాయములచేత నేను స్వస్థపరచబడినాను.

యెషయా 53:5 ప్రకారము

నా యతిక్రమక్రియలను బట్టి యేసు గాయపరచ బడెను నా దోషములనుబట్టి యేసు నలుగగొట్టబడెను, నా సమాధానార్థమైన శిక్ష యేసు మీద పడెను యేసు పొందిన దెబ్బలచేత నాకు స్వస్థత కలుగు చున్నది అని. నేను విశ్వసిస్తు దేవుని స్తుతిస్తున్నాను, 1 పేతురు 2:24 లోఉన్నట్లు నాకు స్వస్థత ఇవ్వటానికి యేసు నా పాపములన్నిటి కొరకు సిలువలో వ్రేలాడినాడు అన్న వాక్యమును నేను సంపూర్ణంగా నా హృదయపూర్వకముగా విశ్వసిస్తు, నాకు స్వస్థత ఇచ్చిన దేవుణ్ని నేను స్తుతిస్తున్నాను.

దేవా, నీవు నాకు ఆరోగ్యమును, నీవు నాకు జీవమును ఇచ్చావు దేవా యోహాను 10:10 లో ఉన్న వాక్యములు ఆధారంగా పరిశుద్ధాత్మా దేవా దీనిని నేను వాగ్దానముగా తీసుకొనుచుండగా నా శరీరాన్ని నీ సమృద్ధి జీవంతో నింపమని వాగ్దానం ఇచ్చిన దేవుడవు మీరు నమ్మదగిన దేవుడవు అని. ఏ వ్యాధి, ఏ బలహీనత కూడా నాలో స్థిరపడనివ్వరని నా ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, అన్ని

నామముల కంటే అత్యధికముగా హెచ్చించబడిన యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్! ఆమెన్ ఆమెన్.

( ఆస్వస్థతతో వున్న వారు విశ్వాసంతో ఈ ప్రార్థనను పదేపదే చదివి ఆమెన్ అని చెప్పండి తొందరగా స్వస్థత కలుగుతుంది.)

ఎస్తేర్ క్రైసో లైట్

12-4-2025

💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25