Prayer
💖 🙏 🍀
నిర్గమకాండము 33:14
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా,
🙏ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారివైన మా ప్రభువా కనికరము గల మా తండ్రి మీ మహిమ గలిగిన మహోన్నతమైన నామాన్ని భట్టి మీకు వందనాలు దేవా !
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతా స్తుత్తులు చెల్లించు కుంటున్నాము దేవా
దేవా, మీ సన్నిధి అంటే మీకు సమీపముగా వుండటము మీ సన్నిధిని అనుభవించుటము మీ పవిత్రత మీ పరిశుద్ధతను కలిగి శాంతి సమాధానముతో్ ప్రేమతో నిత్యజీవముతో నిండిన జీవితము అని మీరు మాకు తెలియ జేసినందుకు మీకు స్తోత్రాలు దేవా,
మా శ్రమలు మా కష్టాలు మా పోరాటాలలో మాకు ధైర్యమును శాంతిని సమాధానమును విజయమును ఇచ్చే మీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా !
మా భవిష్యత్తుపై మేము కలిగి ఉన్న భయమును తొలగించి అర్థం కాని విషయాలు కూడా మాకు అర్థమయ్యేమీ సన్నిధి యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి దేవా !
ప్రతి పరిస్థితిలో మీకు సమీపముగా మీమార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ! మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని
ప్రతి విషయంలో మీ పరిశుద్ధమైన సన్నిధి మాకు మార్గాన్ని చూపేదిగా వుంచమని ప్రార్థిస్తున్నాము దేవా !
దేవా, మీ సన్నిధి మా జీవితాల్లో ఇలా ఎల్లప్పుడు నిత్యము మీ పరిశుద్ధాత్మ చేత ఇలానే కొనసాగింపమని నీతి మార్గంలో మమ్ములను నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా
మీతో మీ సన్నిధితో కూడ నడిచే ఆశీర్వాదమును మా అందరికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము దేవా ! మేము చేసిన ప్రతి పని కూడ మీ మహిమ కోసం చేసేదిగా దానిని ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా !
దేవా ! మీ వాక్యానుసారముగా జీవించడానికి మీయందు గొప్ప విశ్వాసం వుంచటానికి స్థిరమైన హృదయాన్ని మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా !
ఈ లోకంలో ఎటువంటి ఆకర్షణలు మమ్ములను ఆకర్షించిన ఎటువంటి పరీక్షలు మా మీదికి వచ్చిన మేము మీ మార్గము నుండి తప్పిపోకుండా విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించే వారముగా మేము ఉండ గలుగునట్లు మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని కాపాడండి దేవా !
మేము మీ సన్నిధిని కోల్పోకుండా, మేము వేసే ప్రతి అడుగు మీ వాక్యనుసారముగా ఉండగలిగేటట్లు మేము జీవించగలిగేటట్లు మమ్ములను మీ వాక్యం చేత బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవా
ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి వారు ప్రతి అవసరతను తీర్చమని ప్రతి పోరాటంలో మీ శాంతిని నెమ్మదిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా !
స్వస్థత లేని వారికి స్వస్థతను ఇవ్వండి సమస్యలో ఉన్న వాళ్ళని విడిపించండి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో కన్నీటితో ప్రయాణిస్తున్న వారందరికీ మీ సన్నిధిని తోడుగా ఉంచి వారు ప్రయాణిస్తున్న ప్రతి పరిస్థితిలో వారికి శాంతిని విశ్రాంతిని ఇవ్వమని మీ నెమ్మదితో మీ సన్నిధితో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము దేవా ! ప్రపంచవ్యాప్తంగా మీ పరిచర్యలను చేస్తున్న దైవజనులందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము
ప్రతి ఒక్క దైవజనులను దీవించండి ఆశీర్వదించండి మీ దీవెనలతో మీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
వారి ప్రతి అవసరతను మిరే తీర్చమని వారి ప్రార్థనకు జవాబు దయచేయమని వారి ప్రయాసకు మీరు ఫలితాన్ని ఇవ్వమని విజ్ఞాపన చేస్తున్నాము దేవ ! మా దేశంలో మహారాష్ట్రలో మా పట్టణలలో మా సమాజాలలో మా సంఘాలలో మా బంధువులలో మా కుటుంబాలలో ఉన్నటువంటి రక్షణ లేని వారి ఆత్మలను మీరే రక్షించండి ప్రభువా,
విశ్వాసంలో బలహీనులైన వారికి బలమైన విశ్వాసమును దయచేయండి ప్రార్థించే ప్రార్థనాత్మతో వారిని నింపమని విజ్ఞాపన చేస్తున్నాను.
నామకార్థకముగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాను దేవా!
ఇంకా ఎవరి దగ్గర కైతే మీ రక్షణ సువార్త వెళ్లలేదో వారందరూ కూడా మీ వాక్యపు వెలుగులోనికి రావడానికి కృప దయచేయండి.
దేవా మీ సువార్త చేయలేకుండా రానీయకుండా ఆటంకంగా ద్వారాలు మూయబడిన ప్రతి ప్రాంతం కొరకు రాష్ట్రాలు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా మూయబడిన ద్వారాలను మీరే తెరవండి.
ఇంతవరకునేను చేసిన ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి జవాబు ఇచ్చినందుకు విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన ఘానమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొను చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్,
ఎస్తేర్ క్రైసోలైట్
20-1-25
💖 🙏🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25