CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖🙏🍀💖

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

🙏 ప్రార్థన:🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆపత్కాలంలో ఆశ్రయించదగిన నా ఆశ్రయమా ! మీరు నాకు ఆశ్రయమవుతారని,నన్ను రక్షించే ఆశ్రయదుర్గముగా నాకు ఉంటారని, ఈ రోజు నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు దేవా. నా హృదయాన్ని కలవరపెట్టే వాటిలోను, నన్ను దిగులుగా చేయబోయే వార్తలలోను, మీరే నాకు ధైర్యం. నన్ను దాచే గుహవై, నాకు శాంతిని ఇచ్చే మీ సమాధానముగా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నా భయాలన్నిటికి నా సమస్యలన్నిటికీ మీ సన్నిధి నాకు ఆశ్రయం అని మీరు నాకు తెలియజేసినందుకు మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

నా శక్తికి మించిన వాటిలో సర్వశక్తి సర్వ సామర్థ్యం కలిగిన మీరు నాకు బలమై నిలవమని, బలమైన కోటగా రక్షించే దుర్గముగా నన్ను కాపాడుమని ప్రార్థిస్తున్నాను, నా ఆశ్రయం, నా కోట, నా దేవుడు!అయినా యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

19-7-2025

💖🙏🍀