CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

╔══════ ✝ 🙏 ✝ ══════╗
ప్రార్థన
╚══════ ✝ 🙏 ✝ ══════╝

ప్రార్థన

ప్రైస్ ది లార్డు క్రీస్తు యేసు ప్రభువు వారి గుణాతిశయములను మహిమను ప్రత్యక్షపరచేది, ప్రచురపరచేది,దేవుని సంఘాము,ఈ సార్వత్రిక సంఘంలో క్రీస్తు యేసు ప్రభువు వారు చిందించిన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని గుణాతిశయములను ప్రకటించాలి,

ఇలా మన జీవితం ద్వారా దేవుని గుణాతిశయములను దేవుని మహిమను మనము ప్రకటించాలి మనం ప్రత్యక్ష పరచాలి, అని అంటే మనము ఈ లోకములో ఉన్న సకల భ్రష్టత్వం నుంచి వేరు చేయబడాలి, ప్రత్యేకింపబడాలి,ఈ అంశమును గురించిన వర్తమానమును నేను రాస్తూ ఉన్నప్పుడు ఈ అంశాన్ని బట్టి కూడా నేను ప్రార్థించాలి అని నేను వ్రాసిన ప్రార్థన ఇది,ఈ ప్రార్థన అంశాలను మీరు కూడా ఏకీభవించి ఆమెన్ అని చెప్పండి, దేవుని మహిమను దేవుని గుణాతిశయములను ఈ లోకంలో మీ ద్వారా ప్రత్యక్ష పరచబడటానికి దేవుడు మిమ్ములను, ఈ లోకంలో ఉన్న సకల దుష్టత్వం నుంచి,మిమ్ములను ప్రత్యేకపరిచి మిమ్ములను కూడా దేవుడు వాడుకుంటాడు,

ప్రార్థన

ప్రియమైన మా పరలోకపు తండ్రి,
దేవా,మీ మహిమను ప్రతిబింబించుటకై మమ్మల్ని సృష్టించి, మీ గుణాతిశయములను ప్రచురపరచుటకు, మీ దైవ స్వభావంలో పాలుపంచుకొనుటకు మీరు పిలిచారు. ప్రభువా, ఈ లోకమందున్న దురాశ, శరీరాస, నేత్రాస, జీవపు డంభము, చీకటి, గర్వముల ద్వారా కలిగే సకల భ్రష్టత్వము మమ్మల్ని చుట్టుకొని నిలిచి ఉన్న. మీ వాగ్దానములు మాకు వెలుగుగా నిలుస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా.

ప్రభువా , మీరు మా పాప స్వభావమును సిలువవేసి, దానిని జయించే శక్తిని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి
మీరు లోకానికి వెలుగుగా ఉండి, మమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వచ్చావు. మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దాసుని రూపం ధరించినట్లే, మేము కూడ మాలో ఉన్న సకల గర్వాన్ని విడిచి వినయముతో నడవ కలుగునట్లు, మమ్ములను నడిపించమని ప్రార్థిస్తున్నాను,

తండ్రీ, మా శరీరములను పరిశుద్ధమైన బలులుగా,మీకు అర్పణగా సమర్పించుటకు మాకు కృపనివ్వండి. మా కళ్ళ చెడును చూడకుండ, మా హృదయాలను మీ వాక్యములో నిలిపి వుంచుమని ప్రార్థిస్తున్నాను. మా మాటలు, ఆలోచనలు,మా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనబడునట్లు మమ్ములను సిద్ధ పరచండి.

పరిశుద్ధాత్మ దేవా, మీ ఫలములను — ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి, దయ, మంచితనము, విశ్వాసము, వినయం, ఆత్మ నియంత్రణ వీటన్నిటి ద్వారా మమ్ములను నింపమని ప్రార్థిస్తున్నాను. వీటి ద్వారా మేము మీ దైవ స్వభావములో పాలుపంచుకొని, లోకములో ఉన్న సకల భ్రష్టత్వమునుండి తప్పించబడుదుము, అన్న నిరీక్షణను వాగ్దానమును బట్టి మేము కలిగి ప్రార్థిస్తున్నాను.

ప్రభువా, సంఘముగా మమ్మల్ని మీ మహిమను ప్రతిబింబించే పాత్రలుగా మమ్మల్ని నిలిపి వుంచమని మమ్మల్ని మీలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మేము మీ మహిమను, మీ గుణాతిశయములను ప్రజలకు ప్రకటించే సాక్షులుగా ఉండుటకు మా జీవితాలను వాడుకొనండి.

దేవా, మీ ప్రతిరూపముగా మెము మారి, మీ స్వభావాన్ని ధరించి, మీ మహిమలో పాలు పంచు కొనుటయే మా లక్ష్యం అని మేము గ్రహించగలగటానికి మాకు సహాయం చేయండి. మా అంతరంగములను పరిశుద్ధపరచి, మీ వాక్యపు వెలుగులో నడిపించండి, మీ కృపలో మమ్ములను నిలిపి ఉంచమని ప్రార్థిస్తున్నాను.

ఈ లోకమందున్న భ్రష్టత్వమును మేము కనుపరచక, మీ స్వభావమును మాత్రమే ప్రతిబింబించే, మీ మహిమను ప్రకటించే సంఘాముగా మెము జీవించునట్లు మమ్మల్ని సిద్ధపరచమనీ .యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ.
ఆమేన్.

ఎస్తేర్ క్రైసోలైట్
23-9-2025

💠🌟💖🌿🌸 🙏 ప్రార్థన 🙏 🌸🌿💖🌟💠