CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

✧✦✧✦ 🙏 ప్రార్థన 🙏 ✦✧✦✧✦

ప్రైస్ ది లార్డ్ కీర్తనల మొదటి అధ్యాయము నేను చదువుతూ ధ్యానంచేస్తూ ఉన్నప్పుడు ఇందులోని వాక్యాల ద్వారా ప్రార్థించాలి అని నేను అనుకోని నా కొరకు ఈ ప్రార్ధనను నేను సమకూర్చాను,

ఏ వర్తమానమును అయినా నేను రాసేటప్పుడు అందులోనే వాక్యాల ద్వారా అందులోని అంశాల ద్వారా నేను ప్రార్థించాలి అని నాకు అనిపిస్తే, వెంటనే నేను ప్రార్థనను నా చేతితో నేను వ్రాస్తాను,

ఎందుకంటే నాచేతితో నేను రాసిన ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడు అన్న విశ్వాసంతో ఇలా ప్రార్థనను నేను రాస్తూ ఉంటాను, నా కొరకు ఈ అంశాల ద్వారా తయారు చేసుకున్న ఈ ప్రార్థనను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇలా నా నోటితో ఇల ప్రార్ధిస్తున్నాను,

ఈప్రార్థన అంశాలు మీ జీవితంలో కూడా నేరవేరాలని మీరు ఆశపడినట్లయితే ఈ ప్రార్ధనతో మీరు ఏకీభవించి ఆమెన్ అని చెప్పండి,ఏదో ఒక రోజున దేవుడు ఈ అంశాలను కచ్చితంగా మీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు, విశ్వసించండి,ఆమెన్ అని చెప్పండి.

🙏 ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీరు మీ వాక్యములో మీ మార్గాలను స్పష్టంగా మాకు చూపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించు కుంటున్నాను ప్రభువా.
దేవా, దుష్టుల ఆలోచనలో నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, ఆపహాసకుల సమాజములో కూర్చోకుండా ఉండటానికి నాకు కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. నా సహవాసమును పరిశుద్ధ పరచండి, నా అడుగులు మీ మార్గాలలోనే నిలబడునట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను.

దేవా, మీ ధర్మశాస్త్రంలో ఆనందించే హృదయాన్ని ర నా కివ్వండి. దివారాత్రులు మీ వాక్యాన్ని ధ్యానించుటలో నాకు ఆసక్తి నివ్వమని ప్రార్థిస్తున్నాను. నా హృదయం ఇతర విషయాలతో కాకుండా, మీ వాక్యంతో నింపబడి యుండునట్లు చేయండి. మీ వాక్యం నా జీవితానికి బలాన్ని ఇచ్చే ఆహారముగా, నా ఆత్మకు వెలుగుగా, నా అడుగులకు దీపముగా చేయమని ప్రార్థిస్తున్నాను.

దేవా , నేను నీటి కాలువల దగ్గర నాటబడియున్న వృక్షంలా ఉండాలని కోరుకొనుచున్నాను. ఎండైనా, వర్షమైనా, నా వేర్లు మీలోనే బలపడునట్లు చేయండి. నా కాలములో ఫలమిచ్చే వృక్షంలా నేను ఉండునట్లు నన్ను నిర్మించండి, నా జీవితం వాడిపోకుండా, ఎల్లప్పుడూ మీ కృపలో పచ్చగా నిలిచి ఉండేటట్లు నన్ను కాపాడమనీ ప్రార్థిస్తున్నాను. నేను చేసే ప్రతి పని, ప్రతి ప్రయాత్నం, సఫల మయ్యెటట్లు, ఆశీర్వాదములతో, నేను వర్ధిల్లునట్లు చేయుమనీ మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

ప్రభువా, దుష్టులు గాలికి ఎగిరే పొట్టు వలె చెదరిపోతారని మీ వాక్యం చెప్పుతుంది. నేను ఆ పొట్టు వలే కాకుండా ఆ దారిలో ప్రయాణించ కుండా మీ మార్గంలో నడవాలని ప్రార్థిస్తున్నాను.
మీ న్యాయస్థానములో, నీతిమంతుల సభలో నిలబడలేని స్థితిని నాకు దూరపరచండి, దుష్టుల సమూహంలోనూ నేను పాలి భాగము కాకుండా నన్ను కాపాడండి.

ప్రియమైన తండ్రి, నీతిమంతుల మార్గాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుతారు అని మీ వాక్యం చెబుతోంది. మీరు చూపించే మార్గంలో గురి తప్పకుండా నేను నడిచేలా నన్ను నడిపించండి.

నేను దుష్టుల మార్గం వైపు పోకుండా మీ ఆత్మ సన్నిధి చేత నన్ను నడిపించండి,

నీతి కలిగిన ప్రజగా మీ సన్నిధిలో ఉన్న ఆనందమును ఎల్లప్పుడూ అనుభవించగలిగేటట్లు
నన్ను మీరు నిర్మించమని ప్రార్థిస్తూన్నాను.

దేవా నా పరిచర్య జీవితమును మీరు నిర్మించండి, నా ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి,

నేను చెప్పే మీ వాక్యాలను, నా ఆలోచనలు, నా చర్యలను, నాసమస్త ప్రవర్తనను — ఇవన్నీ మీ మహిమను కనపరిచేల చేయండి.

నా పరిచర్యలో, నా జీవితంలో, నా ప్రయత్నాలలో మీరు ప్రతిరోజూ నన్ను గైడ్ చేయామని, నా హృదయాన్ని మీరు శాంతి, ధైర్యం, విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను.

విశ్వాసంతో నేను చేస్తున్న
ఈ ప్రార్ధనను మీరు అంగీకరించి జవాబును దయచేస్తారని మిమ్ములను స్తుతిస్తూ,యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.

ఎస్తేర్ క్రైసోలైట్
20 - 9 - 2025

✦✧✦✧✦ 🙏 ప్రార్థన 🙏 ✦✧✦✧✦