CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

✦✧✦✧✦ 🙏 ప్రార్థన 🙏 ✦✧✦✧✦

ప్రార్ధన

ప్రియమైన మా పరలోక తండ్రి,
దేవా మీరు మా కిచ్చిన మీ వాక్యము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతీ వచనాన్ని బట్టి మీకు నా హృదయా పూర్వకమైన స్తుతి స్తోత్రాలను అర్పించుకుంటున్నాను,

మీ వాక్య ప్రకారం, నా జీవితం, నా అడుగులు, నా ఆలోచనలు, నా ప్రయత్నాలు — ఇవన్నీకూడా వ్యర్ధమైనవిగా ఉండకుండా మీ ఆలోచనలో శ్రేష్టమైనవిగా ఉండగలుగునట్లు,మీ హస్తములో అవి భూషణ కిరీటముగా ఉండునట్లు ఉపయోగపడనట్లు చేయమని ప్రార్థిస్తున్నాను.

ప్రభువా, మీ వాక్యము చేత మీరు నాకు చూపిన మార్గలను, మీరు ఇచ్చిన ఆలోచనలు, ప్రతి సందేశం — ఇవి ఆన్నీ కూడా నా జీవితంలో మీ ఉద్దేశాన్ని సఫలపరచేవిగా ఉండనిమ్మని మిమ్ములను ప్రార్థిస్తున్నాను,

నేను ప్రార్థించుచున్న ప్రతి విషయంలో, మీరు చెప్పిన విధంగా ఆత్మయు జీవమునై యున్న వాక్యంతో నీతితో, ధైర్యంతో, విశ్వాసంతో నా హృదయాన్ని నింపమని అడుగుతున్నాను.

ప్రియమైన తండ్రి, నేను మీ వాక్యములోని ఆశీర్వాదాలను, మీరు ఇచ్చిన వాగ్దానాల ద్వార, అంగీకరించడానికి, గైకొనటానికి తగిన విశ్వాసంతో నా హృదయాన్ని సిద్ధపరచండి, నా ప్రతి ప్రయత్నం, నా ప్రతి పని, నా పరిచర్య, నా మాటలు — ఇవన్నీ మీ మహిమను ప్రత్యక్ష పరచేలా వాటిని మార్చమని, నా హృదయం నా ఆత్మ మీ సన్నిధిలో ఎల్లప్పుడు నిలబడేలా నన్ను ఉజ్జీవపరచమని ప్రార్థిస్తున్నాను.

దేవా నా, నా సమస్యలు, నాకు అసాధ్యమైన విషయాలు, పనులు — ఇవన్నీ కూడ మీ ఆత్మశక్తితో జరిగించమని ప్రార్థిస్తున్నాను,

నేను చేసే ప్రతి ప్రయత్నం సఫలమయ్యేటట్లు,మీరు నిర్ణయించిన సమయానికే,దాని ఫలితమును నేను పొందగలిగేటట్లు ,నా ప్రతి ప్రయత్నాన్ని మీరు ఫలింప చేయమని సఫలపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.

దేవా, నా హృదయాన్ని పూర్తిగా ఆత్మయు జీవమునై యున్న మీ వాక్యంతో నింపండి, నా ప్రయత్నాలు,
నా పనులు, నా మాటలు, ఇవన్నీ ప్రజలకు ఆశీర్వాద కరముగా ఉండునట్లు,నేను చేసే మీ సేవను మీ పరిచర్యను సమాజంలో ఒక వెలుగుగా మార్చమని ప్రార్థిస్తున్నాను.

దేవా నా హృదయం పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి మీయందు స్థిరపడునట్లు,మీ ఆత్మ నింపుదలను నాకు దయచేయండి,

నా జీవితంలో మీరు ఉంచిన పిలుపు, పరిచర్య, ఆశీర్వాదం — ఇవన్నీ కూడ నాలో మీరు విస్తరింపజేస్తున్నందుకు మిమ్ములను స్తుతిస్తున్నాను.

మనుష్యుల శక్తితో బలముతో కాకుండా, మీ ఆత్మతో నేను వ్యాపించునట్లు నన్ను నడిపించండి.
మీ నామం మహిమ పరచ బడునట్లు, నా జీవితమంత, కూడ మీకు సాక్షిగా ఉండునట్లు, నన్ను వుంచండి,

దేవా నా జీవితంలో ప్రతిరోజూ మీ మార్గములను మీ ఆలోచనలను అనుసరిస్తూ, మీ సమాధానాలను, ఆశీర్వాదాలను ఫలితాలను తగిన సమయంలో నేను చూడగలుగునట్లు,నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను,

దేవా విశ్వాసంతో నిలబడ గలిగిన, నీతి మార్గంలో నడవ గలిగిన, ఫలభరితమైన జీవితమును నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను,

నా జీవితం ద్వారా మీరు మహిమపరచబడాలని, నా హృదయం మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించేలా, ధైర్యంగా ఉండాలని,ప్రతి సమస్యను ఎదుర్కొనే జయాన్ని విజయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను,

దేవా "నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను."అని మీరిచ్చిన వాగ్దానం ద్వారా మీ ఆశీర్వాదాలను నేను నా పరిచర్యలో నేను పొందగలిగే భాగ్యమివ్వమని మీ కృపను నాకు దయ చేయమని ప్రార్థిస్తున్నాను,

ప్రభువా, నా పరిచర్యలో, నా పని లో, నా ప్రతి ప్రయత్నంలో మీరు చెప్పిన విధంగా “స్వాస్థ్యము” మరియు “అధిపత్యము” నింపబడాలని కోరుతున్నాను.

నేను ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో, ప్రతి ప్రయత్నంలో, నా ప్రయత్నాలు ఫలించడానికి,ఎల్లప్పుడు మీరు మీ సన్నిధి, ఉండేలా నాపై మీ కృప చూపండి.

నా విజయానికి, నా ఫలితానికి, నా ఆశీర్వాదానికి నిజమైన మూలముగా, కారణముగా, ఆధారముగా, మీరే ఉన్నందుకు మిమ్ములను స్తుతిస్తున్నాను,
మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

దేవా నా పరిచర్య జీవితమును మీరు నిర్మించండి, నా ప్రయత్నాలను మీరు సఫలపరచండి, నేను చెప్పే మీ వాక్యాలను, నా ఆలోచనలు, నా చర్యలను, నాసమస్త ప్రవర్తనను — ఇవన్నీ మీ మహిమను కనపరిచేల చేయండి.

నా పరిచర్యలో, నా జీవితంలో, నా ప్రయత్నాలలో మీరు ప్రతిరోజూ నన్ను గైడ్ చేయామని, నా హృదయాన్ని మీరు శాంతి, ధైర్యం, విశ్వాసంతో నింపమని ప్రార్థిస్తున్నాను.ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అంశాలన్నిటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను,

విశ్వాసంతో నేను చేస్తున్న
ఈ ప్రార్ధనను మీరు అంగీకరించి జవాబును దయచేస్తారని మిమ్ములను స్తుతిస్తూ,యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.

ఎస్తేర్ క్రైసోలైట్
21-9-2025