CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏 🍀

విజయమును ఇచ్చే నామము

2దినవృత్తాంతములు 20:15

యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.

ప్రార్థన:

🙏 ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మా పక్షమున యుద్ధము చేసే యుద్ధ శూరుడువైన యెహోవా తండ్రి, దావీదు వలె మీ నామమును బట్టి వ్యక్తిగతముగా సమాజముగా మేము కలిగి ఉన్నా, మా శత్రువులైన గొల్యాతులనే సమస్యలతో, మీ సహాయము కోరి మీ నామమును బట్టి విజయాన్ని పొందటానికి, మిమ్మలను ప్రార్థించడానికి, మీ కృపను కోరి మీ సన్నిధిలోనికి వస్తున్నా మమ్ములను కనికరించండి ప్రభువా,

మా చేతిలో ఆయుధాలు ఏమీ లేవు తండ్రి,

మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయటానికి,

మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు

అని మీరు సెలవిస్తున్నారు దేవా,

మాకు విజయాన్ని ఇచ్చేది, లోకమును శరీరమును సాతానును మరణమును జయించిన, అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చింపబడిన, క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములోనే, మాకు విజయమును దయచేయమని, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి,

చిన్నవాడైన దావీదు, ఇశ్రాయేలీయుల అందరి పక్షముగా సున్నతి లేని గొల్యాతు తో పోరాడటానికి, తనని తాను ఎలా ప్రతిష్టించుకున్నాడో, అటువంటి రీతిలోనే దేవా మా దేశంలో ఉన్న మా రాష్ట్రాలలో ఉన్న దైవజనులందరి కొరకు, వారి పక్షాన వారి క్షేమం కొరకు మీ నామములో ప్రార్థించే వారముగా, మీ ప్రజలమైన మేము అందరం ఉండునట్లు ప్రార్థనా ఆత్మతో మమ్మల్ని అందరినీ మా దేశంలో మా రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుని ప్రజల నందరిని అభిషేకించమని ఉజ్జీవింప చేయమని ప్రార్థన భారాన్ని మా అందరిలో అధికం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము దేవా,

మేము ఈ లోక రాజ్య వారసులము కాదు దేవా మేము పరలోక రాజ్య వారసులముగా మీ ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన మీ ప్రజలము తండ్రి దేవా మాకు సహాయం ఇక్కడ మాకు దొరకదు దేవా మాకు సహాయము మీ నుంచే రావాలి మాకు న్యాయం ఆన్నది మీరే చేయాలి దేవా,

పరదేశులముగా ఈ లోకంలో మీ ప్రజలు ఎటువంటి మార్గాలకుండా వెళ్తున్నారో సమస్త మెరిగిన దేవా మి ప్రజలకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను,

మీ సత్యమును ఈ లోకంలో ధైర్యముగా ప్రకటిస్తున్నామీ సేవకులకు తగిన సహాయ సహకారాలు అన్ని రీతిలో అనుగ్రహించమని వారికి తగిన భద్రతను అనుగ్రహించమని మీ తెలివిని మీ జ్ఞానమును వారికి సమృద్ధిగా అనుగ్రహించి పెట్టమని నిన్న నేడు నిరంతరం మీ నామమును ధరించిన మీ ప్రజలకు విజయాన్నిచ్చే మారని మార్పు చెందని దేవుడువైన మిమ్ములను స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

ఎస్తేర్ క్రైసోలైట్

11-4-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25