Prayer
🌿 🙏 💟
కీర్తనలు 34:7
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
🙏 ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
అని మీరు మాకు ఇచ్చిన వాగ్దానము జీవింపజేసే జీవ వాక్యము మేఘా స్తంభము వలే మా జీవిత యాత్రలో మమ్ములను కాపాడుతూ మీ సన్నిధి మీ ప్రసన్నత ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయ్యా,
ప్రభువా,మీ వాక్యము మా ప్రాణమునకు ఆధారమై ఉన్నది దేవా ఈ అరణ్యమనే లోకంలో తుఫాను లాంటి ఎన్నో భయాలను మొసుకోని వచ్చే అనేక సంఘటనలు మా ముందుకి వచ్చినప్పుడు మీరిచ్చిన వాగ్దానము మీరిచ్చిన వాక్యము మాకు మేఘా స్తంభము వలే మమ్ములను సంరక్షిస్తుందని మమ్ములను కాపాడుతుందని మాకు భద్రత ఇస్తుందని మీ కాపుదలను మాకు సిద్ధంగా మీరు వుంచరని మేము హృదయ పూర్తిగా విశ్వసిస్తున్నాము దేవా,
సర్వ సృష్టికర్తవైన తండ్రి మీరు సృష్టించిన ఈ లోకంలో మేము పరదేశులముగా మనుషుల దృష్టికి మేము నిస్సహాయ స్థితిలో ఉన్న వారము ఎన్నిక లేని వారము తృణీకరింపబడిన వారము అయినప్పటికీ మేము మీ చేతిలో చెక్కబడిన మీ ప్రజలము మీ వాక్యం తో మీ దూతలతో సంరక్షించబడుతూ మీ సన్నిధిని మీ ఉనికిని కలిగిన వారము.
ఈ లోకము ఈ లోకంలోని ప్రజలందరూ మీ ప్రజలమైన మమ్ములను ఒంటరి వాళ్లనుగా చేసిన
మాకు ఆధారభూతుడవు మా బలము మా ఆశ్రయము మా కొండ మా కేడము మా సమస్తము మీరే దేవా మీ ప్రజల కన్నీరు మీరు లెక్కించే దేవుడవు
వారి ప్రాణములను రక్షించు వాడవు నీవే దేవా!
ప్రస్తుత పరిస్థితులలో మా రాష్ట్రాలలో మీ ప్రజలు మీ యందు విశ్వాసం ఉంచిన మీ జనులు ఎటువంటి ధైర్యమును చెడి భయాన్ని కలిగిన స్థితిలో ఉంటున్నారో సమస్తము ఎరిగిన దేవుడు మీరు మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా మీ ప్రజలను బలపరచండి వారి విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి మీ చిత్తమన్నది లేకుండా మా జీవితాలలో ఏది జరగదు అన్న ప్రగాఢ విశ్వాసమును మీ ప్రజలందరిలో వుంచమని ప్రార్థిస్తున్నాను దేవా!
భయపడిన బలహీనులకు మీరే బలము. ధైర్యమును ఇవ్వమని మీ దూతలు వారి చుట్టూ ఉన్నారన్న ఈ సత్యము వారు మరచిపోకుండా వారిపై ముద్రించమని బలమైన విశ్వాసంలో మీ ప్రజలను స్థిరపరచమని ఈ లోకంలో వారు ఒంటరిగా లేరని ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ మీ సన్నిధి వారి చుట్టూ ఆవరించి ఉన్నదని వారికి మీ దూతల సంరక్షణ ఉందని గ్రహించే మనసును హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను,
మా సంరక్షణ దేవునిలోనే ఉంది మాకు సహాయం పరలోకముందే వస్తుంది అన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించిన వారిగా మీ ప్రార్ధన ఆత్మనుప్రతి ఒక్కరిలో నింపమని ఏసు క్రీస్తు ప్రభువు వారు శ్రేష్టమైన నామంలో ప్రార్ధించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి
ఆమెన్ ఆమెన్ ఆమెన్,
(మనము నివసించే మన చుట్టూ ఉన్నసమాజంలో భయాన్ని కొలిపే పరిస్థితులు అవి ఏ రూపంలో వచ్చిన అప్పుడు ఈ ప్రార్ధనను విశ్వాసంతో చేసినప్పుడు అన్ని పరిస్థితుల మీద దేవుడు విజయాన్ని ఇస్తాడు అటువంటి సమయాలలో విశ్వాసంతో ఈ ప్రార్థనను పదేపదే చదవండి.)
ఎస్తేర్ క్రైసోలైట్
9-4-2025
💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25