Prayer
💖 🙏 🍀
యెహోషువ 1:9
నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
దేవుని ఆజ్ఞలను విశ్వసించి, అనుసరించడానికి, భయభ్రాంతులు లేకుండా ముందుకు సాగడానికి మనకు ధైర్యం, బలము కావాలి. యెహోషువకు మోషే తర్వాత బాధ్యత ఇవ్వబడినప్పుడు ఈ వాగ్దానం ఇచ్చబడింది. అలాగే మనం కూడా దేవుని మార్గంలో ముందుకు నడవడానికి ఈ వాగ్దానం మన హృదయాలకు ధైర్యాన్ని నింపుతుంది.మన పరలోకపు తండ్రి మనకు ఇచ్చిన ధైర్యవంతమైన పిలుపు: 'భయపడకుము, దిగులుపడకుము, నీవు వెళ్లుచోట్లెల్ల నీ దేవుడు నీతో ఉన్నాడు!' ఈ వాగ్దానం ప్రతి నడుకలో మనకు బలము ఇస్తుంది.”
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీరు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని మరలా మరలా వినిపింపజేసిన నేర్పించిన విధానం మాకు గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. దేవా మీరు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోకుండా, మీరు నడిపించే మార్గంలో మేము ముందుకు సాగేలా సహాయము చేయమనీ ప్రార్థిస్తున్నాము తండ్రి,
దేవా మేము ఏ స్థితిలో ఉన్నామొ ఆస్థితిలోనే ఉండిపోవాలని అక్కడే స్థిరపడి పోవాలని ఇక అదే మా స్థితి అని అనుకునే బలహీనమైన విశ్వాసమును మనసును కలిగిన వారము దేవా
కానీ మీరు మా జీవితాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని కోరుతున్నారు మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఉన్నత ఆశీర్వాదాలలోనికి మమ్ములను ఎక్కించే గొప్ప దేవుడవు మీరు మీరు ఇచ్చిన ఆజ్ఞలను మేము విశ్వసించి, అనుసరించే హృదయాన్ని మాకు అనుగ్రహించు మని ప్రార్థిస్తున్నాము దేవా,
మీరు నడిపించే మార్గాన్ని మేము స్పష్టంగా చూడగలుగునట్లు చేయండి మోషేలా, మీరు చెప్పిన మాటలను ధైర్యంగా ప్రకటించే హృదయాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము. మీ పిలుపును ఆలస్యం చేయకుండా, సమయానికి స్పందించే మనస్సును మాకు దయచేయమని,
ఈ ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్! ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
25-3-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25