Prayer
💖 🙏 🍀
ద్వితియోపదేశకాండము 31:6
భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
భయం, అనుమానం, వెనుకాడే స్వభావం వీటన్నిటినీ జయించి, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఇది.
ఈ వాక్యం ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమి ప్రవేశానికి సిద్ధపడుతున్నప్పుడు ఇచ్చినది. అలాగే మనం కూడా దేవుని పిలుపును నెరవేర్చడానికి నడుస్తున్నప్పుడు మనం ఈ వాగ్దానంపై నిలవవచ్చు.
“మన మార్గాల్లో భయం లేకుండా ధైర్యంగా నడిచే ప్రతి దశకు దేవుని వాగ్దానం: 'నీతోకూడ యెహోవా నడచును, నిన్ను విడువడు.'”
🙏 ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రీ, మీ వాగ్దానాలపై మేము నమ్మిక నుంచి, భయాన్ని వదిలి విశ్వాసంతో ముందుకు సాగాలని మమ్ములను బలపరచండి. మీరు మా జీవితంలో తెరిచిన మార్గాలను మేము గుర్తించి, మిమ్ములను వెంబడించే అనుసరించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము దేవా ! అనుమానాలు, భయాలు, మరియు వెనుకాడే స్వభావం మాకు అడ్డుగా నిలవకుండా, మీ ఆజ్ఞలను అనుసరించే హృదయాన్ని మాకు ప్రసాదించండి దేవా ! "మీరు ఇచ్చిన వాగ్దాన భూమిని స్వీకరించేందుకు" ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న మేమందరము సిద్ధంగా ఉండేలా మమ్మల్ని అందరినీ మార్చుమని. ప్రార్థిస్తున్నాము దేవా ! మా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు ముందుగానే మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెన్ ఆమెన్
ఎస్తేర్ క్రైసోలైట్
25-3-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25