Prayer
🌿 🙏 💟
ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును.
2 తిమోతికి 4:18
🙏 ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి,ప్రభువా,
శ్రమలు, బాధలు, ఆపదలు నన్ను చుట్టుముట్టినా, మీరే నా ఆశ్రయము, నా రక్షణ. సాతాను తన మాయాజాలాలతో నన్ను మీ నుండి దూరం చేయాలని ప్రయత్నించినా, పరిశుద్ధాత్మ ద్వారా నీవు నన్ను ముద్రించుకున్నావు,
ఎఫెసీయులకు 1:1, 34:30
మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు,అని పలికిన మా ప్రభువా మాకు వాగ్దానం ఇచ్చిన దేవా,
మీ హస్తలలో, మీ చేతులలో, భద్రంగా మమ్ములను కాపాడ మని ప్రార్థిస్తున్నాను తండ్రి.
పరిశుద్ధాత్మ ద్వారా, నాలో ఆరంభించిన మీ కార్యాన్ని పూర్తి చేయండి దేవా, నా విశ్వాసం బలహీన పడనీయకుండ కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఎదురైన, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయలేదని నిత్యం ధైర్యంగా నిలబడగలిగేలా నన్ను బలపరచండి స్థిరపరచండి.
రోమీయులకు 8:38-39 లో ఉన్నట్లు
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి యైనను రాబోవునవి యైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి నన్ను ఎడబాప నేరదని రూఢిగా నేను నమ్ముచున్నాను దేవా.
ఈ లోకములో నా జీవిత ప్రయాణంలో నాతో ఉండి, నన్ను మీ మహిమకు అర్హ మైన వ్యక్తిగా నన్న చేయండి. మిమ్ములను నమ్మి, మిమ్ములను ఆశ్రయిస్తూ, మీతో సమాధానంగా జీవించే మీ కృప మీ అనుగ్రహం నాకు దయచేయమని. నా రక్షణకర్తయైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
25-3-2025
💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25