Prayer
💖 🙏 🍀
ద్వితియోపదేశకాండము 6:6-9
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను.
నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచ నగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.
అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీ వాక్యాన్ని మా హృదయాలలో నాటండి, స్థిరపరచండి. దానిని మేము మరచిపోని విధంగా ప్రతిదినం మా ఆలోచనలలో నిలిచే మనస్సు ఇవ్వండి. ఆ వాక్యమును మేము మా జీవితములో ఆచరించే శక్తి, ఆలోచనలో, మాటలలో, క్రియలలో ప్రతిఫలించే గుణమును మాకు దయచేయండి.
ప్రభువా, ప్రతి దశలో మీ సంకల్పాన్నే కోరుతూ, మీ మార్గములో మేము ముందుకు సాగటానికి మమ్మల్ని మారుస్తూ ఉండండి,ప్రతి దినము మమ్ములను నూతన పరస్తు రమ్మని ప్రార్థిస్తున్నాను. మేము మీ మహిమను, మీ శక్తిని, మీ వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండటానికి మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము దేవా!
దేవా, మా సంతానానికి, రాబోయే తరాలకు, మీ వాక్య బోధను సత్యంగా బోధించే జ్ఞానమును, శక్తిని దయచేయండి. మీరే మాకు ధైర్యం, జ్ఞానం, మార్గం. మీరే మాకు శాంతి, సమాధానం.
మీ వాక్యాన్ని గ్రహించి, ఆచరించి, కొత్త తరాలకు బోధించే భాగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి.
ఈ ప్రార్థనను యేసు క్రీస్తు ప్రభువు నామంలో మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్! ఆమేన్! ఆమేన్!
ఎస్తేర్ క్రైసోలైట్
23-6-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25