CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Names Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

Praise the Lord

⭐ రూతు ( స్నేహశీలి, ప్రియదర్శిని )⭐

తోడు లేక ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఎటువంటి ఆధారం లేకుండా సమస్తాన్ని నష్టపోయి శ్రమలగుండా నడుస్తున్న వ్యక్తికి, ---- నీకు నేనున్నాను నీకు తోడుగా నేను ఉంటాను, అని త్యాగపూరితమైన ప్రేమతో తనని తాను సమర్పించుకొని వెంబడించే నేస్తాలు, చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు, స్నేహశీలులు అనబడటానికి ఇటువంటి వారే అర్హులు, ఇటువంటి స్నేహశీలి అనబడే వ్యక్తిత్వం కలిగిన నేస్తాలను కలిగి ఉండటం అనేది మానవులకు దేవుడిచ్చే గొప్ప భాగ్యం.

ఇటువంటి దేవుడిచ్చిన భాగ్యమును సృష్టి ఆరంభంలో, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట వలన మొదటి మానవుడైన ఆదాము దేవునితో సహవాసమును కోల్పోయాడు. ( ఆది 3: 24 )

ఏదేను వనములో దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నడుచుట వలన, దేవుని మహిమను, దేవుని ఆశీర్వాదాలను, దేవుని సహవాసమును, సమస్తాన్ని కోల్పోయిన, ఆదాము సంతతిని ఆదరించుట కొరకు, ఉద్ధరించుట కొరకు, దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకమునకు అనుగ్రహించినారు, ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు ఈ లోకానికి వచ్చి, సిలువలో తన ప్రాణమును, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నీ కొరకు సిలువలో సమర్పించిన, నిజ స్నేహితుడు స్నేహశీలి అయినటువంటి, క్రీస్తు యేసు ప్రభువు వారి స్నేహ హస్తాలను నీవు అందుకోగలిగినవా.

మొదట ఆదాములో కోల్పోయిన సహవాసమును, క్రీస్తు యేసు ప్రభు వారి బలి యాగము ద్వారా, మానవాళికి దేవుడు అనుగ్రహించాడు, క్రీస్తు యేసు సహవాసంలోనికి, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు ( 1 కోరింది1:9 ) నిన్ను విడువను ఎడబాయను అని తన స్నేహము కొరకు మనలను పిలుస్తున్న నిజ స్నేహితుడైన క్రీస్తు ప్రభువు వారిని నీ స్నేహితుడిగా ఈ రోజే నీ హృదయంలోనికి ఆహ్వానించగలవా.

మానవుని స్నేహము పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, కానీ దేవుని స్నేహము ఎన్నడు మారదు,

పురుషుని జీవితంలో, ఒక మంచి స్నేహితురాలుగా, అతనికి సాటి అయిన సహకారిగా ఉండటానికి, దేవుడు స్త్రీని నిర్మించాడు. అది 2: 20--21

వివాహం తరువాత స్త్రీ తన స్వజనులను తన ఇంటి వారిని విడిచి, తన భర్త ఇంటికి రావాలి, ఇది దేవుని క్రమం, వివాహము అనే దేవుడు ఏర్పాటు చేసిన ఈ క్రమంలోనికి వచ్చిన ప్రతి స్త్రీ, తన భవిష్యత్తు జీవితమును, తన భర్త ఇంటి వారితోనే నిర్మించు కోవాలి.

పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నటువంటి ఎలియాజరు, అబ్రహాము కుమారునికి వధువుగా, రిబ్కాను అబ్రహాము ఇంటికి తీసుకు రావడానికి ముందు, ఎలియాజరు రిబ్కా చేతులకు, కడియంలను, రిబ్కా ముక్కునకు కమ్మీని, పెట్టి అబ్రహాము ఇంటికి తీసుకు వచ్చాడు.

( ఆది 24 : 22--31 ) ఇకనుంచి నీ చేతులు పని చేయాల్సిందీ, ఇస్సాకు ఇంటి వారి కొరకు, ఇకనుంచి నీవు ముక్కు నుంచి శ్వాస పీల్చి బ్రతికేది, నీ భర్త ఇంటి వారి కొరకు, అని ఎలియాజరు రిబ్కాకు ఆభరణములను అలంకరింప చేశాడు.

( ఆది 24 :47 )

వివాహమైన చాలా మంది స్త్రీలను, విశేషముగా దేవునిలో వుండి దేవుని క్రమం వాక్యానుభవం కలిగిన స్త్రీలను, నేను చూసినప్పుడల్లా, నాకు చాలా బాధ కలుగుతుంది, తన ఇంటి వారు పట్ల, తన భర్త ఇంటి వారి పట్ల, సరి అయిన బాధ్యతను చూపకుండా, తన తల్లి ఇంటి వారి వైపు శ్రద్ధ ఆసక్తి చూపుతూ ఉంటారు.

వివాహం తర్వాత, స్త్రీకి దేవుడు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, దానిని నమ్మకంగా నిర్వర్తించ లేకపోతే, ఒక రోజున దేవునికి మనము లెక్క చెప్పవలసి ఉంటుంది, క్రీస్తును కలిగి ఉండేవాళ్ళు, వాక్యాన్ని ఎరిగి ఉండే వాళ్లను, జ్ఞానవంతులు అని బైబిల్ చెప్తుంది, జ్ఞానం గల స్త్రీ, తన ఇల్లు ను కట్టుకుంటుంది.

స్నేహశీలి అను అర్థం కలిగిన రూతు, తన భర్త మరణం తర్వాత తన ఇంటి వారిని వదలక, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని, తన అత్త వెంబడి రూతు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది. చాలా మంది స్త్రీలు తమ భర్తలు బ్రతికి ఉండగానే, అత్తలను భర్త ఇంటి వారిని విస్మరిస్తున్నారు, రూతు అలా చేయలేదు కాబట్టి, తన భర్త చనిపోయిన, తన భర్త తరపు ఆస్తిని స్వాస్థ్యమును తిరిగి పొంద కలిగింది.

(రూతు 4 : 10)

శ్రమలో బాధలో, చేయి విడువని, ఎడబాయని సహకారిగా, ఒక మంచి స్నేహితురాలుగా, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, అని భర్త కుటుంబమును, వెంబడించిన స్నేహశీలి అని అర్థం కలిగిన రూతును, పరిశుద్దాత్మ దేవుడు నీ ముందుకు తీసుకువచ్చి ఉండగా, ప్రియ సహోదరి నీ తీర్మానం ఏమిటి ? అత్త ముసలి తనములో ఆమెకు అండగా తోడుగా, సమస్తమును కోల్పోయిన, ఒక స్త్రీని ఆదరించే స్నేహశీలిగా, దేవుని క్రమాన్ని గౌరవించిన ఒక ప్రియమైన కోడలిగా, తన బాధ్యతను నమ్మకముగా రూతు నెరవేర్చింది.

దేవుని క్రమాన్ని, దేవుని వాక్యాన్ని, మనం నమ్మకముగా నిర్వర్తిస్తే, దేవుడు మన పట్ల తన బాధ్యతను నమ్మకముగా నిర్వర్తిస్తాడు, క్రీస్తును కలిగి

వివాహమైనటువంటి ప్రియ సహోదరి, నీ తీర్మానం ఏమిటి ? ఈ రూతు గ్రంథమును నాకు వివాహం కాక ముందు, నేను చదివినప్పుడేల్లా, నేను అనుకునేదాన్ని, నాకు వివాహం అయినప్పుడు, నా అత్తగారిని నేను బాగా చూసుకోవాలి అని, కానీ నా భర్త తనకి ఊహ తెలియని వయసులో ఉన్నప్పుడే, తన తల్లి గారు మరణించినారు.

ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఏర్పరచిన కుటుంబ క్రమాన్ని నీవు పాటిస్తూ ఉన్నావా, * అక్షరాను సారముగా మనము క్రమాన్ని తప్పితే, ఆత్మాను సారముగా కూడా మనము క్రమాన్ని తప్పుతాము, * వెనుక ఉన్నవి మరచి, ముందున్న వాటి కొరకై వేగిరిపడుచు, క్రీస్తు యేసు నందు, దేవుని ఉన్నతమైన పిలుపుకు, కలుగు బహుమానమును పొందవలెనని, గురియోద్దకే, పరుగెత్తుచున్నాను.

( ఫిలిప్పి3 :13--14 ) అని పౌలు సాక్ష్యం మిస్తున్నాడు, ఈ లోకము ఈ లోకంలోనీ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, అనేవి ఒకనాడు లయమవుతాయి, ఇక్కడ ఉన్న నివాసం శాశ్వత మైనది కాదు, మనకు శాశ్వత నివాసం పరలోకమే.

కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు, అతనికి నమస్కరించుము,

కీర్తన 45 :10--11 అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది.

రక్షణ అనే అలంకారణములను ధరించుకున్న వధువు సంఘములో ఉన్నటువంటి మనము, ఈ లోకమనే తండ్రి ఇంటిని, మన స్వజనులనబడే

ఈ లోక సంబంధమైన వాటిని, మనము మరచి, ముందున్న మన రాజును, పరలోక పట్టణాన్ని, చూస్తూ ఈ లోకంలో మనము బ్రతికినంత కాలం, శరీరానుసారముగా, ఆత్మానుసారముగా ,దేవుడు మనకు ఇచ్చిన, బాధ్యతను, క్రమాలను, నమ్మకముగా నిర్వర్తించాలని, ఈ దినాన స్నేహశీలి అను అర్థం వచ్చే, పేరు కలిగిన రూతును, పరిశుద్ధాత్మ దేవుడు, మన ముందుకు తీసుకువచ్చారు.

వివాహమైనటువంటి స్త్రీకి దేవుడు ఏ క్రమమును అయితే ఇచ్చాడో, ఆ క్రమమును సమర్థవంతముగా పాటించే, రూతులాంటి స్నేహశీలిగా ప్రియదర్శినిగా, ఒక ప్రియమైన కోడలిగా, ప్రియ దేవుని బిడ్డ నీవు ఉండగలవా ?

ఎస్తేర్ క్రైసోలైట్

11-10-2000

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨

Written By: Sis.Esther Chrysolyte

Written On: 21-4-25

Written By: Sis.Esther Chrysolyte

Written On: 21-4-25