2025 Messages
🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿
నా జీవిత సాక్ష్యం {1}
ప్రైస్ ది లార్డ్
చాలా సంవత్సరాల క్రితం యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకాన్ని నేను చదివాను, అందులో నాశనపురము నుండి పరమపురికి బయలుదేరిన ఒక యాత్రికుని అనుభవాలు,వాటిని చదువుతున్న వారికి ఎలా నడవాలి ఎలా నడవకూడదు అన్న విషయాన్ని ఆ పుస్తకం తెలియజేస్తుంది,
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు ఎలా నడిపించాడో ఆ విధానము ఇప్పటికి,దానిని చదువుతున్న మనకు ఒక విశ్వాసంను, ఒక నిరీక్షణను, ఒక ఉజ్జీవమును, ఒక పట్టుదలను, మనకు కలగ చేస్తూ ఉంటుంది.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమంది భక్తుల జీవిత లను మనము చూసినప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠాలు మనకు కనబడుతూ ఉంటాయి, అందుకే  హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 లోఈ గ్రంథకర్త,"ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘామువలె మనలను ఆవరించియున్నందున యేసు వైపు చూచుచూ ముందుకు కొనసాగుతూ"  అని పలుకుచున్నాడు,
నేను  జన్మించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దేవుడు నన్ను ఎలా నడిపించాడో నా ప్రతి ప్రయాణంలో దేవుని కాపుదల నాకు దేవుడు ఎలా కలగజేస్తూ వచ్చాడో నేను వ్రాయాలి అని అనుకున్నాను, ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించిన అనుభవాల ద్వారా దేవుడు నన్ను కాపాడిన విధానాల ద్వారా దేవుడు నన్ను ఎలా నడిపిస్తూ వచ్చాడో అన్న దాని ద్వారా ఇంకొకరికి నా జర్నీ అన్నది మేలు కరంగా ఉండాలి అని నేను దీన్ని వ్రాయాలి అని రాస్తున్నాను,
శరీరసంబంధంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, {స్వామి దాసు, వేదవతి} నా తల్లిదండ్రులు ఇద్దరు వృత్తి రీత్యా వారు గవర్నమెంట్ టీచర్స్ గా పనిచేసే వాళ్లు, వాళ్లు రిటైర్డ్ అయ్యేంతవరకు ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలలో వారు పనిచేశారు,
నా చిన్నతనం అంతా నేను ఏజెన్సీ ప్రాంతంలోనే గడిపాను,ఆ గ్రామాలలో ఎక్కువగా కోయ ప్రజలు ఉండేవాళ్ళు,ఆ గ్రామాలలో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వారే టీచర్స్, వారి భాష నాకు ఎక్కువగా వచ్చేది ఎందుకంటే ఎక్కువగా వారి తోటే నేను ఆడుకుంటూ ఉండే దానిని కాబట్టి, నేను పూర్తిగా తెలుగు భాషను మర్చిపోయి మా ఇంటిలో కూడా ఆ కోయ భాషనే నేను మాట్లాడుతూ వచ్చే దానిని,ఆ భాషను మాన్పించడం కొరకు నన్ను ఇంట్లో ఎక్కువగా కోడుతూ ఉండేవాళ్ళు,ఆ ప్రజలతో ఎక్కువ నన్ను అడనిచ్చే వాళ్ళు కాదు,
నేను దేవుని సేవ కొరకు ప్రతిష్టించుకున్న తర్వాత నేను ఆ ప్రజలకు దేవున్ని తెలియజేయాలని నేను మరల ఆ భాషను నేర్చుకుంటూ వచ్చాను,నేను ఆ ప్రజల మధ్య ఉండే పరిచర్యను చేస్తాను అని అనుకున్నాను, కానీ దేవుని ఉద్దేశం వేరే నన్ను యిటు వైపు నడిపించాడు,
ఫిఫ్త్ క్లాస్ వరకు నేను నా పేరెంట్స్ స్కూల్లోనే నేను చదివాను కాబట్టి నాకు అంతగా చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు,ఎక్కువ శాతం పిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని,
నా తల్లిదండ్రులకు మేము నలుగురు సంతానం మొదట అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను, నా తర్వాత చివరిలో నా చెల్లెలు,
నేను నా తల్లిగారి గర్భంలో రూపు దిద్దుకున్న ప్రారంభం నుండి ఇప్పటివరకు నేను నా కొరకు నేను పోరాడుతూనే ఉన్నాను,నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా తల్లిగారు ఇంకొక బిడ్డ అప్పుడే వద్దు అని అనుకొని రెండు సార్లు తన గర్భం పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు అంట, అయినా నేను క్షేమంగా ఈ లోకంలోకి అడుగు పెట్టాను,
నేను జన్మించిన తర్వాత నా తండ్రి గారు చెడు వ్యసనాలకు బానిస అయ్యారు అంట, అందుకనే నా తల్లిగారు అప్పుడప్పుడు,తనకి బాధ కలిగినప్పుడు,నేను తనకి బాధ కలిగించే పనులు చేసినప్పుడు, "శనిగొట్టి దాన" అని నన్ను తిడుతూ వచ్చేవాళ్ళు, ఇదేనండి నా తోబ్బుట్టువు లందరిలో నాకు ఉన్న ప్రత్యేకమైన పేరు," నీవు శనిగొట్టి దానివి నాకు అని,"నా తల్లి గారు ఆ మాట నన్ను అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది, నేనెందుకు పుట్టానా నేను ఎందుకు శని గోట్టి దానిలాగా నా తల్లికి ఉన్నానా అని నా మనసులో బాధ అనుభవిస్తూ ఉండేదాన్ని,
చూడండి •••• శ్రమ అన్నది ఎవరినైనా దేవుని వైపు తిప్పేటట్లు చేస్తుంది, ఒక కష్టం ఒక బాధ ఒక శ్రమ ఒక సమస్య ఒక పోరాటం అన్నది మన జీవితంలో కలిగినప్పుడు, అప్పుడే యదార్థంగా దేవున్ని మనము హత్తుకోని జీవిస్తాం, అందుకే దేవుని వాక్యం ద్వార అపోస్తుడైన పౌలు, యాకోబు ఇద్దరూ కూడా  రోమీయులకు 5:3-4, యాకోబు 1:2-3 లో "శ్రమలయందు సంతోషించుడి” అని ప్రోత్సహించారు.
శ్రమలు మనకు వ్యతిరేకంగా కనిపించినా, దేవుడు వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పటిష్టం చేస్తాడు. మన జీవితం కష్టాలతో, సమస్యలతో, శ్రమలతో,పోరాటాలతో,నిండినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టాడు ఆని అర్థం కాదు,
వాటి ద్వారా దేవుడు మనలో ఏదో పునర్నిర్మాణమును చేస్తున్నాడు అని అర్థం.
శ్రమల ద్వారా మన విశ్వాసం పరిశుద్ధ పరచ బడుతుంది, మనకు సహనం పెరుగుతుంది, మన అంతరంగం దృఢమవుతుంది.
దేవుడు మన బాధలను,కష్టాలను వృధాగా ఉంచడు; దేవుడు మన ప్రతి కన్నీటి బిందువుని కూడా మన కోసం ఉపయోగిస్తాడు. కాబట్టి కష్టాల్లో కూడా సంతోషించగలిగిన మనిషి, దేవుని ప్రణాళికను విశ్వసించిన వ్యక్తి.
శ్రమ అనేది దేవునిలో మనలను ఎవ్వరు విడదీయ లేనంత లోతుగా పాతుకుపోయేటట్లు చేస్తుంది,దీనిని నేను నా తల్లిగారిలో చూశానండి,ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు,ఎన్నో పోరాటాలు, ఆమె జీవితంలోకి వచ్చిన వాటన్నిటిని ప్రార్థనతో ఆమె జయిస్తూ వచ్చింది,
మానవులందరూ సర్వసాధారణంగా ఏమని అనుకుంటారు అని అంటే, కష్టాలు శ్రమలు బాధలు గుండా ప్రయాణించే వారు దేవుని ఆశీర్వాదం లేనివారు అని, సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారిని దేవుని ఆశీర్వాదం కలిగిన వారు అని, కాని ఇది నిజం కాదు,
ఆశీర్వాదము అంటే, నిజమైన దేవుని ఆశీర్వాదము ఏది అని అంటే, మన జీవితంలోకి వచ్చే కష్టాలు శ్రమలు బాధల గుండా మనం ప్రయాణించి, వాటి అన్నిటిలో దేవునిపై ఆధారపడి వాటన్నిటిని జయించి, ఇంకొకరికి ఆ బాధలు, ఆశ్రమలు, అటువంటి సమస్యలలో,మనలను చూస్తున్న ఇంకొకరికి, మనము మార్గాన్ని చూపే వారముగా ఉండటమే నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం,
నేను పుట్టిన తర్వాత ఒకరోజు నా తండ్రి గారు నన్ను తన బెడ్ మీద వేసుకుని పండుకున్నారు అంటా,
అప్పుడు మేము ఉండేది భయంకరమైన అడవి ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ అందరూ పండుకునే మంచాల మధ్యలో ఒక పెద్ద నిప్పును రాజేసి పండుకునేవారు, ఇది చలి పెట్టే శీతాకాలంలో ఇలా జరిగేది,నా తండ్రి గారు నన్ను తన పక్కన పండుకో పెట్టుకొని చలిమంట వేసుకున్నారు,
రాత్రి సమయంలో నా తండ్రి గారు నిద్రలో ఉన్నప్పుడు నేను మంట వైపు ఉన్నాను అంట, నాకు తెలియకుండానే నేను అందులో పడిపోయాను ఆ మంటలో నిప్పులు ఉన్న అందులో నేను బోర్లా పడిపోయాను అంట, నా కడుపు అంత కాలిపోయింది,ఇప్పటికీ  ఆ మచ్చలు నా కడుపు మీద కనబడుతూ ఉంటాయి ,కొన్ని నెలలు నేను హాస్పిటల్లోనే ఉండబట్టి నేను బ్రతికాను, నా తల్లి గారు కడుపులో నేను రూపుదిద్దుకున్న క్షణం నుంచి అది మూడవసారి దేవుడు నా ప్రాణమును మరణము నుంచి తప్పించటం,
మీకు తెలుసా••• దేవుడు ఎవరినైనా తన కొరకు ఈ లోకంలో ఏర్పాటు చేసుకుంటే, వాళ్ళ జన్మ నుండే అనేకమైన ఆటంకాలు ప్రమాదాలు వాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది, దేవుడు ఈ లోకంలో ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ జర్నీ అన్నది ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండదండి, పోరాటాలు కష్టాలు అనేవి వాళ్లతో ప్రయాణిస్తూనే ఉంటాయి,
ఎందుకంటే ప్రతి పోరాటమనే మార్గంలో ఇలా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్లు మాత్రమే,దేవుడిచ్చే కాపుదల, దేవుడిచ్చే విజయం, దేవుడు ఇచ్చే సమాధానం, వీటిని వాళ్లు వాళ్ళ మార్గంలో అనుభవించిన విధానం ద్వారా ఒక సందేశమును తెలియజేస్తారు ఇతరులకు ప్రకటిస్తారు కాబట్టి,
దేవునిలో లేని వారికి ఒక్క శరీర సంబంధమైన జీవితం మాత్రమే ఉంటుంది, కానీ దేవునిలో ఉన్న వాళ్ళకి ఆత్మ సంబంధమైన జీవితమన్నది కూడా వారికి ఉంటుంది, ఈ ఆత్మ సంబంధమైన జీవితము శరీర సంబంధమైన జీవితాన్ని నడిపిస్తుంది ఎలా అని అంటే,
శరీర సంబంధమైన ప్రతిదాని కొరకు శరీర సంబంధులు దేవుణ్ణి ప్రార్థించరు, కానీ శరీర సంబంధమైన జీవితంలో వారికి అవసరమైన శరీరానికి అవసరమైన ప్రతి దాని కొరకు
ఆత్మ సంబంధులు దేవుని ప్రార్థించి దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు,
దేవుని ప్రార్థించి పొందుతున్నాము కాబట్టి అది శరీర సంబంధమైనదైనప్పటికీ,అది పరిశుద్ధమైనది అది ఆత్మ సంబంధమైనది, కాబట్టి శరీర సంబంధుల మార్గము కంటే,ఆత్మ సంబంధుల మార్గము ఇతరులను ప్రభావితం చేస్తుంది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది,
అందుకే కష్టాలు శ్రమలు పోరాటాలు సమస్యలు అన్నీ కూడా ఆత్మ సంబంధులకే వస్తాయి, వీటిని జయించగలిగిన వాళ్ళు కూడా ఆత్మ సంబంధులే పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వాళ్లే, కాబట్టి వీరి జీవిత జీవన విధానం ఈ లోకంలో ఉన్న వారి వలె సహజంగా ఉండదు,
{ ప్రతి ఒక్కరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తాడు. దీనిని మనమంతా గుర్తించాలి. దేవుడు మనలను నడిపించే ఆ మార్గంలో మనకు, మన కుటుంబానికి,ఇది నా బాధ్యత అని అనుకున్న ప్రతిదానికి,వాటికి అవసరమైన వాటిని మాత్రమే అడగడం మన బాధ్యత. ఇతరుల మార్గంలో వారు పొందిన ఆశీర్వాదాలను చూసి మనం దేవుని అడగకూడదు. ఇలాంటి ఆశీర్వాదాలు మంచివే అయినప్పటికీ, అవి మన ఆత్మీయ ప్రయాణానికి హానికరమవుతాయి.}
ఎస్తేర్ క్రైసోలైట్
4-11-2025