CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Testimonies

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 2 }

ప్రైస్ ది లార్డ్, నేను ఫిఫ్త్ క్లాస్ పూర్తయ్యేంతవరకు కూడా భయంకరమైన ఏజెన్సీ అడవి గ్రామాలలో మేము ఉంటూ వచ్చాము, ఆ సమయాలలో మేము ఏ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో చర్చి అన్నది ఉండేది కాదు, కొన్ని గ్రామాలకు కలిపి ఎక్కడో ఒకచోట ఒక చర్చి అనేది ఉండేది,అందుకే మేము నా చిన్నతనంలో ప్రార్థన అన్నది మాకు తెలిసేది కాదు,
వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఇంటిలో ప్రార్థించడం అన్నది నాకు తెలియదు, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మాత్రం ప్రార్థించడము జరిగేది,

నా తల్లి గారికి శ్రమలు అన్నవి తనకి ఎప్పుడు సంభవించాయో,అప్పటినుండి ఆమె రేడియో లో వస్తున్న విశ్వావాణి వాక్యాన్ని తాను వినటం మొదలు పెట్టింది, సాయంత్రం అయిందంటే ఇంటిలో అందరూ వినేటట్లు ఆ వాక్యం సౌండ్ తో వచ్చేది,

ఆ రేడియోలో బ్యాటరీలు అయిపోయిన మాకు కిరాణా కూరగాయలు మేము ఏమి తెచ్చుకోవాలన్నా కూడా దూరంలో ఉన్న ఒక గ్రామానికి మేము కొన్ని రోజులకు ఒకసారి వెళ్లి మా తండ్రిగారు తీసుకొచ్చేవాళ్ళు, నేను 6 వ తరగతిలోకి వచ్చినప్పుడు మేము కూరగాయలు కిరాణా అమ్మే షాపులు ఉన్నటువంటి ఒక గ్రామంలోకి మా తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అయింది,అప్పటివరకు మాకు బట్టలు కైనా దేనికైనా మేము భద్రాచలం పట్టణానికి వచ్చి కొనుక్కునే వాళ్ళము,

భద్రాచలంలో మా తల్లి గారి పుట్టిల్లు ఉండేది, నా తల్లిగారు అక్కడనే పుట్టి పెరిగారు, మా నలుగురం నా తోబొట్టువులు మేము అందరం పుట్టింది కూడా భద్రాచలంలోనే, మా తండ్రి గారిది రాజమండ్రి దగ్గర పోలవరం, నా చిన్నతనంలో నాకు తెలిసిన ప్రయాణం రెండే నండి,సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకు వేరే గ్రామంలోకి వెళ్లటానికి ఎడ్ల బండిమీద ప్రయాణం,రెండోది మేము భద్రాచలం రావాలి అని అన్న, ప్రతి సంవత్సరం వేసవి సెలవులకు మా నానమ్మ గారి ఊరు పోలవరం మేము వెళ్ళాలి అని అన్న, మేము లాంచి ద్వారా ప్రయాణించ వలసి వచ్చేది,

నా చిన్నతనంలో సంవత్సరానికి ఒకసారి మేము చర్చికి వెళ్లే వాళ్ళము, ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు కలిపి ఒక ఊరిలో చర్చి ఉండేది, ఆ వూరికి మేము ప్రతి సంవత్సరం రేపు క్రిస్టమస్ అనంగా,ఎడ్ల బండి కట్టించుకొని మా కుటుంబం అంతా వెళ్లి మరలా మేము నూతన సంవత్సరం మందిరంలో ఉండి జనవరి 2న మేము తిరుగు ప్రయాణము అయ్యేవాళ్ళము,

ఆ వారం రోజులు మాకు చాలా సరదాగా ఉండేది,చుట్టుపక్కల నుంచి చాలామంది వచ్చేవాళ్ళు,మేమందరము మందిరంలోనే పండుకోవడం మందిరంలోనే ప్రార్థించుకోవడం చాలా మంది తో మాట్లాడటం ఇలా మాకు చాలా మంచిగా అనిపించేది,మందిరంలో మేము ఉన్న ఆ వారం రోజులు కూడా అక్కడి విశ్వాసులు పాస్టర్ గారు మాకు, స్పీకర్ యిచ్చి చిన్ని చిన్ని పాటలు, చిన్న చిన్న వాక్యాలు చెప్పించేవాళ్ళు,

మాకు ఇలా ఎందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే వాళ్ళు అని అంటే, మాకు కలిగిన ప్రాధాన్యత దేనిని బట్టి వచ్చింది అని అంటే, మేము వేదవతి టీచర్ గారి పిల్లలుగా కంటే, వేదవతి సిస్టర్ గారి పిల్లలు గా మాకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది,

అప్పుడున్న ఆ సహవాస విశ్వాసులలో అందరి కంటే ఎక్కువ భక్తి విశ్వాసం మా తల్లి గారిలో ఉండేది,మా తల్లిగారు ఒక టీచర్ కంటే ఎక్కువగా ఒక విశ్వాసి గానే ఎక్కువ గుర్తింపును, ప్రాధాన్యతను పొందింది, మా తల్లి గారి వాయిస్ చాలా అద్భుతంగా ఉండేది,"హృదయమే నీ ఆలయం క్రీస్తు" అన్న పాట తనకి చాలా ఇష్టమైన పాట,నా చిన్నతనం నుంచి నేను తనని చూస్తూ వచ్చాను, తను స్పీకర్ ముందు ఎప్పుడూ నిలబడి ఏ పాటను పాడిన పూర్తి కంఠస్థంతో కళ్ళు మూసుకొని పాడేది,

నేను అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉంటాను, దేనికి అని అంటే, వాక్యం దొరకని అటువంటి స్థలాలలో నుంచి సమృద్ధిగా వాక్యము దొరికే ఇటువైపు ఈ పట్టణ ప్రాంతం వైపు దేవుడు నన్ను తీసుకొని వచ్చినందుకు,

నేను థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి ఒక న్యూ ఇయర్ కొరకు మేము బయలుదేరాము, ఎడ్ల బండి ఎక్కటానికి ముందు,నా తల్లిగారు అందరినీ ప్రార్థనకు పిలిచారు,నాకు అప్పుడు ప్రార్థనలో అలా మోకరించి ఎక్కువసేపు ఉండటం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, అందుకే ప్రార్థన అని అనగానే నేను మంచం కిందకు దూరిపోయే దాన్ని,మంచం కింద గోడకి ఆనుకొని దాక్కొని ఉండేదాన్ని,ఆమెన్ అని అనగానే బయటకు వచ్చేదాన్ని,

ఆ సమయాలలో నా తల్లి గారితో పని చేసిన కొంతమంది క్రిస్టియన్ టీచర్స్ నేను దేవుని సేవ కొరకు ప్రతిష్టించుకున్న తర్వాత వారిదగ్గరకు నన్ను నా తల్లి గారు తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని అన్నారు అంటే, ఓ••• ప్రార్థన అంటే మంచం కిందకు దూరిపోయే ఆ అమ్మాయి ఏనా సేవకు సమర్పించుకున్న ఈ అమ్మాయి అనే అనేవాళ్ళు,

చూడండి•••• మనము దేవునిలోకి రాకమందు మనలో ఉన్న చెడు అనేది ప్రజలకు ఎలా ప్రచారం అవుతుందో, మనము దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనలో ఉన్న మంచి కూడా అలానే ప్రచారం అవుతుంది,

మీ ఇంటిలో కూడా ప్రార్థన అంటే మంచము కిందకు దూరిపోయే పారిపోయే పిల్లలు ఎవరైనా ఉన్నారా! అయితే భవిష్యత్తులో వారు వారి ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడే వ్యక్తులుగా దేవుడు వారిని నిర్మిస్తాడు అని గమనించండి,

దేవునిపై ఆధారపడటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వారిపై మనము ఆధారపడుతూ ఉంటాం కాబట్టి, అందుకే దేవుడు మన నుంచి అందరిని దూరం చేసేస్తాడు,దేవా మీరు తప్ప నాకు దిక్కు ఏదీ లేదు అన్న పరిస్థితులను రప్పిస్తాడు,

ఆరోజు నన్ను పిలిచి నేను రాకపోయేసరికి సమయం అయిపోతుంది అని చెప్పి మా కుటుంబ సభ్యులందరూ వారే ప్రార్థన చేసుకున్నారు, నేను కూడా అదే గదిలో ఉన్నప్పటికీని, నా తల్లి గారు చేసిన ఆ ప్రార్థనలో ఏకీభవించి ఆమెన్ అని చెప్పకుండ వున్నది నేను ఒక్కదానినే, వాళ్లు ఆమేన్ అని చెప్పినప్పుడు నేను బయటకు వచ్చాను, వాళ్లు సమయం అయిపోతుంది,అన్న తొందరలో నన్ను తన్నకుండా తిట్లు మాత్రం తిట్టారు అంతే,

మేము ఎడ్ల బండి ఎక్కి సగం దూరం వచ్చిన తర్వాత,అనుకోకుండా మేము ప్రయాణిస్తున్న ఆ ఎడ్ల బండి మొత్తం రివర్స్ అయిపోయింది,మా ముందు వెళ్తున్న ఒక ఎడ్ల బండి బాగానే వెళ్ళింది,కానీ ఆ మార్గం మా ప్రయాణానికి మా ఎడ్ల బండి బోల్తా కొట్టడానికి కారణమైంది,ఆ ఎడ్ల బండి లో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు, నేను మాత్రం ఎగిరి బయటపడ్డాను,ఆ పడినప్పుడు అక్కడ తాటి చెట్లు ఉన్నవి, ఆ చెట్ల ఆకులకు ఉన్న రంపము లాంటి ముల్లులు నా అరికాలికి గుచ్చుకొని భయంకరమైన బ్లడ్ వచ్చింది,

నన్ను లేపటానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఒకే మాట అన్నారు, చూడు ఉదయము ప్రార్థన చేయడానికి రమ్మని ఎంత పిలిచిన నువ్వు రాకుండ మంచం కిందకు దూరావు, అందుకే ఇలా జరిగింది అని,

చూసారా •••• మేలు చేయటానికైనా, శిక్షించడానికైనా,మనుషులు మనల్ని వదిలిన దేవుడు మాత్రం మనలను వదలడు,

నా ఆరి కాలికి గుచ్చుకున్న ఆ మచ్చ ఇంకా కనబడుతూ ఉంటుంది, నేను అప్పుడప్పుడు నా పిల్లలకి అది చూపిస్తూ వుంటాను,యోనా లాగా దేవుని సన్నిధిలో నుండి పారిపోతే ఏమి జరుగుతుందో దేవుడు గుర్తుగా ఉంచాలని దేవుడు ఈ మచ్చను మానపటం లేదు అని,

నేను జన్మించిన దగ్గర నుంచి దేవుడంటే కొంచెం భయాన్ని కలిగించటానికి జరిగిన మొట్టమొదటి ఒక సంఘాటన ఇదేనండి,

మా కుటుంబ సభ్యులందరూ ప్రార్థించిన ఆ గదిలోనే నేను ఉన్నాను, కానీ నేను వారి ప్రార్థనలో ఏకీభవించ లేదు,ఆమేన్ అని అనలేదు, ఆ ప్రార్థన సహవాసమునకు దగ్గరగా, అతి సమీపంలో నేను ఉన్నప్పటికీ, నేను వారితో వాళ్ల ప్రార్థనతో ఏకాత్మను కలిగి లేను, అందుకే నాకు కీడు అన్నది కలిగింది,

మనము దగ్గర ఉన్నామా దూరంగా ఉన్నామా సహవాసంలో ఉన్నామా అన్నది కాదు కానీ,మన ఆత్మ దేవునిపై ఆధారపడుతుందా లేదా అన్నదే దేవుడు చూస్తాడు,మనము ప్రార్థించే వారితో,ప్రార్థించే గుంపుతో ప్రార్ధించే సహవాసంలో ఉండి కూడా దేవునిపై ఆధారపడకపోతే మనకు వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు,

మనము దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అన్నది కాదు, కాని మన ఆత్మ దేవునిపై ఆధారపడుతుందా లేదా అన్నదే దేవుడు చూస్తాడు.

యెషయా 29:13
ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధు లనుబట్టి వారు నేర్చుకొనినవి.

మీరు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ,
మీ మనసు దేవునితో ఏకమై వుంటుందా?

ఎస్తేర్ క్రైసోలైట్
5-11-2025