CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Testimonies

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 3 }

నేను 6 వతరగతిలోకి వచ్చినప్పుడు మేము చింతూరు అనే గ్రామంలోకి మా తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అయింది,ఇది మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది, ఒక అయిదు రూపాయల చార్జితో మేము
మధ్యప్రదేశ్ బోర్డర్ ని చూసి వచ్చేవాళ్ళము, ఇక్కడ భద్రాచలము, విశాఖపట్నం, రాజమండ్రి, మధ్యప్రదేశ్ పట్టణాలను కలుపుతూ పెద్ద హైవే వేయబడిన రోడ్లు ఇక్కడ ఉండటం మూలాన ఇక్కడ అన్ని విషయాలలో సౌకర్యాలు అధికంగా ఉండేవి,

మేము ఆ ఊరికి వచ్చినప్పుడు రెండే చర్చిలు ఉన్నాయి, ఒకటి సి ఎస్ ఐ, ఇంకొకటి పేంతుకోస్తు చర్చి, మేము మొదట పేంతుకోస్తు చర్చికి వెళ్లే వాళ్ళము,అక్కడనే నా తల్లిదండ్రులు ఇద్దరు రక్షించ భడి బాప్తీస్మం తీసుకున్నారు, కొద్దిరోజుల తరువాత
తోటి క్రిస్టియన్ టీచర్ల ద్వారా నా తల్లి గారు సిఎస్ఐ చర్చిలోకి వెళ్లారు,

ఆ చర్చిలో డబ్బుల విషయంలో గొడవ జరుగుతు ప్రతిసారి విశ్వాసులు పాస్టర్ గారిని కొట్టడం నా తల్లి గారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు, పాస్టర్ గారిని కొట్టడం, యిది వాక్యానికి విరుద్ధం అని పాస్టర్ గారికి సపోర్ట్ గా నా తల్లి గారు నిలబడేది, అది తోటి విశ్వాసులకు నచ్చేది కాదు,

ఈ సిఎస్ ఐ ఈ సహవాసంలో ఉన్నప్పుడే నా తండ్రి గారు సైకిల్ మీద తిరిగి చుట్టుపక్కల గ్రామాలకు పరిచర్యను చేశారు, చింతూరు సిఎస్ ఐ చర్చికి వున్న బరియల్ స్థలము,మా తండ్రి గారు తాను ఒక్కలే ఆ బాధ్యతను తన మీద వేసుకొని సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ ఆ మందిరానికి వచ్చే విశ్వాసులు దగ్గర డబ్బులు సేకరించి,కొంత మా తండ్రి గారు వేసుకుని ఆ స్థలాన్ని కొన్నారు,

మా తండ్రిగారు చనిపోయిన సమయానికి నా తల్లి గారు సి ఎస్ ఐ చర్చిని వదిలి హెబ్రోన్ సహవాసాన్ని స్థాపించారు అని కోపంతో నా తండ్రి గారిని అక్కడ సమాధి చేయటానికి ఆ సంఘాస్తులు కొంత మంది ఒప్పుకోలేదు, మా తండ్రి గారిని భద్రాచలం హెబ్రోన్ సహవాసమునకు చెందిన స్థలంలోని మేము సమాధి చేసాము,

మా తండ్రి గారు ఆ చర్చికి చేసిన సేవకు మనుషులు విలువ ఇవ్వకపోయినా, దేవుడు మాత్రం దానిని మరువడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది…

1కోరింథీయులకు 15:58
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

దేవుని కొరకు, దేవుని సంఘం క్షమాభివృద్ధి కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు, దేవుని పనులలో, దైవ సంబంధమైన కార్యాలలో, మనం పడిన ప్రయాసకు ఈ లోకంలో మనకు బహుమానము రాకపోవచ్చు కనపడకపోవచ్చు, కానీ పరలోకంలో ఖచ్చితంగా దాని ఫలితమును మనకు వస్తుంది,

మరలా నా తల్లిగారు ఆ సీఎస్ఐ సహవాసంలోని సభ్యులతో సమాధాన పడటానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడండి, నేను దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత ఆది ఎలా అని అంటే,మా దగ్గర విశ్వా వాణి బాక్స్ అనేది ఉండేది, అది విశ్వా వాణి నుంచి వాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి అందులో మనీని వాళ్ళు తీసుకొని వెళ్లేవాళ్లు, అలా విశ్వవాణి వాళ్ళతో మాకు ఒక అనుబంధం ఉండేది,

ఒకసారి వాళ్లు మా గ్రామంలో మీటింగ్స్ పెట్టటానికి వచ్చినప్పుడు వారు ఉండటానికి వారికి మేము ఆతిథ్యం ఇచ్చాము, వాళ్లు సిఎస్ఐ చర్చిలో మీటింగ్స్ పెడుతున్నారు,విశ్వ వాణిలో కళ్ళు లేని భాస్కర్ అన్న ఫ్లూటో ద్వారా పాటను వినిపిస్తారు,ఆయన నన్ను ఆఖరి రోజు మీటింగ్ లో స్టేజి మీద తాను ఫ్లూట్ వాయిస్తు ఉంటే నేను ఆ పాటను నా నోటితో పాడుతూ ఉండాలి అని అన్నారు,

నేను అన్నతో కలిసి అలా పాటను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అన్న వాళ్లు నా తల్లి గారిని ఒప్పించారు, మీ పాప ఆ చర్చిలో నాతో స్టేజి మీద పాడుతూ ఉన్నప్పుడు మీరు చూడకుండా ఎలా ఉంటారు, తప్పకుండా మీరు రావాలి అని,

నా తల్లి గారు మొదట చాల సమయం వరకు దానికి ఒప్పుకోలేదు, తర్వాత దానికి ఒప్పుకొని ఆ చర్చిలో ఆరోజు అడుగు పెట్టారు,మీకు జరిగిన అన్యాయానికి, మీరు ఎప్పటికీ మా చర్చిలో అడుగు పెట్టరు అని అనుకున్నాము అని వారు అందరూ నా తల్లి గారితో ఆప్యాయంగా మాట్లాడారు, వారు
సమాధానపడ్డారు,

ఆ సిఎస్ఐ చర్చిలో ఉన్నంతవరకు కూడా నేను ఒక నామకార్థకంగా ఉండే దానిని, పండగలప్పుడు కొత్త బట్టలు వేసుకొని వెళ్లే దానిని, ఆ చర్చిలో దైవజనుని పట్ల అక్కడ విశ్వాసుల ప్రవర్తన నా తల్లి గారికి నచ్చకపోవటం వలన చాలా రోజులు నా తల్లి గారు ఆదివారం ఇంటిలోనే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు,

అప్పటికే మేము ఒక సొంత గృహాన్ని కట్టుకున్నాము, కాబట్టి మా గృహంలో రెంట్ కు ఉన్న ఒక క్రిస్టియన్ పోలీసు వాళ్ళు,వారు వారి సొంత ప్రదేశంలో వారి కలిగి ఉన్న హెబ్రోన్ సహవాసమును గురించి నా తల్లి గారికి చెప్పుతూ వచ్చారు,

భద్రాచలంలో ఉన్న ఆ సహవాసం లోని దైవజనుని గురించి నాతల్లి గారికి తెలియజేసి వారిని కలవమని చెప్పటము మూలాన అలా మా గృహంలో హెబ్రోన్ సహవాసం అన్నది ప్రారంభించ బడటం జరిగినది,

అ సమయంలో మా అన్నయ్యకు బ్యాంకులో ఉద్యోగం రావటం మూలాన మా చదువుల నిమిత్తం మమ్ములను తాను ఉండే సిరిసిల్ల అనే పట్టణానికి నన్ను మా చెల్లిని తీసుకుని వెళ్లారు, ఒక న్యూ ఇయర్ రోజున మేము మా అన్నయ్య దగ్గర్నే ఉన్నాము, మేము న్యూ ఇయర్ కి అక్కడికి రావటం లేదు అని మా తల్లి గారికి మా అన్నయ్య చెప్పినప్పుడు,

అప్పుడు మా తల్లిగారు మేమున్న ఆ సిరిసిల్ల పట్టణానికి వచ్చారు, మమ్ములను న్యూ ఇయర్ రోజున వేములవాడ దగ్గరనున్న కొలనూరు అనే ఒక చిన్న గ్రామంలో హెబ్రోన్ సహవాసం ఉంది అని అక్కడకు మమ్ములను తీసుకుని వెళ్లారు, ఆదే ఆ గ్రామంలోనే ఆ మందిరంలోనే నా జీవితమునకు నాకు టర్నింగ్ పాయింట్, దేవుడు నిజంగా సజీవంగా ఉన్నాడు అన్న ప్రత్యక్షతను నేను గుర్తించింది అక్కడనే,

ఆరోజు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కానుకలు వేసే సమయంలో అందరూ కానుకలు వేసి ఒక స్లిప్పును తీసుకొని రావటం నేను గమనించాను, అదే విషయం నా తల్లి గారిని అడిగినప్పుడు నా తల్లిగారు చెప్పారు అది వాగ్దానం అని అంటారు, ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో ఏమి చేయబోతున్నాడో అన్న దేవుని వాగ్దానము అందులో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది,

ఎందుకంటే నేను మా అన్నయ్య దగ్గర ఉన్న చాలా బుక్స్ నేను చదువుతూ వచ్చాను, తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ లో తిరిగేవాడు, అప్పుడు కమ్యూనిస్టు భావాలు తాను కలిగి ఉండి అనేకమైన బుక్స్ లెనిన్ మార్క్ఇజం అనే బుక్స్ తన దగ్గర ఉండేవి, గోరా ఈ బుక్స్ అన్ని నేను చదివినప్పుడు నేను కూడా దేవుడు లేడు అన్న వారు చెప్పే లాజిక్కునే నేను నమ్మాను, నమ్మేటట్లు ఉంటాయి ఆ పుస్తకాలు, వారు రాసిన వ్యాసాలు,

నా తల్లి గారు వాగ్దానం గురించి నాకు అలా చెప్పినప్పుడు నేను నా వంతు వచ్చినప్పుడు నేను కానుక వేసి దేవుని అడిగాను, "నీవు నిజంగా దేవుడువైతే నీవు సజీవంగా ఉన్న దేవుడు అయితే నీవు నన్ను చూస్తున్న దేవుడువైతే ఇప్పుడు నేను తీసుకునే ఈ స్లిప్ లో నేను ఒక వ్యక్తిని నా మనసులో ఇష్టపడుతున్నాను. నా మనసులో నేను ఏమనుకుంటున్నానో ఈ స్లిప్ లో రావాలి అప్పుడే నేను నీవు దేవుడివని, నీవు సజీవంగా ఉన్నావని, నమ్ముతాను, అని" నా మనసులో అనుకొని నేను ఆ స్లిప్పును తీసుకున్నాను,

అప్పుడు నాకు వచ్చిన వాగ్దానము సంఖ్యాకాండము 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

నా మనసులో ఉన్నది ఏమిటో చెప్పమని దేవుణ్ణి అడిగితే నా మనసులో ఉన్న దానికి సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు ఇంకో మాట లేకుండా, అది చూసినప్పుడు ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పని అయింది, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, ఇప్పుడు ఈ క్షణంలో నన్ను చూశాడు, నేను ఏమనుకున్నానో దానిని దేవుడు చూశాడు, అని నాకు ఒక భయం అన్నది ఆ క్షణాన నాకు కలిగింది. ఈ వాక్యమే నా జీవితాన్ని మలుపు తిప్పింది,

అప్పటినుండి దేవుడంటే,దేవుడు సజీవంగా ఉన్నాడు అన్న ఒక భయము నాలో కలిగింది, ఇదేనండి ఇక్కడినుండే నా ఆత్మీయ జర్నీ అన్నది ప్రారంభమైనది, ఇది ఎంత బాగుంటుంది అని అంటే అప్పటినుండి మొదలై ఇప్పటివరకు జరిగిన ఈ ఆత్మీయ జర్నీని నేను పదేపదే తలుచుకుంటూ ఉంటాను,

ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడినది, నేను దేవుని అడుగుతున్నది, మా మధ్య జరిగిన సంభాషణ అది ఎంతో అద్భుతమైనది, అది ఏ వ్యక్తి కూడా ఇలా జవాబులు ఇవ్వలేనిది, నాతో దేవుడు మాట్లాడే, మధురమైన సన్నివేశాలు, ఇక్కడినుండే ప్రారంభమైనవి ఇప్పటివరకు, నా జీవితంలో చాలా ఉన్నాయి,

ఇటువంటి సంతోషకరమైన ఆనందాలు సంఘటనలు నా జీవితంలో ఉన్నవి అని అనటానికి ఇదే ఇక్కడే ఈ కొలనూరు మందిరంలోనే ప్రారంభం అయ్యింది, ఇక్కడి నుండే దేవుడు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇప్పటివరకు నన్ను ఎలా నడిపిస్తూ వచ్చాడో, నా ఆత్మీయ జర్నీ అన్నది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది,

{ దేవుడు నన్ను నడుపుతు వచ్చిన మార్గమును ఒక్కసారి ధ్యానం చేశాక చూశాక, ప్రతి ప్రదేశం నాకు ఒక ఆత్మీయ పాఠశాల లాగానే అనిపిస్తుంది.
ప్రతి అడుగులోనూ ఆయన ఒక కొత్త సందేశమును ఇచ్చాడు, ఒక కొత్త దిశను నాకు చూపించాడు.}

ఎస్తేర్ క్రైసోలైట్
6-11-2025

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 3 }

నేను 6 వతరగతిలోకి వచ్చినప్పుడు మేము చింతూరు అనే గ్రామంలోకి మా తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అయింది,ఇది మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది, ఒక అయిదు రూపాయల చార్జితో మేము మధ్యప్రదేశ్ బోర్డర్ ని చూసి వచ్చేవాళ్ళము, ఇక్కడ భద్రాచలము, విశాఖపట్నం, రాజమండ్రి, మధ్యప్రదేశ్ పట్టణాలను కలుపుతూ పెద్ద హైవే వేయబడిన రోడ్లు ఇక్కడ ఉండటం మూలాన ఇక్కడ అన్ని విషయాలలో సౌకర్యాలు అధికంగా ఉండేవి,

మేము ఆ ఊరికి వచ్చినప్పుడు రెండే చర్చిలు ఉన్నాయి, ఒకటి సి ఎస్ ఐ, ఇంకొకటి పేంతుకోస్తు చర్చి, మేము మొదట పేంతుకోస్తు చర్చికి వెళ్లే వాళ్ళము,అక్కడనే నా తల్లిదండ్రులు ఇద్దరు రక్షించ భడి బాప్తీస్మం తీసుకున్నారు, కొద్దిరోజుల తరువాత తోటి క్రిస్టియన్ టీచర్ల ద్వారా నా తల్లి గారు సిఎస్ఐ చర్చిలోకి వెళ్లారు,

ఆ చర్చిలో డబ్బుల విషయంలో గొడవ జరుగుతు ప్రతిసారి విశ్వాసులు పాస్టర్ గారిని కొట్టడం నా తల్లి గారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు, పాస్టర్ గారిని కొట్టడం, యిది వాక్యానికి విరుద్ధం అని పాస్టర్ గారికి సపోర్ట్ గా నా తల్లి గారు నిలబడేది, అది తోటి విశ్వాసులకు నచ్చేది కాదు,

ఈ సిఎస్ ఐ ఈ సహవాసంలో ఉన్నప్పుడే నా తండ్రి గారు సైకిల్ మీద తిరిగి చుట్టుపక్కల గ్రామాలకు పరిచర్యను చేశారు, చింతూరు సిఎస్ ఐ చర్చికి వున్న బరియల్ స్థలము,మా తండ్రి గారు తాను ఒక్కలే ఆ బాధ్యతను తన మీద వేసుకొని సైకిల్ మీద చుట్టుపక్కల గ్రామాలకు తిరుగుతూ ఆ మందిరానికి వచ్చే విశ్వాసులు దగ్గర డబ్బులు సేకరించి,కొంత మా తండ్రి గారు వేసుకుని ఆ స్థలాన్ని కొన్నారు,

మా తండ్రిగారు చనిపోయిన సమయానికి నా తల్లి గారు సి ఎస్ ఐ చర్చిని వదిలి హెబ్రోన్ సహవాసాన్ని స్థాపించారు అని కోపంతో నా తండ్రి గారిని అక్కడ సమాధి చేయటానికి ఆ సంఘాస్తులు కొంత మంది ఒప్పుకోలేదు, మా తండ్రి గారిని భద్రాచలం హెబ్రోన్ సహవాసమునకు చెందిన స్థలంలోని మేము సమాధి చేసాము,

మా తండ్రి గారు ఆ చర్చికి చేసిన సేవకు మనుషులు విలువ ఇవ్వకపోయినా, దేవుడు మాత్రం దానిని మరువడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది…

1కోరింథీయులకు 15:58
కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

దేవుని కొరకు, దేవుని సంఘం క్షమాభివృద్ధి కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు, దేవుని పనులలో, దైవ సంబంధమైన కార్యాలలో, మనం పడిన ప్రయాసకు ఈ లోకంలో మనకు బహుమానము రాకపోవచ్చు కనపడకపోవచ్చు, కానీ పరలోకంలో ఖచ్చితంగా దాని ఫలితమును మనకు వస్తుంది,

మరలా నా తల్లిగారు ఆ సీఎస్ఐ సహవాసంలోని సభ్యులతో సమాధాన పడటానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడండి, నేను దేవుని సేవకు సమర్పించుకున్న తర్వాత ఆది ఎలా అని అంటే,మా దగ్గర విశ్వా వాణి బాక్స్ అనేది ఉండేది, అది విశ్వా వాణి నుంచి వాళ్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి అందులో మనీని వాళ్ళు తీసుకొని వెళ్లేవాళ్లు, అలా విశ్వవాణి వాళ్ళతో మాకు ఒక అనుబంధం ఉండేది,

ఒకసారి వాళ్లు మా గ్రామంలో మీటింగ్స్ పెట్టటానికి వచ్చినప్పుడు వారు ఉండటానికి వారికి మేము ఆతిథ్యం ఇచ్చాము, వాళ్లు సిఎస్ఐ చర్చిలో మీటింగ్స్ పెడుతున్నారు,విశ్వ వాణిలో కళ్ళు లేని భాస్కర్ అన్న ఫ్లూటో ద్వారా పాటను వినిపిస్తారు,ఆయన నన్ను ఆఖరి రోజు మీటింగ్ లో స్టేజి మీద తాను ఫ్లూట్ వాయిస్తు ఉంటే నేను ఆ పాటను నా నోటితో పాడుతూ ఉండాలి అని అన్నారు,

నేను అన్నతో కలిసి అలా పాటను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అన్న వాళ్లు నా తల్లి గారిని ఒప్పించారు, మీ పాప ఆ చర్చిలో నాతో స్టేజి మీద పాడుతూ ఉన్నప్పుడు మీరు చూడకుండా ఎలా ఉంటారు, తప్పకుండా మీరు రావాలి అని,

నా తల్లి గారు మొదట చాల సమయం వరకు దానికి ఒప్పుకోలేదు, తర్వాత దానికి ఒప్పుకొని ఆ చర్చిలో ఆరోజు అడుగు పెట్టారు,మీకు జరిగిన అన్యాయానికి, మీరు ఎప్పటికీ మా చర్చిలో అడుగు పెట్టరు అని అనుకున్నాము అని వారు అందరూ నా తల్లి గారితో ఆప్యాయంగా మాట్లాడారు, వారు
సమాధానపడ్డారు,

ఆ సిఎస్ఐ చర్చిలో ఉన్నంతవరకు కూడా నేను ఒక నామకార్థకంగా ఉండే దానిని, పండగలప్పుడు కొత్త బట్టలు వేసుకొని వెళ్లే దానిని, ఆ చర్చిలో దైవజనుని పట్ల అక్కడ విశ్వాసుల ప్రవర్తన నా తల్లి గారికి నచ్చకపోవటం వలన చాలా రోజులు నా తల్లి గారు ఆదివారం ఇంటిలోనే ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు,

అప్పటికే మేము ఒక సొంత గృహాన్ని కట్టుకున్నాము, కాబట్టి మా గృహంలో రెంట్ కు ఉన్న ఒక క్రిస్టియన్ పోలీసు వాళ్ళు,వారు వారి సొంత ప్రదేశంలో వారి కలిగి ఉన్న హెబ్రోన్ సహవాసమును గురించి నా తల్లి గారికి చెప్పుతూ వచ్చారు,

భద్రాచలంలో ఉన్న ఆ సహవాసం లోని దైవజనుని గురించి నాతల్లి గారికి తెలియజేసి వారిని కలవమని చెప్పటము మూలాన అలా మా గృహంలో హెబ్రోన్ సహవాసం అన్నది ప్రారంభించ బడటం జరిగినది,

అ సమయంలో మా అన్నయ్యకు బ్యాంకులో ఉద్యోగం రావటం మూలాన మా చదువుల నిమిత్తం మమ్ములను తాను ఉండే సిరిసిల్ల అనే పట్టణానికి నన్ను మా చెల్లిని తీసుకుని వెళ్లారు, ఒక న్యూ ఇయర్ రోజున మేము మా అన్నయ్య దగ్గర్నే ఉన్నాము, మేము న్యూ ఇయర్ కి అక్కడికి రావటం లేదు అని మా తల్లి గారికి మా అన్నయ్య చెప్పినప్పుడు,

అప్పుడు మా తల్లిగారు మేమున్న ఆ సిరిసిల్ల పట్టణానికి వచ్చారు, మమ్ములను న్యూ ఇయర్ రోజున వేములవాడ దగ్గరనున్న కొలనూరు అనే ఒక చిన్న గ్రామంలో హెబ్రోన్ సహవాసం ఉంది అని అక్కడకు మమ్ములను తీసుకుని వెళ్లారు, ఆదే ఆ గ్రామంలోనే ఆ మందిరంలోనే నా జీవితమునకు నాకు టర్నింగ్ పాయింట్, దేవుడు నిజంగా సజీవంగా ఉన్నాడు అన్న ప్రత్యక్షతను నేను గుర్తించింది అక్కడనే,

ఆరోజు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కానుకలు వేసే సమయంలో అందరూ కానుకలు వేసి ఒక స్లిప్పును తీసుకొని రావటం నేను గమనించాను, అదే విషయం నా తల్లి గారిని అడిగినప్పుడు నా తల్లిగారు చెప్పారు అది వాగ్దానం అని అంటారు, ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో ఏమి చేయబోతున్నాడో అన్న దేవుని వాగ్దానము అందులో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది,

ఎందుకంటే నేను మా అన్నయ్య దగ్గర ఉన్న చాలా బుక్స్ నేను చదువుతూ వచ్చాను, తను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఐ లో తిరిగేవాడు, అప్పుడు కమ్యూనిస్టు భావాలు తాను కలిగి ఉండి అనేకమైన బుక్స్ లెనిన్ మార్క్ఇజం అనే బుక్స్ తన దగ్గర ఉండేవి, గోరా ఈ బుక్స్ అన్ని నేను చదివినప్పుడు నేను కూడా దేవుడు లేడు అన్న వారు చెప్పే లాజిక్కునే నేను నమ్మాను, నమ్మేటట్లు ఉంటాయి ఆ పుస్తకాలు, వారు రాసిన వ్యాసాలు,

నా తల్లి గారు వాగ్దానం గురించి నాకు అలా చెప్పినప్పుడు నేను నా వంతు వచ్చినప్పుడు నేను కానుక వేసి దేవుని అడిగాను, "నీవు నిజంగా దేవుడువైతే నీవు సజీవంగా ఉన్న దేవుడు అయితే నీవు నన్ను చూస్తున్న దేవుడువైతే ఇప్పుడు నేను తీసుకునే ఈ స్లిప్ లో నేను ఒక వ్యక్తిని నా మనసులో ఇష్టపడుతున్నాను. నా మనసులో నేను ఏమనుకుంటున్నానో ఈ స్లిప్ లో రావాలి అప్పుడే నేను నీవు దేవుడివని, నీవు సజీవంగా ఉన్నావని, నమ్ముతాను, అని" నా మనసులో అనుకొని నేను ఆ స్లిప్పును తీసుకున్నాను,

అప్పుడు నాకు వచ్చిన వాగ్దానము సంఖ్యాకాండము 18:20 నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

నా మనసులో ఉన్నది ఏమిటో చెప్పమని దేవుణ్ణి అడిగితే నా మనసులో ఉన్న దానికి సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు ఇంకో మాట లేకుండా, అది చూసినప్పుడు ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పని అయింది, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, ఇప్పుడు ఈ క్షణంలో నన్ను చూశాడు, నేను ఏమనుకున్నానో దానిని దేవుడు చూశాడు, అని నాకు ఒక భయం అన్నది ఆ క్షణాన నాకు కలిగింది. ఈ వాక్యమే నా జీవితాన్ని మలుపు తిప్పింది,

అప్పటినుండి దేవుడంటే,దేవుడు సజీవంగా ఉన్నాడు అన్న ఒక భయము నాలో కలిగింది, ఇదేనండి ఇక్కడినుండే నా ఆత్మీయ జర్నీ అన్నది ప్రారంభమైనది, ఇది ఎంత బాగుంటుంది అని అంటే అప్పటినుండి మొదలై ఇప్పటివరకు జరిగిన ఈ ఆత్మీయ జర్నీని నేను పదేపదే తలుచుకుంటూ ఉంటాను,

ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడినది, నేను దేవుని అడుగుతున్నది, మా మధ్య జరిగిన సంభాషణ అది ఎంతో అద్భుతమైనది, అది ఏ వ్యక్తి కూడా ఇలా జవాబులు ఇవ్వలేనిది, నాతో దేవుడు మాట్లాడే, మధురమైన సన్నివేశాలు, ఇక్కడినుండే ప్రారంభమైనవి ఇప్పటివరకు, నా జీవితంలో చాలా ఉన్నాయి,

ఇటువంటి సంతోషకరమైన ఆనందాలు సంఘటనలు నా జీవితంలో ఉన్నవి అని అనటానికి ఇదే ఇక్కడే ఈ కొలనూరు మందిరంలోనే ప్రారంభం అయ్యింది, ఇక్కడి నుండే దేవుడు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇప్పటివరకు నన్ను ఎలా నడిపిస్తూ వచ్చాడో, నా ఆత్మీయ జర్నీ అన్నది మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది,

{ దేవుడు నన్ను నడుపుతు వచ్చిన మార్గమును ఒక్కసారి ధ్యానం చేశాక చూశాక, ప్రతి ప్రదేశం నాకు ఒక ఆత్మీయ పాఠశాల లాగానే అనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ ఆయన ఒక కొత్త సందేశమును ఇచ్చాడు, ఒక కొత్త దిశను నాకు చూపించాడు.}

ఎస్తేర్ క్రైసోలైట్
6-11-2025