CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 5 }

దేవుని వాక్యమే మనకు అసలైన ప్రత్యక్షత కాబట్టి,తన వాక్యం ద్వారా దేవుడు మనలను సిద్ధపరుస్తున్నప్పుడు,మన అంతరంగమును నూతన పరుస్తూ తన ఆత్మకు ఇష్టమైన నివాసముగా, మన హృదయాన్ని నిర్మిస్తున్నప్పుడు,

మన లోపల జరిగే ఈ మార్పు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాదు,వాళ్లు గ్రహించిన పద్ధతిలోనే, వాళ్లకు మనము ఎలా అర్థమవుతామో, అలానే మనలను నిర్మించాలని అనుకుంటారు,అందుకే పరిశుద్ధ గ్రంథంలో,మానవులు సిద్ధం చేయని రాళ్లనే దేవుడు తన నివాస మందిరానికి వాడుకుంటూ వచ్చాడు,

“మనుషులు సిద్ధం చేయని రాళ్లు”

మోషే గుడారం గానీ, సొలొమోను మందిరం గానీ కట్టేటప్పుడు దేవుడు మనుషులు సిద్ధం చేయని రాళ్లను వాడమని చెప్పాడు,

  1. 1రాజులు 6:7
    అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.

ఇది సొలొమోను రాజు కాలం, దేవుని మందిరం నిర్మాణం గురించి ఇక్కడ తెలియ పరచబడింది.
రాళ్లు ముందుగానే సిద్ధపరచబడి వచ్చాయి, మందిరం కట్టేటప్పుడు మనుషుల శబ్దం లేదా పరికరాల పనితనం అనేది ఇక్కడ కనపడుట లేదు.

సొలొమోను కాలం {1 రాజులు 6:7 }మందిరం మనుషుల శబ్దం లేకుండా, దేవుని ఆలోచన ప్రకారమే కట్టబడింది,

2. . నిర్గమకాండము 20:25
నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.

ఇది మోషే కాలంలో ఇచ్చిన ఆజ్ఞ.
దేవుడు స్పష్టంగా చెప్పినది: బలిపీఠం మనుషుల చేతులతో చెక్కబడిన రాళ్లతో కాకుండా, ప్రకృతిగా ఉన్న రాళ్లతోనే చేయాలి.

మోషే కాలం {నిర్గమ 20:25 }చెక్కని రాళ్లతో బలిపీఠం కట్టాలి,

3. యెహోషువ 8:31
యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

యెహోషువ కాలం {యెహోషువ 8:31} కత్తితో తగిలించని రాళ్లతో బలిపీఠం

ఇది మోషే ఆజ్ఞను అనుసరించి యెహోషువ కట్టిన బలిపీఠం. ఇక్కడ కూడా రాళ్లు
“కత్తితో తగిలించని”వి అంటే, మనుషులు సిద్ధం చేయని రాళ్లు.

దేవుడు మోషేకు చెప్పినప్పుడు —
“నాకోసం బలిపీఠం కట్టేటప్పుడు, చెక్కిన రాతితో చేయకూడదు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
యెహోషువ కూడా అదే ఆజ్ఞను పాటించి, “కత్తి తగిలించని రాళ్లతో బలిపీఠం” కట్టాడు.
సొలొమోను మందిరం కట్టబడినప్పుడు కూడా, ఇనుప పరికరాల శబ్దం వినబడలేదు.

ఈ మూడు సందర్భాలు మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతున్నాయి, దేవునికి అర్పించేది మానవుని ప్రయత్నాల ద్వారా,వారు చేసే పనుల ద్వారా, వారి చేతల చేతుల చాకచక్యంతో చేసినవి, సిద్ధపరిచినవి కాదు, దేవుని ఆలోచనలతో దేవుడు సిద్ధం చేసిన నిర్మాణమే పరిశుద్ధమైనది,దేవుని చిత్తానుసారముగా ఉండేది,

మనుషులు సిద్ధం చేసిన రాళ్లు అంటే,
మానవుని ఆలోచనలు, మానవుని ప్రయత్నాలు, మానవుని సొంత న్యాయం. కానీ దేవుడు కోరేది,
ఆయన చేతిలో మలచబడిన, ఆయన స్వయంగా సిద్ధం చేసిన మనసు.దేవుడు తన వాక్యము ద్వారా నిర్మించిన మానవుని హృదయం,

బలిపీఠం మీద రాళ్లను మనుషులు కొలవకూడదన్న ఆజ్ఞ వెనుక ఉన్న భావం ఏమిటంటే,
దేవుని సన్నిధి యొక్క ఏర్పాటు మానవ పద్ధతులపై కాకుండా, ఆయన కృపపై ఆధారపడాలి.

దేవుడు నివసించే నివాసం కలవరాలతో, మానవ గద్దింపులతో నిర్మించబడదు, తయారు చేయబడదు కానీ,సొలొమోను మందిరంలో లాగా, దేవుడు నివసించే దేవుని నివాసం, మానవుని హృదయం కూడా, సమాధానముతో శాంతితో నిర్మించబడాలి. అక్కడ ఇనుప పరికరాల శబ్దం మందిరానికి ఉపయోగపడే రాళ్లను చేక్కె శబ్దం అస్సలు అక్కడ వినబడలేదు.

దేవుని ఆత్మ మనలో పనిచేసేటప్పుడు కూడా మన ఆత్మీయ జీవితము మన హృదయము కూడా అలానే,ఎలాంటి శబ్దం లేకుండా, లోపల మౌనంగా
రూపాంతర పరచబడుతుంది. దేవుడు మన హృదయాన్ని స్వయంగా తాను నివసించడానికి, తనకి ఇష్టమైన రీతిలో తన వాక్యము ద్వారా తీర్చిదిద్దుతాడు.దేవుడు కోరేది “మనుషులు సిద్ధం చేయని రాళ్లు” అంటే, దేవుడు సిద్ధం చేసిన హృదయం , దేవుడు సిద్ధం చేసిన ఆత్మీయ జీవితం,

సొలొమోను కట్టిన మందిరంలాగా, దేవుని నివాసం కూడా దేవుని వాక్యం చేత మానవుని హృదయాలలో నిర్మించబడుతుంది.
అక్కడ ఇనుప పరికరాల శబ్దం వినబడలేదు.
దేవుని ఆత్మ మనలో పనిచేసేటప్పుడు కూడా, ఎలాంటి శబ్దం లేకుండా, లోపల మౌనంగా,మన హృదయం, మన ఆత్మీయ జీవితం కూడా అలానే, రూపాంతరం చేయభడుతుంది. దేవుడు తన వాక్యము ద్వారా, మన హృదయాన్ని స్వయంగా నిర్మిస్తాడు, తీర్చిదిద్దుతాడు.

అందుకే చాలామంది దైవజనులు చెప్పే వాక్యము ఎవరిలో ఎలా అది పనిచేస్తుందో, వారి హృదయాన్ని ఎలా రూపాంతర పరుస్తుందో, వారి ఆత్మీయ జీవితాన్ని ఎలా దేవునిలో కడుతుందో,ఆ దేవుని వాక్యము బోధించే వాళ్లకి,అసలు తెలవదు,

అందుకే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తికి ఈ వాక్యము అవసరం ఉంది అని చెప్పే వాక్యాలు ఎప్పుడు కూడా అవి ఫలించవు, ఎందుకంటే శరీర స్వభావంతో ప్రకటింపబడుతున్న వాక్యము, శరీర స్వభావంతో, మానవులను మంచి వ్యక్తులుగా రూపాంతర పరచాలని అనుకుని చేసే మానవుని ప్రయత్నాలు అన్నీ ఇవన్నీ కూడా భూసంబంధ మైనవే, నశించిపోయేవే కాబట్టి,

సంఖ్యా 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.అన్న వాగ్దానం ద్వారా దేవుడు నా హృదయాన్ని పట్టుకున్నాడు,నా జీవితాన్ని తన ఉద్దేశం లో రూపాంతర పరచాలని దేవుడు తన పనిని ప్రారంభించాడని,దేవుని ఏర్పాటును దేవుని ఉద్దేశమును గ్రహించని నా ఇంటి వారి ద్వారా నాకు కలిగిన ఈ పరీక్షలో దేవుడు,"నేను నేనే మిమ్ము నోదార్చువాడను" అన్న తన వాగ్దానము ద్వారా నన్ను ఆ సంవత్సరంలో నేను నడిపించబడిన, వేదనకరమైన, అవమానకరమైన, ఆ మార్గంలో నన్ను ఆదరిస్తూ వచ్చాడు,

ఆ తర్వాత సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం
ద్వితి 20:3 "మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి," ఆ సంవత్సరం నా వాగ్దానం ఎలా నెరవేరింది అని అంటే, భద్రాచలం దగ్గర తునికి చెరువు అనే ఒక గ్రామంలో ఒక సువార్త కూడిక జరగబోతుంది అని నాకు తెలిసినప్పుడు ఆ కూడికకు వెళ్లాలని నాకు ప్రేరేపణ బాగా వచ్చింది,

కాని ఆ సువార్త కూడిక జరిగిన తెల్లవారే నాకు ఒక ప్రాముఖ్యమైన పరీక్ష ఉంది,సువార్త కూడికకు నేను వెళ్లాలని మా అన్నయ్యని అడిగితే వద్దు చదువుకోవా రేపు ఎగ్జామ్ అంటే అని తిడతాడు,ఇప్పుడు నేను ఏం చేయాలి,అని ఆలోచిస్తూ ఉంటే నాకు క్యాలెండర్ వాక్యం గుర్తుకొచ్చింది,

అప్పటికి నేను ఇంకా డైలీ పోర్షన్ చదవటం అన్నది నాకు అలవాటు కాలేదు, ఏదన్నా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు క్యాలెండర్లో వాక్యాన్ని చూసుకునేదాన్ని, అదే నాకు డైలీ పోర్షన్ లాంటిది,
ఆరోజు క్యాలెండర్ వాక్యము,

"హెబ్రీయులకు 12:2
విశ్వాసమునకు కర్తయు(మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, "

ఈ వాక్యమును చూసినప్పుడు,నాకు ఆ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం "మీ హృదయములు జంగనీయకుడి భయపడకుడి అన్న వాగ్దానము నాకు గుర్తుకు వచ్చి,నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను,భయపడకుండా వెళ్ళమని దేవుడు నన్ను వెళ్ళమని చెప్తున్నాడు, అని నాకు అర్థమయ్యి నేను ఒకటే అనుకున్నాను, నేను ఆ కూడికకు ఉదయాన్నే బయలుదేరి మా చెల్లి తో నేను వెళుతున్నాను అని మా అన్నయ్యకి చెప్పమని చెప్పి ఇంట్లో మా అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా లేవక ముందే నేను తెల్లవారు జామునే ఇంటి నుండి మందిరానికి వెళ్లిపోయాను,

నేను అలా నాకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి,నేను అలా వెళ్ళబట్టి ఆ కూడికలో నేను నా రక్షణ కొరకు తీర్మానం అన్నది నేను తీసుకోగలిగాను,నేను ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అయితే మా అన్నయ్య తిట్టలేదు, కానీ నిద్రలేచిన తర్వాత నా విషయము తెలిసి, మా చెల్లిని బాగా తిట్టారు అని నాకు తెలిసింది,

అప్పుడప్పుడే నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, మందిరానికి వెళ్లడం వరకే నాకు తెలుసు, కానీ ఏ కూడిక ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి సువార్త కూడిక ఎలా ఉంటుందో చూడాలని నేను ఆశపడి నప్పుడు దేవుడు నన్ను ఇలా ఆ కూడికకు నడిపించాడు,

ఆ కూడికలో ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ,పరమ కానాను వెళ్లాలి అని అంటే ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో ప్రత్యేకింపబడాలి, అన్న వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడు నా రక్షణ విషయమై నాతో మాట్లాడుతూ వచ్చాడు,

అప్పుడు నాకున్న ఒక పిచ్చి ఏమిటంటే అలంకరణ, విపరీతమైన అలంకరణతో నన్ను నేను అలంకరించుకుంటూ ఉండేదాన్ని, ఒక ఫ్యాషన్
గర్ల్ గా నేను కనపడాలి అన్న తాపత్రయంతో ఏ కొత్త ఫ్యాషన్ వచ్చిన అది నా బట్టల మీద ఉండేది, నా అలంకరణలో కనపడేది,నా తల వెంట్రుకల ద్వార కూడా ఆ ఫ్యాషన్ అనేది కనపడేది,

ఆరోజు ఆ వాక్యాన్ని నేను వింటున్నప్పుడు
నేను పరమ కనాను వెళ్ళటానికి అన్ని విషయాలలో నేను ప్రత్యేకించి భడాలి,నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఈమె ఒక క్రిస్టియన్ అమ్మాయి అని నన్ను గుర్తించాలి,అన్న ఆశను అక్షణానా దేవుడు నా హృదయంలో పుట్టించాడు,అప్పటినుండి నేను అంటే ఆ క్షణం నుంచే నేను అన్ని ఫ్యాషన్ లను నేను మానివేశాను,

తరువాత కొన్ని రోజులకు నన్ను చూసిన నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, నీవు అలా ఎందుకు అయిపోయావు,ఎవరినైనా ప్రేమించి ప్రేమలో fail అయ్యావా? అలా అయిపోయావు అని నాతో అన్నారు,అంటే వాళ్ళ దృష్టిలో నేను అంత మారిపోయాను,అంతకుముందు లోకంలో ఉన్న అన్ని ఫ్యాషన్ ల తోటి, లోకంలో ఉన్న అలంకరణతో నేను కనబడలేదు కదా, అందుకోసం వారు నన్ను అలా ఊహించుకున్నారు,

ఆ సువార్త కుడికకు వెళ్లి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆ సువార్త కూడికకు నేను వెళ్లాలని దేవుడు నా హృదయంలో ఎందుకంత కోరికను కలగచేసాడో,అక్కడికి నన్ను అలా పట్టుదలగా ఎందుకు నడిపించాడో,

చూడండి •••• దైవ సంబంధమైన ఏ కార్యము కొరకైనా, దైవ సంబంధమైన దేనిని చేయడానికైనా, దేవుడు మనకు ప్రేరణ ఇస్తుంటే, దేవుడు తన వాక్యము ద్వారా,మనతో మాట్లాడుతూ ఉంటే, దాని ద్వారా మనకు ఏదో మేలు కలుగుతుంది,దేవుని ఉద్దేశం మనలో నెరవేరుతుంది, మన ద్వారా దేవుని పని జరిగించ బడుతుంది, అని మనం గ్రహించాలి,ఎవ్వరికి మనము భయపడాల్సిన అవసరం లేదు,మన హృదయములను ఏ విషయానికి కూడా జంకనీయకూడదు,
భయమన్నది రానీయకూడదు,

అదే సంవత్సరం నేను వెళ్తున్నా మందిరమును విశాల పరచటానికి కానుకలు దేవునికి అర్పించండి, అని దైవజనులు ప్రకటన చేసినప్పుడు,నేను ఆ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమునే జ్ఞాపకం చేసుకొని,నా దగ్గర ఉన్నటువంటి వస్తువులను మా ఇంటిలో ఎవ్వరిని కూడా దాని విషయమై ఎవ్వరి అనుమతిని అడగకుండా వాటన్నిటినీ కానుక పెట్టిలో వేశాను,

తర్వాత నా తల్లి గారు నన్ను తిట్టారు, అవి నీవీ అనుకున్నావా, మేము చేపించినవి మాకు చెప్పాలి కదా అని,అప్పటికి వేసేసాను కదా వాళ్ళు ఎన్ని తిట్టుకున్న ఇంకా నాకు బాధ లేదు,దేవుడు నాకు ఇవ్వాలి అన్న ప్రేరణ ఇచ్చాడు, కాబట్టి నేను ఇచ్చాను, అని నేను వురుకున్న,

"మీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి"అన్న వాగ్దానమును దేవుడు నాకు ఆ సంవత్సరంలో ఇచ్చి ఆ సంవత్సరంలో,
ఈ రెండు కార్యాలను నా జీవితంలో సంపూర్తి చేశాడు,

అందుకే దేవుడు నడిపిన మార్గంలో నేను నేర్చుకున్నది ఇదే, దేవుని వాగ్దానం అనే వాక్యమే నా జీవితంలోని ప్రతి రాయిని చెక్కి, తన నివాసంగా నన్ను తయారు చేస్తున్నాడు.మనుషులు సిద్ధం చేయని రాళ్లతో కట్టబడిన ఆ మందిరంలాగానే,
నా హృదయమును కూడా దేవుడు స్వయంగా తీర్చిదిద్దుతున్నాడు.

ఇందు కోరకే ప్రతి సంవత్సరం దేవుని వాగ్దానాలను నేను క్రమం తప్పకుండా ఆసక్తితో నేను తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాగ్దానం ద్వారానే న్యూ ఇయర్ రోజున దేవునికి నేను పట్టుబడ్డాను, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేముందు వాగ్దానం తీసుకోకుండా ఆ మందిరంలో నుంచి ఆ దేవుని సన్నిధిలో నుంచి నేను బయటకు రాను,

నా జీవితంలో దేవుడు నియమించిన నూతన సంవత్సరంలోనికి నేను అడుగు పెడుతున్నాను, కాబట్టి దేవుని దగ్గర వాగ్దానం అన్నది నేను తీసుకుంటే నాకు క్షేమం మాత్రమే కాకుండా దేవుని ఉద్దేశం అన్నది కూడా నా జీవితంలో నెరవేర్చబడుతుంది.,

యిది ఒక సంవత్సరంలో మాత్రమే కాదు,
మనమేమి ప్రారంభించినా, మన శక్తితో కాకుండా దేవుని శక్తి గొప్పది అని గుర్తించి,
ఆ విషయానికి సంబంధించిన వాక్యమనే వాగ్దానాన్ని ముందుగా దేవుని దగ్గర నుండి తీసుకున్నప్పుడు,
దేవుడు ఆ వాక్యమనే వాగ్దానం ద్వారా మనతో ఉండి, మనము నడిచే ప్రతి మార్గంలో విజయం ప్రసాదిస్తాడు.

మనం అడుగు పెట్టేది అది నూతన సంవత్సరమైనా,మనము ప్రారంభించేది అది నూతన కార్యమైన, మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈ సంవత్సరంలో ఈ విషయంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీరు ఏమి చేస్తారో అవాగ్ధానాన్ని నాకు ఇవ్వండి, అని మనము దేవున్ని అడిగి వాక్యమనే వాగ్దానమును మనము తీసుకున్నప్పుడు , దేవుడా వాగ్దానమును తన ఉద్దేశమును మన జీవితంలో కచ్చితంగా జరిగించి తీరుస్తాడు,

మన జీవితంలోకి వచ్చే ప్రతి నూతనమైన దాని విషయంలో మనము ఇలా చేయటం ద్వారా, మనము దేవునిపై ఆధారపడుతున్నాము, దేవున్ని ప్రార్థిస్తున్నాము, ఆ విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చమని దేవునికి అవకాశాన్ని ఇస్తున్నాము, మనకు సంబంధించిన దానిమీద మొట్టమొదటిగా దేవునికి అధికారాన్ని ఇస్తున్నాము,

చాలామంది నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానాన్ని ఎందుకు తీసుకోవాలి? అని అంటూ ఉంటారు,చూశారా •••• దేవుని వాక్యం అనే వాగ్దానాన్ని మనము అడుగుట ద్వారా, ఎన్ని విషయాలు జరుగుతున్నాయో, మీరు కూడా ఇలానే ప్రతి సంవత్సరం, ప్రతి విషయంలో విశ్వాసంతో వాక్యమనే వాగ్దానమును తీసుకుంటూ ఉంటారు కదా!

ఎస్తేర్ క్రైసోలైట్
8-11-2025

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 5 }

దేవుని వాక్యమే మనకు అసలైన ప్రత్యక్షత కాబట్టి,తన వాక్యం ద్వారా దేవుడు మనలను సిద్ధపరుస్తున్నప్పుడు,మన అంతరంగమును నూతన పరుస్తూ తన ఆత్మకు ఇష్టమైన నివాసముగా, మన హృదయాన్ని నిర్మిస్తున్నప్పుడు,

మన లోపల జరిగే ఈ మార్పు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాదు,వాళ్లు గ్రహించిన పద్ధతిలోనే, వాళ్లకు మనము ఎలా అర్థమవుతామో, అలానే మనలను నిర్మించాలని అనుకుంటారు,అందుకే పరిశుద్ధ గ్రంథంలో,మానవులు సిద్ధం చేయని రాళ్లనే దేవుడు తన నివాస మందిరానికి వాడుకుంటూ వచ్చాడు,

“మనుషులు సిద్ధం చేయని రాళ్లు”

మోషే గుడారం గానీ, సొలొమోను మందిరం గానీ కట్టేటప్పుడు దేవుడు మనుషులు సిద్ధం చేయని రాళ్లను వాడమని చెప్పాడు,

  1. 1రాజులు 6:7
    అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను, మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలిమొదలైన యినుప పనిముట్ల ధ్వని యెంత మాత్రమును వినబడలేదు.

ఇది సొలొమోను రాజు కాలం, దేవుని మందిరం నిర్మాణం గురించి ఇక్కడ తెలియ పరచబడింది.
రాళ్లు ముందుగానే సిద్ధపరచబడి వచ్చాయి, మందిరం కట్టేటప్పుడు మనుషుల శబ్దం లేదా పరికరాల పనితనం అనేది ఇక్కడ కనపడుట లేదు.

సొలొమోను కాలం {1 రాజులు 6:7 }మందిరం మనుషుల శబ్దం లేకుండా, దేవుని ఆలోచన ప్రకారమే కట్టబడింది,

2. . నిర్గమకాండము 20:25
నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.

ఇది మోషే కాలంలో ఇచ్చిన ఆజ్ఞ.
దేవుడు స్పష్టంగా చెప్పినది: బలిపీఠం మనుషుల చేతులతో చెక్కబడిన రాళ్లతో కాకుండా, ప్రకృతిగా ఉన్న రాళ్లతోనే చేయాలి.

మోషే కాలం {నిర్గమ 20:25 }చెక్కని రాళ్లతో బలిపీఠం కట్టాలి,

3. యెహోషువ 8:31
యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.

యెహోషువ కాలం {యెహోషువ 8:31} కత్తితో తగిలించని రాళ్లతో బలిపీఠం

ఇది మోషే ఆజ్ఞను అనుసరించి యెహోషువ కట్టిన బలిపీఠం. ఇక్కడ కూడా రాళ్లు
“కత్తితో తగిలించని”వి అంటే, మనుషులు సిద్ధం చేయని రాళ్లు.

దేవుడు మోషేకు చెప్పినప్పుడు —
“నాకోసం బలిపీఠం కట్టేటప్పుడు, చెక్కిన రాతితో చేయకూడదు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
యెహోషువ కూడా అదే ఆజ్ఞను పాటించి, “కత్తి తగిలించని రాళ్లతో బలిపీఠం” కట్టాడు.
సొలొమోను మందిరం కట్టబడినప్పుడు కూడా, ఇనుప పరికరాల శబ్దం వినబడలేదు.

ఈ మూడు సందర్భాలు మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతున్నాయి, దేవునికి అర్పించేది మానవుని ప్రయత్నాల ద్వారా,వారు చేసే పనుల ద్వారా, వారి చేతల చేతుల చాకచక్యంతో చేసినవి, సిద్ధపరిచినవి కాదు, దేవుని ఆలోచనలతో దేవుడు సిద్ధం చేసిన నిర్మాణమే పరిశుద్ధమైనది, దేవుని చిత్తానుసారముగా ఉండేది,

మనుషులు సిద్ధం చేసిన రాళ్లు అంటే,
మానవుని ఆలోచనలు, మానవుని ప్రయత్నాలు, మానవుని సొంత న్యాయం. కానీ దేవుడు కోరేది,
ఆయన చేతిలో మలచబడిన, ఆయన స్వయంగా సిద్ధం చేసిన మనసు.దేవుడు తన వాక్యము ద్వారా నిర్మించిన మానవుని హృదయం,

బలిపీఠం మీద రాళ్లను మనుషులు కొలవకూడదన్న ఆజ్ఞ వెనుక ఉన్న భావం ఏమిటంటే, దేవుని సన్నిధి యొక్క ఏర్పాటు మానవ పద్ధతులపై కాకుండా, ఆయన కృపపై ఆధారపడాలి.

దేవుడు నివసించే నివాసం కలవరాలతో, మానవ గద్దింపులతో నిర్మించబడదు, తయారు చేయబడదు కానీ,సొలొమోను మందిరంలో లాగా, దేవుడు నివసించే దేవుని నివాసం, మానవుని హృదయం కూడా, సమాధానముతో శాంతితో నిర్మించబడాలి. అక్కడ ఇనుప పరికరాల శబ్దం మందిరానికి ఉపయోగపడే రాళ్లను చేక్కె శబ్దం అస్సలు అక్కడ వినబడలేదు.

దేవుని ఆత్మ మనలో పనిచేసేటప్పుడు కూడా మన ఆత్మీయ జీవితము మన హృదయము కూడా అలానే,ఎలాంటి శబ్దం లేకుండా, లోపల మౌనంగా రూపాంతర పరచబడుతుంది. దేవుడు మన హృదయాన్ని స్వయంగా తాను నివసించడానికి, తనకి ఇష్టమైన రీతిలో తన వాక్యము ద్వారా తీర్చిదిద్దుతాడు.దేవుడు కోరేది “మనుషులు సిద్ధం చేయని రాళ్లు” అంటే, దేవుడు సిద్ధం చేసిన హృదయం , దేవుడు సిద్ధం చేసిన ఆత్మీయ జీవితం,

సొలొమోను కట్టిన మందిరంలాగా, దేవుని నివాసం కూడా దేవుని వాక్యం చేత మానవుని హృదయాలలో నిర్మించబడుతుంది.
అక్కడ ఇనుప పరికరాల శబ్దం వినబడలేదు.
దేవుని ఆత్మ మనలో పనిచేసేటప్పుడు కూడా, ఎలాంటి శబ్దం లేకుండా, లోపల మౌనంగా,మన హృదయం, మన ఆత్మీయ జీవితం కూడా అలానే, రూపాంతరం చేయభడుతుంది. దేవుడు తన వాక్యము ద్వారా, మన హృదయాన్ని స్వయంగా నిర్మిస్తాడు, తీర్చిదిద్దుతాడు.

అందుకే చాలామంది దైవజనులు చెప్పే వాక్యము ఎవరిలో ఎలా అది పనిచేస్తుందో, వారి హృదయాన్ని ఎలా రూపాంతర పరుస్తుందో, వారి ఆత్మీయ జీవితాన్ని ఎలా దేవునిలో కడుతుందో,ఆ దేవుని వాక్యము బోధించే వాళ్లకి,అసలు తెలవదు,

అందుకే ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ వ్యక్తికి ఈ వాక్యము అవసరం ఉంది అని చెప్పే వాక్యాలు ఎప్పుడు కూడా అవి ఫలించవు, ఎందుకంటే శరీర స్వభావంతో ప్రకటింపబడుతున్న వాక్యము, శరీర స్వభావంతో, మానవులను మంచి వ్యక్తులుగా రూపాంతర పరచాలని అనుకుని చేసే మానవుని ప్రయత్నాలు అన్నీ ఇవన్నీ కూడా భూసంబంధ మైనవే, నశించిపోయేవే కాబట్టి,

సంఖ్యా 18:20
నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.అన్న వాగ్దానం ద్వారా దేవుడు నా హృదయాన్ని పట్టుకున్నాడు,నా జీవితాన్ని తన ఉద్దేశం లో రూపాంతర పరచాలని దేవుడు తన పనిని ప్రారంభించాడని,దేవుని ఏర్పాటును దేవుని ఉద్దేశమును గ్రహించని నా ఇంటి వారి ద్వారా నాకు కలిగిన ఈ పరీక్షలో దేవుడు,"నేను నేనే మిమ్ము నోదార్చువాడను" అన్న తన వాగ్దానము ద్వారా నన్ను ఆ సంవత్సరంలో నేను నడిపించబడిన,వేదనకరమైన, అవమానకరమైన, ఆ మార్గంలో నన్ను ఆదరిస్తూ వచ్చాడు,

ఆ తర్వాత సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం
ద్వితి 20:3 "మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి," ఆ సంవత్సరం నా వాగ్దానం ఎలా నెరవేరింది అని అంటే, భద్రాచలం దగ్గర తునికి చెరువు అనే ఒక గ్రామంలో ఒక సువార్త కూడిక జరగబోతుంది అని నాకు తెలిసినప్పుడు ఆ కూడికకు వెళ్లాలని నాకు ప్రేరేపణ బాగా వచ్చింది,

కాని ఆ సువార్త కూడిక జరిగిన తెల్లవారే నాకు ఒక ప్రాముఖ్యమైన పరీక్ష ఉంది,సువార్త కూడికకు నేను వెళ్లాలని మా అన్నయ్యని అడిగితే వద్దు చదువుకోవా రేపు ఎగ్జామ్ అంటే అని తిడతాడు,ఇప్పుడు నేను ఏం చేయాలి,అని ఆలోచిస్తూ ఉంటే నాకు క్యాలెండర్ వాక్యం గుర్తుకొచ్చింది,

అప్పటికి నేను ఇంకా డైలీ పోర్షన్ చదవటం అన్నది నాకు అలవాటు కాలేదు, ఏదన్నా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు క్యాలెండర్లో వాక్యాన్ని చూసుకునేదాన్ని, అదే నాకు డైలీ పోర్షన్ లాంటిది, ఆరోజు క్యాలెండర్ వాక్యము,

"హెబ్రీయులకు 12:2
విశ్వాసమునకు కర్తయు (మూలభాషలో-సేనాధిపతియు) దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, "

ఈ వాక్యమును చూసినప్పుడు,నాకు ఆ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం "మీ హృదయములు జంగనీయకుడి భయపడకుడి అన్న వాగ్దానము నాకు గుర్తుకు వచ్చి,నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను,భయపడకుండా వెళ్ళమని దేవుడు నన్ను వెళ్ళమని చెప్తున్నాడు, అని నాకు అర్థమయ్యి నేను ఒకటే అనుకున్నాను, నేను ఆ కూడికకు ఉదయాన్నే బయలుదేరి మా చెల్లి తో నేను వెళుతున్నాను అని మా అన్నయ్యకి చెప్పమని చెప్పి ఇంట్లో మా అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా లేవక ముందే నేను తెల్లవారు జామునే ఇంటి నుండి మందిరానికి వెళ్లిపోయాను,

నేను అలా నాకు వచ్చిన వాగ్దానాన్ని బట్టి,నేను అలా వెళ్ళబట్టి ఆ కూడికలో నేను నా రక్షణ కొరకు తీర్మానం అన్నది నేను తీసుకోగలిగాను,నేను ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అయితే మా అన్నయ్య తిట్టలేదు, కానీ నిద్రలేచిన తర్వాత నా విషయము తెలిసి, మా చెల్లిని బాగా తిట్టారు అని నాకు తెలిసింది,

అప్పుడప్పుడే నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి, మందిరానికి వెళ్లడం వరకే నాకు తెలుసు, కానీ ఏ కూడిక ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి సువార్త కూడిక ఎలా ఉంటుందో చూడాలని నేను ఆశపడి నప్పుడు దేవుడు నన్ను ఇలా ఆ కూడికకు నడిపించాడు,

ఆ కూడికలో ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ,పరమ కానాను వెళ్లాలి అని అంటే ఈ లోకంలో మనము అన్ని విషయాల్లో ప్రత్యేకింపబడాలి, అన్న వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడు నా రక్షణ విషయమై నాతో మాట్లాడుతూ వచ్చాడు,

అప్పుడు నాకున్న ఒక పిచ్చి ఏమిటంటే అలంకరణ, విపరీతమైన అలంకరణతో నన్ను నేను అలంకరించుకుంటూ ఉండేదాన్ని, ఒక ఫ్యాషన్గర్ల్ గా నేను కనపడాలి అన్న తాపత్రయంతో ఏ కొత్త ఫ్యాషన్ వచ్చిన అది నా బట్టల మీద ఉండేది, నా అలంకరణలో కనపడేది,నా తల వెంట్రుకల ద్వార కూడా ఆ ఫ్యాషన్ అనేది కనపడేది,

ఆరోజు ఆ వాక్యాన్ని నేను వింటున్నప్పుడు
నేను పరమ కనాను వెళ్ళటానికి అన్ని విషయాలలో నేను ప్రత్యేకించి భడాలి,నన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఈమె ఒక క్రిస్టియన్ అమ్మాయి అని నన్ను గుర్తించాలి,అన్న ఆశను అక్షణానా దేవుడు నా హృదయంలో పుట్టించాడు,అప్పటినుండి నేను అంటే ఆ క్షణం నుంచే నేను అన్ని ఫ్యాషన్ లను నేను మానివేశాను,

తరువాత కొన్ని రోజులకు నన్ను చూసిన నా ఫ్రెండ్స్ నాతో అన్నారు, నీవు అలా ఎందుకు అయిపోయావు,ఎవరినైనా ప్రేమించి ప్రేమలో fail అయ్యావా? అలా అయిపోయావు అని నాతో అన్నారు,అంటే వాళ్ళ దృష్టిలో నేను అంత మారిపోయాను,అంతకుముందు లోకంలో ఉన్న అన్ని ఫ్యాషన్ ల తోటి, లోకంలో ఉన్న అలంకరణతో నేను కనబడలేదు కదా, అందుకోసం వారు నన్ను అలా ఊహించుకున్నారు,

ఆ సువార్త కుడికకు వెళ్లి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఆ సువార్త కూడికకు నేను వెళ్లాలని దేవుడు నా హృదయంలో ఎందుకంత కోరికను కలగచేసాడో,అక్కడికి నన్ను అలా పట్టుదలగా ఎందుకు నడిపించాడో,

చూడండి •••• దైవ సంబంధమైన ఏ కార్యము కొరకైనా, దైవ సంబంధమైన దేనిని చేయడానికైనా, దేవుడు మనకు ప్రేరణ ఇస్తుంటే, దేవుడు తన వాక్యము ద్వారా,మనతో మాట్లాడుతూ ఉంటే, దాని ద్వారా మనకు ఏదో మేలు కలుగుతుంది,దేవుని ఉద్దేశం మనలో నెరవేరుతుంది, మన ద్వారా దేవుని పని జరిగించ బడుతుంది, అని మనం గ్రహించాలి,ఎవ్వరికి మనము భయపడాల్సిన అవసరం లేదు,మన హృదయములను ఏ విషయానికి కూడా జంకనీయకూడదు,భయమన్నది రానీయకూడదు,

అదే సంవత్సరం నేను వెళ్తున్నా మందిరమును విశాల పరచటానికి కానుకలు దేవునికి అర్పించండి, అని దైవజనులు ప్రకటన చేసినప్పుడు,నేను ఆ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమునే జ్ఞాపకం చేసుకొని,నా దగ్గర ఉన్నటువంటి వస్తువులను మా ఇంటిలో ఎవ్వరిని కూడా దాని విషయమై ఎవ్వరి అనుమతిని అడగకుండా వాటన్నిటినీ కానుక పెట్టిలో వేశాను,

తర్వాత నా తల్లి గారు నన్ను తిట్టారు, అవి నీవీ అనుకున్నావా, మేము చేపించినవి మాకు చెప్పాలి కదా అని,అప్పటికి వేసేసాను కదా వాళ్ళు ఎన్ని తిట్టుకున్న ఇంకా నాకు బాధ లేదు,దేవుడు నాకు ఇవ్వాలి అన్న ప్రేరణ ఇచ్చాడు, కాబట్టి నేను ఇచ్చాను, అని నేను వురుకున్న,

"మీ హృదయములను జంకనీయకుడి భయపడకుడి"అన్న వాగ్దానమును దేవుడు నాకు ఆ సంవత్సరంలో ఇచ్చి ఆ సంవత్సరంలో,
ఈ రెండు కార్యాలను నా జీవితంలో సంపూర్తి చేశాడు,

అందుకే దేవుడు నడిపిన మార్గంలో నేను నేర్చుకున్నది ఇదే, దేవుని వాగ్దానం అనే వాక్యమే నా జీవితంలోని ప్రతి రాయిని చెక్కి, తన నివాసంగా నన్ను తయారు చేస్తున్నాడు.మనుషులు సిద్ధం చేయని రాళ్లతో కట్టబడిన ఆ మందిరంలాగానే,
నా హృదయమును కూడా దేవుడు స్వయంగా తీర్చిదిద్దుతున్నాడు.

ఇందు కోరకే ప్రతి సంవత్సరం దేవుని వాగ్దానాలను నేను క్రమం తప్పకుండా ఆసక్తితో నేను తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే వాగ్దానం ద్వారానే న్యూ ఇయర్ రోజున దేవునికి నేను పట్టుబడ్డాను, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేముందు వాగ్దానం తీసుకోకుండా ఆ మందిరంలో నుంచి ఆ దేవుని సన్నిధిలో నుంచి నేను బయటకు రాను,

నా జీవితంలో దేవుడు నియమించిన నూతన సంవత్సరంలోనికి నేను అడుగు పెడుతున్నాను, కాబట్టి దేవుని దగ్గర వాగ్దానం అన్నది నేను తీసుకుంటే నాకు క్షేమం మాత్రమే కాకుండా దేవుని ఉద్దేశం అన్నది కూడా నా జీవితంలో నెరవేర్చబడుతుంది.,

యిది ఒక సంవత్సరంలో మాత్రమే కాదు,
మనమేమి ప్రారంభించినా, మన శక్తితో కాకుండా దేవుని శక్తి గొప్పది అని గుర్తించి,ఆ విషయానికి సంబంధించిన వాక్యమనే వాగ్దానాన్ని ముందుగా దేవుని దగ్గర నుండి తీసుకున్నప్పుడు,దేవుడు ఆ వాక్యమనే వాగ్దానం ద్వారా మనతో ఉండి, మనము నడిచే ప్రతి మార్గంలో విజయం ప్రసాదిస్తాడు.

మనం అడుగు పెట్టేది అది నూతన సంవత్సరమైనా,మనము ప్రారంభించేది అది నూతన కార్యమైన, మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈ సంవత్సరంలో ఈ విషయంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ మీరు ఏమి చేస్తారో అవాగ్ధానాన్ని నాకు ఇవ్వండి, అని మనము దేవున్ని అడిగి వాక్యమనే వాగ్దానమును మనము తీసుకున్నప్పుడు దేవుడా వాగ్దానమును తన ఉద్దేశమును మన జీవితంలో కచ్చితంగా జరిగించి తీరుస్తాడు,