2025 Messages
🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿
నా జీవిత సాక్ష్యం { 6 }
దేవుని వాక్యము ద్వారా మనం తీసుకునే వాగ్దానం యొక్క అర్థం చాలా మందికి స్పష్టంగా తెలియదు. మన జీవితంలోని ఏ విషయం కోసం అయినా మనం ప్రార్థించినప్పుడు, ఆ విషయములో దేవుని ఉద్దేశం ఏమిటి, ఆయన మన కోసం ఏది సిద్ధం చేశాడు, ఆ పరిస్థితిలో ఆయన మనకు ఏ హామీ ఇస్తున్నాడు, అనే విషయాలను తెలుసుకోవడం, ఇదే వాగ్దానం తీసుకోవడం అని చెప్పవచ్చు.
వాగ్దానం అంటే మన మనస్సు కోరినదాన్ని బలపరచుకోవడం కాదు, దేవుని చిత్తాన్ని మన జీవితానికి తెలిసికొనడం. ఒక్క వచనం ద్వారా దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడే ఏర్పాటే వాగ్దానం తీసుకోవడం,
నేను నా రక్షణ కొరకు తీర్మాణం చేసుకున్నా తరువాత, భాప్తిస్మం తీసుకోవాలని ఆనుకున్నా,
నా కంటే ముందు జన్మించిన నా ఆక్కకు తనకు చాల కాలము క్రితమె వివాహం అయ్యింది,మా బావగారు తాను ఒక గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ, తాను దేవుని సేవలో బాగా వాడబడేవారు, వైజాగ్ లో ఉన్న మార్టిన్ అంకుల్ వాళ్ల సహవాసంలో మా బావ గారు దేవుని పరిచర్యను చేస్తూ చింతపల్లి నర్సీపట్నం ప్రాంతంలో తాను ఉద్యోగ రిత్య ఆ సమయంలో ఉన్నారు,
భక్త సింగ్ గారికి ప్రియమైన శిష్యుడు మార్టిన్ అంకుల్ అని,తనతో నాకు బాప్తిస్మం ఇప్పించాలి అని, నన్ను వాళ్ల దగ్గరికి తీసుకొని వెళ్లారు, బాప్తిస్మం నకు చాలామంది కావాలి కాబట్టి కొన్ని రోజులు ఆగారు, అలా నేను మా అక్క బావల ఇంటికి తరచూ వెళ్తూ ఉండేదాన్ని, నర్సీపట్నంలో మార్టిన్ అంకుల్ వాళ్ళ పెద్దబ్బాయి డేవిడ్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ మందిరం ను వాళ్ళే చూసుకునే వాళ్ళు,అక్కడ మందిర సహవాసం నాకు ఆత్మీయంగా మంచిగా అనిపించి, నేను ఎక్కువగా మా అక్క వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండేదాన్ని,
నేను నా భాప్తిష్మం కొరకు దేవుని ప్రార్థిస్తూ వచ్చాను, నెక్స్ట్ ఇయర్ వాగ్దానం నాకు భాప్తిష్మం గురించి కావాలి. నేను తీసుకోనేటట్లు వాగ్దానంలో నాకు రావాలి, అని నేను ప్రార్థిస్తూ వచ్చాను,నేను ఒక్కొక్క సంవత్సరం ఒకో విషయాన్ని వాగ్దాన రూపంలో బయలుపరచమని ప్రతి సంవత్సరం నేను వాగ్దానం తీసుకునే చాలా రోజులు ముందుగానే నేను దేవున్ని ప్రార్థిస్తూ వచ్చేదాన్ని,
ఆ తర్వాత సంవత్సరం 1994 నూతన సంవత్సరంలో నా ప్రార్ధనకు జవాబుగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం,యిర్మియా 31:4 "నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు." ఈ వాగ్దానమును నేను చూడగానే నాలో విశ్వాసం వచ్చేసింది, కచ్చితంగా ఈ సంవత్సరం నేను బాప్తిస్మం తీసుకుంటాను అని,
నేను ఆ జనవరి నెలలో మా అక్క వాళ్ళ దగ్గర ఉన్నపుడు,డేవిడ్ అన్న మా బావ గారితో అన్నారు"మీ మరదలు చాలా భక్తిగా విశ్వాసం గా ఉంటుంది కదా! నాకు తెలిసిన ఒక వ్యక్తి దేవుని సేవ కొరకు సమర్పించుకుని ఒక మందిరంలో ఉన్నాడు, తనకి వివాహం చేద్దాం! మీ మరదలకు ఇష్టమో కాదో ఒకసారి కనుక్కో అని మా బావ గారితో అన్నారు,
మా అక్క నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఆరోజు నేను దీనికి అస్సలు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆ సమయాలలో సేవకులు అనే వాళ్ళని ఎవరిని చూసినా వాళ్ళు చాలా పేద స్థితిలో ఉండే వాళ్ళు,అందుకే సేవకులను చేసుకుంటే కష్టాలు పడాలి. నేను ఎప్పటికీ సేవకులను వివాహం చేసుకోకూడదు, ఎవరినైనా ఒక మంచి జాబ్ చేసే వ్యక్తిని వివాహం చేసుకొని నేను దేవుని సేవకి మనీ ఇచ్చి సేవలో వాడభడాలి అన్న బలమైన నిర్ణయం నాలో ఉండేది, కాబట్టి నేను దానికి ఒప్పుకోలేదు,
ఆ రోజు రాత్రి నేను నిద్రిస్తున్న సమయంలో నాకు ఒక కల వచ్చింది, అ కలలో ఒక బైబిల్ ని నేను నా చేతితో పట్టుకొని నిలబడి ఉన్నాను, అభిషేకించిన వానిని ముట్టవద్దు అని ఆ బైబిల్ ని కిందపడి వేస్తున్నాను, ఆ బైబుల్ కింద పడిన వెంటనే మరల నేను అరే ••• నేనేమిటి ! బైబిల్ ని పడవ వేస్తున్నాను, అని బాధపడుతూ మళ్లీ ఆ బైబిన్ని వెంటనే పైకి నా చేతిలోకి తీసుకొని నిలబడుతున్నాను.
మరల ఆ బైబిల్ నా చేతులకు వచ్చినప్పుడు మరలా అదే వాక్యముతో అభిషేకించిన వానిని ముట్టవద్దు అని ఆ బైబిల్ ని కిందపడి వేస్తున్నాను, ఇలా ఆ బైబిల్ ని కిందపడ వేస్తూ మళ్ళీ వంగి దానిని తీసుకొని నిలబడుతూ ఇలా ఒక మూడు నాలుగు సార్లు కలలో చేశాను, నాకు వెంటనే మెలకువ వచ్చేసింది,
నాకు మెలకువ వచ్చినప్పుడు చాలా భయం అనిపించింది,ఎందుకంటే అప్పటివరకు ఎవరైనా సరే పొరపాటున వారి కాలు బైబిల్ కి తగిలితే వారికి నేను చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉండేదాన్ని, బైబిల్ గురించిన బైబిల్ కు ఉన్న ప్రాముఖ్యత వీరికి తెలవకుండా విశ్వాసులు గానే బ్రతుకుతున్నారు అని నాకు చాలా కోపం వచ్చింది,అటువంటి నేను నా చేతులతో బైబిల్ ని కిందపడ వేస్తున్నాను,
తెల్లవారి లేచినప్పుడు మా అక్కకి ఈ కల గురించి చెప్పినప్పుడు నేను సేవచెయ్యను అని అంటున్నావు కదా! అందుకే ఇటువంటి కల వచ్చింది అని అంది, అప్పుడు నాకు ఇంకా భయం మొదలైంది,వెంటనే నేను ఇక్కడ మీ దగ్గర ఉండను, నన్ను చింతూరు పంపించేయండి, అని వారితో గొడవ పెట్టుకున్నాను,అయిన వారు వినలేదు, వాళ్లు నా మాట వినటం లేదు అని చెప్పి, నేను ఒక రెండు రోజులు అన్నం తినటం మానేశాను, అప్పుడు మా బావగారు నన్ను బస్సు ఎక్కించారు,
అభిషేకించబడిన దేవుని వాక్యము అనే కాడిని మొయటం నాకు ఇష్టం లేక, నేను ఆ ప్రదేశాన్ని వదిలి వేశాను, కానీ దేవుడు నన్ను వదల లేదు, దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం,నన్ను వెంబడిస్తూనే ఉంది, ఆరోజు బస్సులో ఘాటి రోడ్డులో నుంచి నేను వస్తున్నప్పుడు అనుకోకుండా నేను ఉన్న బస్సు ని ఇంకొక బస్సు గుద్దింది,అది ఎవ్వరు ఊహించలేదు, అందరికీ, ముందు ఉన్న కడ్డీ తగలటమొ, వారి కళ్ల కున్న కల్ల అద్దాలు పగలటమొ జరిగింది, కానీ నాకు కొంచెం కూడా ఎక్కడ దెబ్బ తగలలేదు,నా చుట్టూ ఎవరిని చూసినా ఏదో ఒక దెబ్బ ఉంది,
అప్పుడు నాకు అనిపించింది, వామ్మో ••• నాకేం జరుగుతుంది, నా జీవితాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు నాకు ఇష్టం లేని సేవ, నా జీవితంలో రాబోతుందా! అన్న భయం నాలో
అ క్షణాన కలిగింది, ఆ రోజు నేను సాయంత్రం మా ఇంటికి వచ్చినప్పుడు నేను నా తల్లి గారితో చెప్పాను, ఇలా జరిగింది అని, ఆరోజు శనివారం,తెల్లవారి నేను ఆదివారం ఆరాధన కొరకు భద్రాచలం వెళ్లడానికి ఉదయమే బయలుదేరాను,
నా తల్లి గారు నివసించే చింతూరులో హెబ్రోన్ హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనులు ఉన్నప్పటికీని, నేను భద్రాచలం వెళ్లాను, ఎందుకంటే అక్కడికి, ఇక్కడ కంటే కొంచెం మంచి మంచి దైవజనులు వస్తారు, వాక్యం మంచిగా ఉంటుంది అని అక్కడికి వెళ్లాను,ఆరోజు ఆరాధన అయిపోయిన తర్వాత ప్రకటనలు తెలియజేశారు, అవి ఏమిటంటే,భద్రాచలం దగ్గరనున్న కొత్తగూడెంలో సంక్రాంతి సెలవుల సందర్భంగా యూత్ మీటింగ్స్ మూడు రోజులు పెడుతున్నారు అని,
అప్పటికి యూత్ మీటింగ్స్ అంటే ఎలా ఉంటాయొ నాకు తెలియదు, ఎప్పుడు వెళ్లలేదు కాబట్టి నేను అనుకున్నాను, యూత్ మీటింగ్ లో సాంగ్స్ యూత్ వాళ్ళకు నేర్పిస్తారు కావచ్చు, అని అనుకున్నాను, అప్పటికి నేను పాటలు అంటే చాలా ఇష్టంగా పాడుతూ ఉండే దాన్ని, సీయోను గీతాలు అనే పాటల పుస్తకంలో ప్రతి పాటను నేర్చుకోని పాడాలన్న తపన నాలో ఉండేది,
కేవలం నేను కొత్త పాటలు నేర్చుకోవటానికి మాత్రమే నేను ఆ వారంలో యూత్ మీటింగ్స్ కి వెళ్ళాను, ఆ మీటింగ్స్ కి ఆ మందిరం నుంచి, ఒక ఐదుగురమె వెళ్ళాము, ముగ్గురు అబ్బాయిలు, నేను సత్యవతి అనే నా ఫ్రెండ్, కొత్తగూడెం లో ఉన్న ఆ మందిరం ముందు బస్సు ఆగినప్పుడు, నేను బస్సు దిగిన వెంటనే ఆ మందిరం వైపు చూశాను,
మేము నిలుచున్న రోడ్డుకి, ఆ మందిరానికి మధ్య, చాలా పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ అంతా కూడా యెషయా 6:8 లో వున్న మా నిమిత్తము ఎవడు పోవును, అన్న వాక్యామును తెలుగులో ఇంగ్లీషులో వ్రాసి ఉన్న బ్యానర్స్ తో చాల వ్రేలాడ దీసి వుంచారు,
బస్సు దిగి నేను ఆ వాక్యాలను చూసినప్పుడు ఇంతకు ముందు యూత్ మీటింగ్స్ కి వెళ్లిన నా ఫ్రెండ్ సత్యాన్ని అడిగాను, ఏమిటే అవి అన్ని వేలాడ బెట్టారు ఒకటే వాక్యాన్ని అని, తాను ఇంతకుముందు వెళ్ళింది కాబట్టి వెంటనే చెప్పింది,
ఈ మూడు రోజులకు కూడా ఈ వాక్యం తోటే వర్తమానాలు ఉంటాయి అని,వెంటనే నాకు భయం అన్నది పట్టుకుంది, ఎందుకంటే నేను దేన్నయితే వదిలేసి వచ్చానో పాటల కొరకు ఇక్కడికి, ఇక్కడ కూడా మళ్లీ దానిని వినవలసి వస్తుందా! అన్న భయం నాలో వచ్చేసింది, అప్పుడు వెంటనే నా పక్కన మందిరంలోనికి నడుస్తూ ఉన్న నా ఫ్రెండు సత్యతో అన్నాను, ఎందుకో నే నాకు భయం అనిపిస్తుంది, ఈ త్రీ డేస్ నేనేమైనా మారిపోతానేమో అని,
నిజంగా ! ఆ మొదటి రోజు నుంచే దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు, మొదటిరోజు వర్తమానం అంత కూడా దేవుడు మన కొరకు సిలువలో ఏం చేశాడో, ఆ ప్రేమను తెలియజేస్తూ ఆ దేవుని ప్రేమకు మనము ఎలా స్పందిస్తున్నాము, అనే విషయాన్ని వర్తమానం రూపంలో ఇచ్చారు, ఆ మూడు రోజులు ప్రసంగం అంతా కూడా హెబ్రోన్ హైదరాబాద్ నుంచి వచ్చిన జాన్ విక్టర్ అన్న ఇచ్చారు,
మొదటి రోజు నుంచే నా హృదయంలో కలవరం మొదలైంది,రెండవ రోజు కూడా,నా ఫ్రెండ్ సత్యతో నేను అంటూ వచ్చాను,నేను ఇక్కడ్నుంచి వెళ్లే లోపు దేవుని సేవకి సమర్పించు కుంటానేమోనే అని,ఆ రెండో రోజు కూడా నేను దేవునితో వాదిస్తూ వచ్చాను నా మనసులో,
"ఈ లోకంలో చాల మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ కూడికలకు కూడ వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు కదా, వారిని మీ సేవ కొరకు పిలవండి, నన్ను ఎందుకు దేవా! నా హృదయాన్ని ఇలా కలవరపరుస్తున్నావు,నన్ను వదిలి వేయండి," అని నేను దేవునితో వాదిస్తూ వచ్చాను, మూడవ రోజు ఆఖరి కూడికలో ఆ సంవత్సరం హెబ్రోన్ సార్వత్రిక సంఘానికి తీసిన వాగ్దానము మూడు వాక్యాలు ఉంటాయి, అందులో ఒక వాక్యము "నా ప్రియుడు నా వాడు నేను అతని దానను" ఇది పరమ గీతాలలో ఉంది,
దీనిని సాంగ్ లాగా సిస్టర్స్ అందరూ కూర్చొని పాడుతూ ఉన్నప్పుడు,అటువైపు వచ్చిన జాన్ విక్టర్ అన్న విన్నారంట,ఆఖరి కుడికలో దాని గురించి చెప్పుతూ" నా ప్రియుడు నా వాడు అని అంటున్నావు, కానీ నేను అతని దానను అని అనటం లేదు,నా ప్రియుడు నా వాడు అన్నప్పుడు కాదు, నేను అతని దానను అన్నప్పుడే ఆ ప్రియుడు ఆ ప్రియురాలు బట్టి ఆనందిస్తాడు, అని ఒక ప్రియుడు ప్రియురాలికి మధ్య ఉన్న ఒక బాంధవ్యాన్ని గురించి వివరిస్తున్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది,
చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని వాక్యాలు వాటికి సంబంధించిన విషయాలు మనకు అర్థం కావు,ఈ లోక సంబంధమైన విషయాలతో వాటిని పోల్చి మనకి చెబుతున్నప్పుడు అప్పుడు కొన్ని మనకు అర్థమవుతాయి, అలానే ఆ రోజు నాకు ఆ వాక్యం గురించి, ఆ వాక్యములో ఉన్న అర్థాన్ని గురించి నాకు తెలిసింది,
"నీ కొరకు సిలువలో అన్ని శ్రమలు పడిన ఆ క్రీస్తు ప్రేమను ఆ దేవుని ప్రేమను, అనేకులకు తెలియజేయటానికి, నేను శ్రమపడలేను అని అంటున్నావు, ఇలా అయితే మా నిమిత్తము ఎవడు పోవును, అని దేవుడు నిన్ను అడుగుచున్నాడు, యెషయా వలె, నేనున్నాను నన్ను పంపు ప్రభువా, అని నీవు చెప్పగలవా! " అని జాన్ విక్టర్ అన్న ఆ చివరి కూడికలో వర్తమానాన్ని ఇస్తున్నప్పుడు,
అప్పటివరకు ఎందుకు దేవా! నా హృదయాన్ని యిల కలవరపరుస్తున్నావు, అని దేవునితో వాదిస్తూ వచ్చిన నేను,ఆ ఆఖరి కూడిక వర్తమానము ద్వారా, ఒక ప్రియుడు ప్రియురాలికి మధ్య ఉన్న ఆ బాంధవ్యాన్ని గురించి ఇన్ని రోజులు నేను ఎందుకు గ్రహించలేకపోయాను, ఇంత ఆలస్యంగా నాకు మీరు ఈ సత్యాన్ని నాకు ఎందుకు తెలియజేశారు, అని కన్నీటితో "మీ ప్రేమను తెలియజేయటానికి, మీ నిమిత్తము శ్రమ పడటానికి, నేనున్నాను నన్ను పంపు ప్రభువా,అని నన్ను నేను దేవుని సేవ కొరకు ప్రతిష్టించుకున్నాను.
నేను సంపూర్ణంగా దేవుని దాననుగా ఉండకుండా, ఇన్ని రోజులు నన్ను నేను దేవుని పరిచర్య కొరకు సమర్పించుకోకుండా,ఇంత సమయం వ్యర్థం చేశానే అన్నబాధ వేధన ఆ క్షణం నాలో కలిగింది.,
చూశారా దేవుడు మనతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఆది మనకు ఇష్టం లేనిది అయితే,దేవునికి విరోధముగా అప్పుడు మనము ఎంత పోరాడుతూ ఉంటామో! కానీ దేవుడు మన మనసును మార్చినప్పుడు, మనం ఎందుకు ఇంత ఆలస్యం చేసామా! అన్న బాధ వేదన మనలో కలుగుతూ ఉంటుంది,
దేవుడు మన జీవితంలో మనల్ని పిలిచే ప్రతి పిలుపు వెనుక,మన పట్ల దేవుని కొక ప్రణాళిక, మన పట్ల దేవుని ప్రేమ దాగి ఉంటుంది. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఆ దేవుని ప్రణాళికకు, దేవుని ఉద్దేశానికి, మొదట మనం భయపడి వెనుకడుగు వేయొచ్చు, కానీ ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చకుండా దేవుడు మనలను వదిలిపెట్టడు.
దేవుని చేతిలో పూర్తిగా మనల్ని మనము సమర్పించుకునేటట్లు, నేనున్నాను ప్రభు, నన్ను పంపు అని, యెషయా వలె చెప్పగల స్థితిలోనికి దేవుడు తన వాక్యం ద్వారా మనలను మారుస్తాడు, దేవుని పిలుపు ఎప్పుడూ మన లాభం కొరకు కాదు, కాని ఆయన ప్రణాళికలో మన జీవితం, మన ప్రాణం విలువైన సాధనముగా ఉండటానికి,వాడబడటానికే.
ఏ విషయం కొరకైనా, ఏ బాధ్యత కొరకైనా, దేవుడు మనలను పిలిచినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు, ఆ బాధ్యతలో, ఆ పనిలో, ప్రజలకు కనపడే రీతిలో, మనము ఉండకపోయినా, దేవుడి పిలిచిన ఆ పిలుపులో ఆ స్థితిలో మనము నిలబడి ఉండటం,ఇది మనకు సంతోషాన్నిస్తుంది. మనకు ధైర్యాన్నిస్తుంది, ఇలానే దేవుడు నన్ను నడిపిన ప్రతి ఒక్క అడుగు నా జీవితంలో ఒక పాఠం అవుతూ వచ్చింది,
ఎస్తేర్ క్రైసోలైట్
10-11-2025