CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

🌿✨ దేవుడు నడిపిన మార్గం,✨🌿

నా జీవిత సాక్ష్యం { 7 }

దేవుని వాక్యమే మనకు ఆదరణ, దేవుని వాక్యమే మనకు ధైర్యం, దేవుని వాక్యమే మన ఆత్మకు ప్రేరణ, దేవుని వాక్యమే మనకు బలము, దేవుని వాక్యమే మనకు సమృద్ధి, చివరకు దేవుని వాక్యమే మనకు ప్రాకారము,

అందుకే నేను ప్రతి నూతన సంవత్సరమే కాదు,నాకు బారం అని అనిపించిన,ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్లి దేవున్ని వాగ్దానం అడుగుతాను,
దేవుడు మనకు వాగ్దానం ఇస్తే మనము అడిగిన విషయంలో ఒక వాక్యం అన్నది దేవుని ద్వారా విడుదల అయితే, మనము దేవున్ని అడిగిన విషయం నెరవేరటానికి సమస్తము సమకూడి జరుగుతుంది,

నేను ఆ జనవరి నెలలో దేవుని సేవ కొరకు తీర్మానించుకున్న తర్వాత, ఫిబ్రవరి నెలలో నా తండ్రిగారు మరణించారు, తాను అలా అంత త్వరగా మరణిస్తారని,నేను అసలు ఊహించలేదు,
అందుకే నేను నా బాప్తీస్మం విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను,మా బావ గారు చెప్పినట్లు మార్టిన్ అంకుల్ తో తీసుకునేటట్లు అయితే, చాలా లేట్ అవుతుంది, ఎప్పుడు ఎవరికి మరణం అన్నది వస్తుందో తెలియదు, కాబట్టి నేను బాప్తీస్మం తీసుకొని సంపూర్ణ రక్షణ ను పొందాలి, బాప్తీస్మం సాక్ష్యం ఇవ్వాలి అని నిర్ణయించుకుని నా నిర్ణయాన్ని నా తల్లి గారికి చెప్పాను, నేను ఇక్కడనే బాప్తిస్మం తీసుకుంటాను అని,

మా తల్లిగారు చింతూరులోని దైవ జనులకు ఈ విషయాన్ని తెలియజేస్తే, ఆ దైవజనులు భద్రాచలంలో ఉన్నా,ఇంకొక పేద్ధ దైవజనులకు తెలియజేశారు, అప్పుడు ఆ మందిరంలో భద్రాచలం చుట్టుపక్కల మందిరాలలో ఉన్న బాప్తీస్మం కావాలి అని అనుకున్న, వారందరి పేర్లు తీసుకోవడం జరిగింది,ఆ ఫిబ్రవరి 20 న హైదరాబాద్ హెబ్రోన్ నుంచి అగస్టీన్ గారు వచ్చి మా అందరికీ బాప్తీస్మం ను ఇచ్చారు,

నాకు బాప్తీస్మం కావాలి అని దేవున్ని నేను వాగ్దానం అడిగినప్పుడు, దేవుడు నాకు యిర్మియా 31:4 లో ఉన్న "నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు" అనే ఈ వాగ్దానమును నాకు ఇచ్చి, ఆలస్యం చేయకుండా, ఆ సంవత్సరం నేను బాప్తిస్మం గురించి నిర్ణయం తీసుకునేటట్లు, ఎటువంటి భయపడే పరిస్థితులు, నా జీవితంలోకి దేవుడు తీసుకువచ్చాడో మీకు అర్థం అవుతుంది కదా,

నా బాప్తీస్మం విషయంలో నేను దేవుని వాగ్దానము గనుక అడగకపోతే,ఆ సంవత్సరం నేను భప్తిస్మం తీసుకున్న ఆ సమయానికి కూడా నేను ఇంకా మా బావగారి మాటను అనుసరించి, మార్టిన్ అంకుల్ తోనే నేను బాప్తీష్మం తీసుకోవాలి, అని అనుకుంటూ ఉండేదాన్ని,

ఇది చదువుతున్న మీరు ,మీ ఆత్మను రక్షించేది క్రీస్తు చిందించిన పరిశుద్ధమైన రక్తమని, ఆ రక్త ప్రోక్షణ లోనికి మీరు వచ్చి మీ పాపముల కొరకు, దేవుని దగ్గర క్షమాపణలు అడిగి, మీరు రక్షించ బడ్డార, అయితే వెంటనే బాప్తీస్మం అన్నది తీసుకోండి,

బాప్తీస్మం అంటే, క్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానలలో, నేను కూడా పాలి భాగమును కలిగి ఉన్నాను అని, మన హృదయంలో విశ్వసించిన విశ్వాసాన్ని, బహిరంగముగా ప్రజలకు సాక్ష్యం ఇవ్వటమే,

ఎ విషయం కొరకైనా వాగ్దానం అన్నది, మనం తీసుకున్నప్పుడు,దేవుడు దానికి తగిన పరిస్థితులను అన్నిటిని సమకూరుస్తాడు,దీనిని నేను నా అనుభవ పూర్వకముగా గ్రహించాను, కాబట్టి ప్రతి విషయంలో దేవుడి దగ్గర నేను వాగ్దానము అడుగుతూ ఉంటాను,

మనము మన విషయం కొరకే దేవుణ్ని ప్రార్థించి వాగ్దానం అడిగితే, అది మనకి మాత్రమే కాదండి, మనలాంటి అనుభవం గుండా వెళ్తున్న అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, నేను దేవున్ని వాగ్దానం అడగకముందు, అక్కడ అప్పుడే బాప్తీస్మా ములు ఇచ్చే పరిస్థితులు ఏమీ లేవు, నాకు లాగ ఇంకా ఎవరైనా అడిగారేమో దేవుని వాగ్దానం, నాకైతే తెలియదు కానీ, నేను అడిగినందుకు దేవుని వాగ్దానం నా విషయంలో దేవుడు ఇలా సమకూర్చాడు, అని నేను దేవున్ని నమ్మెను,

అందుకే దేవుని వాక్యము యెహేజ్కేలు 22:30 లో ఇలా సెలవిస్తుంది, "నేను దేశమును పాడుచేయ కుండునట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడ లేదు."

మనము,మన పరిసరాలలో,మన సమాజాలలో,మనకు లాంటి సమస్యలు, అవసరతలు కలికి ఉన్నవాళ్లు, మనకు లాంటి పోరాటంలో ఉన్నవారు, మనము వెళుతున్న మార్గాలలో ప్రయాణిస్తున్న వాళ్ళు,ఎంతమంది ఉన్నప్పటికీ,సమస్యలను పరిష్కరించే,వాక్యమనే వెలుగును వాగ్దానముగా,ఎవరు దేవుని దగ్గర నుంచి ప్రార్థించి తీసుకుంటారో, వారే బండ సందులలో నిలిచినవారు,వీరు వారికి మాత్రమే కాకుండా అనేకులకు వెలుగునిచ్చేవారు,దేవుని వెలుగును ఇతరులకు అందించేవారుగా ఉంటారు,

ఇతరులను, దేవుని మార్గంలోకి తీసుకు రాగలిగేటట్లు, దేవుడు ఎప్పుడూ కూడా, ప్రార్థనతో, దేవుని వాగ్దానములతో, పోరాడే వాళ్లనే,బండ సందులు లాంటి కష్టాలలో సమస్యలలో, బాధలలో, నిలువబడి ఉన్న వారినే, తన సాధనములుగా ఏర్పాటు చేసుకుంటాడు,

ఇటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు, అనే బండ సందులలో,ఉన్న వారిని చూసి,"ఎప్పుడు వీరికి కష్టాలే" అని సమాజం వీరిని హేలన చేస్తుంది, కానీ దేవుడు ఇటువంటి బండ సందులలో నిలువ కలిగిన ఆత్మీయులైన వారిని,దేవునితో ఇటువంటి సహవాసం చేసే వారిని,దేవుణ్ని అడిగి జవాబులను పొందే వారిని, దేవుడు వెతుకు తున్నాడు,

నేను బాప్తిస్మం తీసుకున్న ఆరోజు ఆదివారము, ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత బాప్తీస్మం ఇచ్చారు, సాయంత్రం హస్తనిక్షేపణ ప్రార్థనలు జరిగాయి, నేను బాప్తీస్మం తీసుకున్న దగ్గర నుండి ప్రార్థిస్తూ వచ్చాను,కొత్తగూడెం యూత్ మీటింగ్ లో అంత మంది ప్రజల మధ్య దేవుని వాక్యం నాకు వచ్చింది,నాతో మాట్లాడింది, అది నాకో, ఇంకెవరుకో, నాకు ఎలా అర్థమవుతుంది, నేనే అలా అనుకున్నానేమో, నా మనసులో అలా ఊహించుకున్నానేమో,

కాబట్టి వ్యక్తిగతంగా ఇప్పుడు బాప్తీస్మం వాగ్దానం ద్వారా దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు, అని నాతో మాట్లాడాలి,అప్పుడు నేను నమ్ముతాను, అప్పుడే అందరికీ నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, అని చెప్పుతాను, అని అనుకొని నేను ప్రార్థిస్తూ వచ్చాను,నేను బాప్తీస్మం వాగ్దానం తీసుకున్న తర్వాతనే,అందరికీ నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను అని చెప్పాను,

సాయంత్రం హస్త నిక్షేపణ ప్రార్ధనకు, నేను వచ్చినప్పుడు, మందిరంలోనికి నేను వెళ్ళకముందే అక్కడ నేను,ఆ మందిరానికి సంబంధించిన దైవజనురాలిని నేను అడుగుతూ వచ్చాను,ఇప్పుడు వాగ్దానాలు ఇస్తారా అని, ఆమె అన్నది ఇవ్వరు అని, అప్పుడు నాకు చాలా విచారం అనిపించింది, ఇంక దేవుడు ఎలా నాతో మాట్లాడుతాడు, మళ్ళీ నెక్స్ట్ఇయర్ వరకు, నేను వెయిట్ చేయాలా, అని చాలా విచారంతో నేను ఆ మందిరం లోపటికి వెళ్లాను,

ఒక పదిమంది దైవజనులు నా తల మీద చేతులు ఉంచి, హాస్త నిక్షేపణ ప్రార్ధనలు నాకు చేశారు,
తరువాత దేవుని వాక్యాన్ని చెప్పి,కానుక వేసే సమయంలో,అందరూ పైకి లేచి పాటను పాడుతున్నప్పుడు, నేను కానుక పెట్టి దగ్గర వాగ్దానాలను, ఒక ట్రే లో పెట్టి ఉంచడం చూశాను,

ఆ సమయంలో నాకైతే పట్టరానంత ఆనందమైంది,ఎందుకంటే దేవుడు నన్ను సేవకు పిలిచాడా లేదా అన్నది, ఇప్పుడు వ్యక్తిగతంగా నాతో ఈ వాగ్దానాం ద్వారా, రుజువు పరుస్తాడు కాబట్టి, ఆ క్షణం నుంచి మరల నేను నా మనసులో నేను ఆ పాటను పాడకుండా దేవున్ని ప్రార్థిస్తూ వచ్చాను, మీరు నన్ను పిలిస్తే ఇప్పుడు కచ్చితంగా నాకు వాగ్దానం రావాలి అని,

ఆ సమయాలలో చాలామంది దైవజనులు,వారి సాక్షాన్ని ఏమని చెప్తూ ఉండేవారు అంటే, దేవుడు నన్ను ""మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతులు"" అన్న వాగ్దానం ద్వారా దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు, అని సాక్ష్యం చెప్తూ ఉండేవాళ్ళు,

ఆ సమయంలో నేను అనుకున్నాను కదా, దేవుడు నన్ను సేవకు పిలిస్తే గనక, కచ్చితంగా నాకు ఇప్పుడు ఆ వాగ్దానమే వస్తుంది, దాని ద్వారానే దేవుడు నాతో మాట్లాడుతాడు అని అనుకున్నాను, నేను కానుక వేయటానికి వెళ్తున్నప్పుడు, నాతోపాటు బాప్తీస్మం తీసుకున్న నా తల్లి గారి చెల్లెలు మా పిన్ని, తాను వాగ్దానం తీసుకొని తిరిగి వస్తుంది,

నేను వెంటనే తన వాగ్దానము ఏమిటి అని చూసినప్పుడు,ఏ వాగ్దానం అయితే దేవుడు నాకు ఇస్తాడు అని అనుకున్నానో, ఆ వాగ్ధానమే మా పిన్ని చేతిలో ఉండటం చూసి నేను చాలా విచారణకు గురి ఆయ్యాను, ఆ క్షణం,నేను అనుకున్నది తనకి వెళ్ళిపోయింది, కాబట్టి ఇంక దేవుడు నన్ను పిలవలేదు కావచ్చు, నేను అలాగా యూత్ మీటింగ్ లో ఊహించుకున్నానేమో అని అనుకున్నాను,

నా వంతు వచ్చినప్పుడు, కానుకవేసి వాగ్దానం తీసుకున్నాను, కానీ నేను నా స్థలంలోకి వచ్చి కూర్చున్నా కూడా, దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చాడో నాకు చూడాలనిపించలేదు. ఎందుకు అంటే, నాలో నిరాశ కలిగింది, దేవుడు నన్ను పిలవలేదు అని, కొద్ది సమయం అయిన తర్వాత అప్పుడు నేను మరలా, "ఏమిచ్చాడో దేవుడు నాకు వాగ్దానం," అన్న తలంపు ఉంటుంది కదా! మనకి,

అలా నాకు అనిపించి, నా బైబిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న నా వాగ్దానాన్ని చూశాను, నా వాగ్దానమును చూసిన వెంటనే ఒక్కసారి నేను నా తల పైకెత్తి,అస్లాబ్ వైపు చూస్తూ, దేవున్ని ఒక్కటే అడిగాను, ఇప్పుడే ఈ క్షణమే నేను ఇలా కూర్చున్నప్పుడే, ఈ మందిరంలోనే, నన్ను మీరు చంపేయండి, దేవా! నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, మీరు ఎలా ఉంటారో నాకు ఈ క్షణమే చూడాలని ఉంది, అని నేను దేవుని అడుగుతూ వచ్చాను, నాకు అప్పుడు వచ్చిన వాగ్ధానం ఏమిటి అని అంటే,

యెషయా 43:1
భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

చూశారా ••••• మీరు నా వాగ్దానాన్ని, ఎంత మంచి వాగ్దానం అని మీరు అనుకుంటున్నారా, నాకు ఏమని అనిపించింది అని అంటే ఆ క్షణంలో, దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతాడు, మన హృదయంలో ఉన్నది ఏంటో గ్రహించి, అబ్బ •••• మనుషులు ఎవ్వరు కూడా, ఇలా మనకు సమాధానం ఇవ్వలేరు,
ఇందు కొరకే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం,

నాకు ఏదైనా సమస్య వస్తే ముందు దేవుణ్ణి అడుగుతాను,ఎందుకంటే నాకు తెలిసిన దేవుడు, నాకు అర్థమైన దేవుడు, నేను గ్రహించిన దేవుడు, మాట్లాడే దేవుడు, నా అవసరతను బట్టి, నా హృదయంలో ఉన్న దానిని బట్టి, నాకు సమాధానం ఇచ్చే దేవుడు, కాబట్టే నేను ఈ దేవున్ని విశ్వసిస్తాను, ఈ దేవున్ని నేను విశ్వసించడానికి కారణమేంటి అని అంటే, మొదటి కారణం నాతో మాట్లాడే దేవుడు కాబట్టి,

దేవుడు మనము అడిగిన దానికి సమాధానముగా,తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు మనకు కలిగే సంతోషము, ఆనందము, అది చాలా గొప్పది, దానిని దేనితో కూడా పోల్చలేము,

నేను వాగ్దానం తీసుకొని ఆ మందిరంలో నుంచి బయటికి వచ్చి నప్పుడు ఆ మందిరంలోని దైవజనురాలు,నన్ను అడుగుతూ వచ్చింది, ఏమి వాగ్దానం వచ్చింది అని, అంటే నేను వాగ్దానం ఇస్తారా అని అడగటం మూలాన, వాగ్దానాలు పెట్టేరేమో అని నాకు అనిపించింది, అందుకే గుర్తు పెట్టుకొని నన్ను అడిగింది ఏం వాగ్దానం వచ్చింది అని,

నాకు వచ్చిన వాగ్దానం తనకిచ్చి చూపించినప్పుడు, నా వాగ్దానాన్ని చూసి తాను వెంటనే ఏమీ అన్నదంటే, నీవు మనుషుల సొత్తు కాదు, దేవుని సొత్తు అని, అంతే ఇక నేను బయటికి వచ్చేసాను, అప్పుడు కూడా నేను తనకి చెప్పలేదు, నేను ఎందుకు ఈ వాగ్దానాన్ని తీసుకున్నాను అని, దేవుడికి నాకు మధ్య జరిగిన ఆ సంభాషణ, సేవ కొరకు నేనడిగిన విధానము అది ఏది కూడా తనకి నేను చెప్పలేదు,

అయినప్పటికీని తాను ఆ వాగ్దానం చూసి నీవు దేవుని సొత్తు అని చెప్పగలిగింది, మరొకసారి దేవుడు ఆ వాగ్దానం ద్వారా, దైవజనురాలు నోటి నుంచి నన్ను బలపరిచే వాక్యాలు వినిపించాడు, అప్పుడు నాకు ఇంకా విశ్వాసం వచ్చింది, దేవుడు నన్ను నిజంగా తన సేవ కొరకు పిలిచాడు అని,

ఈ వాగ్దానం ఆ సమయంలోనే కాదు, నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో అనుభవాలు గుండా వెళ్తూ వచ్చినప్పుడు నన్ను ఆదరించింది, నేను దేవుని సొత్తుని, నేను మనుషులకు సంబంధించిన దాన్ని కాదు, అన్న అంశమే నన్ను ఆదరిస్తూ వచ్చింది,

దేవుడు ఉన్నాడు అని నాకు ఎప్పుడైతే అర్థమైందో, ఆ రోజు నుంచి నేను, బాప్తిస్మం వాగ్ధానం తీసుకున్న, రోజు వరకు నేను దేవునిలో నడిచిన విధానం ఒకటైతే, బాప్తిస్మం వాగ్ధానం తీసుకున్న రోజు నుంచి నేను దేవునిలో నడిచిన విధానం వేరే,

నేను నా బాప్తీస్మం విషయంలో దేవుని ప్రార్థించి వాగ్దానమును అడిగినప్పుడు, దేవుడు నాకు, యిర్మియా 31:4 "నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు" అనే ఈ వాగ్దానమును నాకు ఇచ్చి, ఎలా నెరవేర్చినాడో మీకు అర్థమైంది కదా! అందుకే మీకు సంబంధించిన ప్రతి దాని విషయంలో, దేవుణ్ణి ప్రార్థించి, ఒక వాగ్దానం అడగండి,

ఎస్తేర్ క్రైసోలైట్
15-11-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨